Puri jagannath: టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడంలో డైరెక్టర్ పూరి స్టైలే వేరు. టాలీవుడ్ ఇండస్ట్రీ 40 సంవత్సరాల రికార్డులను చిత్తు చిత్తు చేసిన పోకిరి.. సినిమాని చాలా తక్కువ టైంలో తెరకెక్కించి.. పూరీ తన పెన్ పవర్ సత్తా ఏంటో ప్రూవ్ చేశాడు. ఆ తర్వాత బిజినెస్ మాన్ కూడా తక్కువ టైంలో దాదాపు నాలుగు నెలల లోపే తెరకెక్కించి.. మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇండస్ట్రీలో హీరోలకు మాస్ ఇమేజ్ తీసుకురావటంలో పూరి పనితనం చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
ఇదే విషయాన్ని దిగ్గజ దర్శకుడు రాజమౌళి కూడా తెలియజేశారు. ఒక హీరో అనే మాస్ ఇమేజ్ ఒక్కసారిగా పెంచటంలో పూరి మార్క్ స్టైల్ చాలా వెరైటీ అని తెలపడం జరిగింది. బుజ్జిగాడు తో ప్రభాస్, బద్రి తో పవన్, పోకిరి తో మహేష్ కి ఒక సపరేట్ మాస్ ఇమేజ్ పూరి యే తీసుకురావడం జరిగిందని అప్పట్లో రాజమౌళి తెలిపారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల గురించి… పూరి భార్య లావణ్య ఇంటర్వ్యూలో వైరల్ కామెంట్లు చేశారు.
రవితేజ తమ ఇంటికి వస్తే నేల మీద కూర్చుంటూ నేల మీద పడుకుని… ఇంట్లో వాళ్ళందరూ తో సొంత మనిషిలా కలిసి పోతారని తెలిపారు. బన్నీ అయితే అక్క అంటూ పిలుస్తాడు అని.. నేను పని వాళ్ళ అమ్మగారిని అమ్మ అని పిలుస్తాను అని.. లావణ్య చెప్పుకొచ్చారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటికి గెట్ టుగెదర్ పార్టీల సమయంలో కుటుంబ పరంగా అందరూ హాజరవుతామని స్పష్టం చేశారు. అదేవిధంగా… చిరంజీవి భార్య సురేఖ ఎంతగానో ఆదరిస్తారని వదిన అని పిలుస్తాను అని తెలిపారు. తన ఆల్ టైం ఫేవరేట్ హీరో మెగాస్టార్ చిరంజీవి అంటూ… పూరి భార్య లావణ్య తన అభిమానాన్ని ఓ ఇంటర్వ్యూలో చాటుకున్నారు.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!