NewsOrbit
న్యూస్ సినిమా

Vijay – samantha: మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆయనను ఫిక్స్ చేస్తారని ఎవరూ ఊహించలేదు.

Vijay – samantha: టాలీవుడ్‌లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ అంటే అభిమానుల్లో ఉండే ఆరాటం మరో రేంజ్. అలాంటి రేర్ కాంబినేషన్ విజయ్ దేవరకొండ – సమంతలది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి జంటగా ఓ సినిమా చేస్తున్నారని ఇటీవల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కూడా లాక్ అయింది. ఇంకా చెప్పాలంటే గత ఏడాదే ఈ సినిమాను అధికారికంగానూప్రకటించారు. దీనికి నిన్నుకోరి, మజిలీ సినిమాల తో క్రేజీ డైరెక్టర్‌గా మారిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.

vijay-samantha-no-one-thought-he-is-going-to-be-fixed-as-music-director
vijay-samantha-no-one-thought-he-is-going-to-be-fixed-as-music-director

వాస్తవంగా లైగర్ సినిమా షూటింగ్ గనక ఆలస్యం కాకపోయి ఉంటే గత ఏడాదే శివ నిర్వాణ – విజయ్ దేవరకొండల కాంబో సినిమా మొదలయ్యేది. ఇక టక్ జగదీష్ సినిమా కూడా ఫలితం ఆశించినట్టుగా రాకపోవడంతో కాస్త సమయం తీసుకొని పక్కాగా దర్శకుడు శివ నిర్వాణ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పట్టాలెక్కడానికి రెడీ అవుతోంది. ఇక ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. సమంతను హీరోయిన్‌గా తీసుకుంటున్నారనే ప్రచారం జరగడం. దాదాపు ఈ ప్రాజెక్ట్‌లో సమంతనే ఫిక్స్ చేశారట. సమంత ఇప్పటికే దర్శకుడు శివ నిర్వాణతో మజిలీ సినిమా
చేసింది.

Vijay – samantha: ‘రోజా’ సినిమా తరహాలోనే..

అలాగే, విజయ్ దేవరకొండతో కలిసి మహానటి సినిమాను చేసింది. ఆ కారణంగానే ఈ మూవీలో సమంతను ఎంచుకున్నారట. ఇక దేశభక్తి ప్రధానంగా సాగే ఈ సినిమాను ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం ‘హృదయం’ చిత్రానికి సంగీతం అందించిన ‘హేశం అబ్దుల్ వాహబ్’ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా మణిరత్నం దర్శకత్వంలో అరవింద స్వామీ, మధుబాల నటించిన రోజా సినిమా తరహాలోనే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘హేశం అబ్దుల్ వాహబ్’ను ఎంచుకుంటారని మాత్రం ఎవరూ గెస్ చేయలేదు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri