`బిచ్చగాడు` సక్సెస్‌తో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న విజయ్ ఆంటోనికి `భేతాళుడు`, `యమన్`, `ఇంద్రసేన`, `రోషగాడు` చిత్రాలేవీ కనీస విజయాన్ని కూడా దక్కించుకోలేకపోయాయి. ఇప్పుడు విజయ్ ఆంటోని తన ఆశలన్నింటినీ క్రైమ్ థ్రిల్లర్ `కిల్లర్`పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనితో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ కూడా నటిస్తుండటం విశేషం. ఆషిమా నర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా స్నీక్ పిక్ టీజర్‌ను విడుదల చేశారు. అర్జున్ బిగ్ సీడీని విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆండ్రూ లూయిస్ దర్శకుడు. ఈ సందర్భంగా సైమన్ కె.కింగ్ మాట్లాడుతూ.. సంగీత దర్శకుడిగా ఇది నా తొలి తెలుగు చిత్రం. 3 పాటలుంటాయి. వేటికవే విభిన్నమైనవి. భాష్యశ్రీ మంచి లిరిక్స్ ను ఇచ్చారు“ అన్నారు. భాష్యశ్రీ మాట్లాడుతూ “అన్నీ విబాగాల్లో ఇదొక అద్భుతమైన చిత్రం. విజయ్ ఆంటోని, అర్జున్‌గారి నటన కిల్లర్ సినిమాకు హైలెట్ . ఇదొక స్టైలిష్ క్రైమ్ థ్రిల్లర్. ప్రేక్షకులకు తరువాత ఏం జరుగుతుందన్న ఇంట్రెస్ట్ ఉంటుంది“ అన్నారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ “అర్జున్, విజయ్ ఆంటోని తెలుగులో హిట్స్ ఇచ్చిన నటులు. వారు గౌరవ ప్రదమైన నటులు. వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా సక్సెస్ కావాలని ఆశిస్తున్నాం“ అన్నారు. అషిమా మాట్లాడుతూ “ దర్శకనిర్మాతల వల్ల ఈ సినిమాలో అవకాశం వచ్చింది. అది కూడా అర్జున్, విజయ ఆంటోనిలతో నటించటం అదృష్టం. అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం“ అన్నారు.
డైరెక్టర్ ఆండ్రూ లూయిస్ మాట్లాడుతూ “నాకు తెలుగు రాకున్నా ,తెలుగు వారికి నచ్చే సినిమా తీశాం. విజయ్ ఆంటోని నా స్నేహితుడు. తన వల్లే ఈ సినిమా చేశాను. అర్జున్ గారు మా సినిమాలొకి రావటమే మా మొదటి సక్సెస్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ .టెక్నికల్‌గా కిల్లర్ నెక్ట్స్ లెవెల్ మూవీ . నిర్మాత ప్రదీప్ సపోర్ట్ మాకు ప్రధాన బలం“ అన్నారు.
విజయ్ ఆంటోని మాట్లాడుతూ “అర్జున్‌గారితో కలిసి ఈ సినిమా చేయటం నా అదృష్టం. ఆయన యాక్షన్ స్టైల్ కింగ్. ఆండ్రూ నా స్నేహితుడే . అషిమా ఈ సినిమాతో డ్రీమ్ గర్ల్‌గా మారుతుంది. ప్రదీప్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తీశారు. చదలవాడ శ్రీనివాసరావు గారు నాకు గాడ్ ఫాదర్.భాష్య శ్రీ నాకు మరో సోదరుడు. తను లేకుండా నా సినిమా తెలుగులోకి రాదు. మంచి సినిమా చేశాం. హాలీవుడ్ తరహా సాంకేతికత మా సినిమాలో చూస్తారన్నారు. మే లో విడుదల చేస్తాం“ అన్నారు. అర్జున్ మాట్లాడుతూ “ కిల్లర్ సినిమాలో చాలా రోజుల తర్వాత పోలీస్‌గా చేస్తున్నాను. ఇదొక విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్. నా పాత్ర కూడా ప్రత్యేకంగా ఉంటుంది. దర్శకుడి ప్రతిభ, తాను రాసిన కథనం ఈ సినిమాకు ప్రధాన బలం. విజయ్ ఆంథోనీ మంచి మనిషి. కిల్లర్ ఎవరనేది సినిమా చూసి తెలుసుకోవాలి“ అన్నారు.
అర్జున్ ,విజయ్ ఆంటోని , అషిమా నర్వాల్ ,నాజర్ ,సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రామ్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి:మాటలు,పాటలు: భాష్యశ్రీ,సంగీతం: సైమన్ కె.కింగ్, ఛాయాగ్రహణం: మ్యూక్స్, ఎటిడింగ్: రిచర్డ్ కెవిన్.ఎ, పోరాటాలు: దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్: వినొద్ రాజ్ కుమార్, సమర్పణ: బి.ప్రదీప్, నిర్మాణం: దియా మూవీస్, కథ-కథనం- దర్శకత్వం: ఆండ్రూ లూయిస్.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!