Unstoppable 2: బాలకృష్ణ పోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ టాక్ షోకు వచ్చిన టిఆర్పి రేటింగ్ మరే టాక్ షోకు రాలేదు అనడంలో సందేహమే లేదు.. అన్ స్టాపబుల్ సీజిన్ 2 చంద్రబాబు నాయుడు రాకతో ఈ షో టి ఆర్ పి రేటింగ్ చేరుకుంది.. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి ఈసారి ప్రభాస్ ఈ టాక్ షోకు రానున్నారని సోషల్ మీడియా కోడై కోసింది.. ఇప్పుడు అదే నిజమని ఆహా అధికారికంగా ప్రకటించింది..
ఆహా టీమ్ బాహుబలి ఎపిసోడ్ స్క్రీనింగ్ అవుతుంది అంటూ ప్రభాస్, బాలకృష్ణ సినిమాలలోని కొన్ని సీన్లతో వీడియోను రిలీజ్ చేసింది.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ తో పాటు గోపీచంద్ రానున్నట్లు సమాచారం. ప్రభాస్ ఈ షోకు రానుండడంతో ఎలాంటి విషయాలను బాలయ్య అడుగుతాడు అని ప్రేక్షకులలో ఆత్రుత మొదలైంది. ఆదివారం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ ఎపిసోడ్ క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది..
ప్రభాస్ టీం తాజాగా అన్ స్టాపబుల్ షో లో బాలకృష్ణ వేస్తున్న ప్రశ్నలు తక్కువ నివిడి ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. అందులో బాలకృష్ణ డబల్ ఎక్స్ఎల్, త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెఏల్ అంటూ ఏదో ప్రశ్న వేయిస్తుండగా.. ప్రభాస్ నవ్వుతాడు. ఇక ప్రభాస్ పాదాలను ఆ వెంకటేశ్వర స్వామి పాదాలు అని బాలయ్య అనగానే.. ప్రభాస్ పక్కపక్క నవ్వేస్తాడు.. పది నిమిషాలు వీడియో ఉన్నాయి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఫుల్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
Darling 💛😍😘#NBKWithPrabhas#UnstoppableWithPrabhas#UnstoppableWithNBKS2 pic.twitter.com/Rdl8quPNSO
— Prabhas™ (@Prabhas_Team) December 11, 2022
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!