Salman Venkatesh: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి తెలుగు సినిమా రంగంలో టాప్ హీరోలతో మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మెగా హీరోలతో సల్మాన్ కి మంచి రిలేషన్ ఉంది. అందువల్లనే అప్పట్లో చిరంజీవి 60వ జన్మదినోత్సవ వేడుకలకు రావడం మాత్రమే కాదు రామ్ చరణ్ “జంజీర్” బాలీవుడ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో సల్మాన్ కీలక పాత్ర పోషించారు.
ఇక ఇదే సమయంలో “RRR” కి కూడా మంచి సపోర్ట్ చేయటం జరిగింది. ఆ తర్వాత మొన్ననే చిరంజీవి “గాడ్ ఫాదర్” సినిమాలో కీలక పాత్ర పోషించడం మాత్రమే కాదు త్వరలో స్టెప్పులు కూడా సల్మాన్ వేయనున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు సల్మాన్ విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. తన కొత్త సినిమా “కబీ ఈద్ కబీ దివాలి” లో ఒక కీలకమైన పాత్రలో వెంకటేష్ నీ చేయాలని సల్మాన్ కోరినట్లు దానికి వెంకీ ఓకే చెప్పినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ఈ సినిమా తెలుగులో కూడా డాబ్ చేయనున్నారని దీంతో తెలుగు మార్కెట్ నీ దృష్టిలో పెట్టుకుని వెంకీతో ఆ కీలక పాత్ర సల్మాన్ చేయిస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నయి. ప్రజెంట్ వెంకటేష్ చాలావరకు మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ ఉన్నారు. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”తో మహేష్ తో మల్టీస్టారర్ సినిమాలకు శ్రీకారం చుట్టిన వెంకటేష్ ఆ తర్వాత రామ్, నాగ చైతన్య, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్…లతో మల్టీస్టారర్ చేయడం జరిగింది. కాగా ఈ సారి బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కి వెంకీ చేయడానికి రెడీ అయినట్లు ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!