Salman Khan: కండల వీరుడు సల్మాన్ ఖాన్ నీ ఆయన తండ్రి సలీం ఖాన్ నీ చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు లెటర్ విడుదల చేయడం మీడియాలో సంచలనంగా మారింది. ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో శంకర్ సిద్దు మూసేవాలా నీ చంపినట్లు గానే సల్మాన్ ఖాన్ నీ చంపేస్తానని ఆ లెటర్ లో పేర్కొనటం జరిగింది అంట. దీంతో వెంటనే ఈ లెటర్ పై ముంబై పోలీసులకు సల్మాన్ ఖాన్ కుటుంబం ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో విచారణ చేపట్టిన ముంబై పోలీసులు… లెటర్ ఎవరు రాశారు అన్నదానిపై దర్యాప్తు స్టార్ట్ చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ ఇటీవల ఉదయం జాగింగ్ కి వెళ్లిన సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి బెంచ్ దగ్గర కూర్చున్నప్పుడు.. ఈ లెటర్ దొరకటం జరిగిందట. ఆ లెటర్ లో స్పష్టంగా కొడుకు సల్మాన్ ఖాన్ నీ అతనిని చంపేస్తామని పేర్కొన్నారట. పంజాబ్ సింగర్ సిద్ధూ మూస్ వాలా లాని చంపిన మాదిరిగానే సల్మాన్ ఖాన్ నీ కూడా హతమారుస్తామని తెలిపారట. సరిగ్గా ఉదయం 7:30 నుండి 8 గంటల మధ్య సమయంలో ఈ లెటర్ సల్మాన్ ఖాన్ తండ్రి చేతికి అందడం జరిగిందట. దీంతో ముంబై పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ మీడియా వర్గాలలో సంచలనంగా మారింది.
ఇక ఇదే సమయంలో సల్మాన్ అభిమానులు కూడా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త రావడంతో రక రకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ “కబీ ఈద్ కబీ దివాలి” అనే కొత్త సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో పాటు విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఇదే సమయంలో సల్మాన్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న “గాడ్ ఫాదర్” లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!