Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు.. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కుర్ర హీరోల కంటే మంచి స్పీడ్ మీద సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోల అందరి కంటే ఎక్కువ సినిమాలు వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం సినిమాలను ఓకే చేయటంలో ఈ సీనియర్ హీరోలంతా ఒకే ఫార్ములా ఫాలో అవుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
మేటర్ ఏమిటంటే ఒకప్పుడు చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లతో సినిమాలు చేయాలంటే… కచ్చితంగా దర్శకుడు మంచి ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. హిట్ ట్రాక్ కూడా బాగా గమనించేవారు. సూపర్ హిట్ ఫామ్ లో ఉన్న దర్శకులకే అవకాశాలు ఇచ్చే పరిస్థితి. కాని ప్రస్తుతం మన సీనియర్ హీరోలు డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ చూడకుండా.. కొత్త దర్శకుడు అయినా సరే అవకాశాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. చాలావరకు కొత్త దర్శకులతో సినిమాలు చేయటానికి సీనియర్ హీరోలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే బాలయ్య బాబుతో సంపత్ నంది సినిమా చేయడానికి రెడీ అయినట్లు టాక్. మరోపక్క వెంకటేష్..కూడా ఇదే తరహాలో సినిమాలని లైన్ లో పెడుతున్నారు. చిరంజీవి అయితే డైరెక్టర్ బాబీ ఇంకా మరి కొంతమంది కుర్ర దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. మొత్తంమీద చూసుకుంటే గతానికి భిన్నంగా సీనియర్ హీరోలు ఇప్పుడు కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి ముందుకు రావటం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత టెక్నాలజీని వాడుకునే విషయంలో వీళ్ళందరికీ ఒక మంచి అవగాహన ఉండటం తోనే సీనియర్ హీరోలు సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!