Youtube Interviews: బుల్లితెర లేదా వెండితెర స్టార్లు అయిపోతే నటిస్తే.. లేదా షోలు చేస్తేనే డబ్బులు వస్తయ్ అనుకుంటున్నారేమో… ట్రెండ్ మారింది. సోషల్ మీడియా/ డిజిటల్ మీడియా పైత్యం ఇటు వినియోగదారులకు, అటు యూట్యూబర్లకు ఆవహించింది.. అందుకే ఆ పైత్యాన్ని కొందరు స్టార్లు చక్కగా కాష్ చేసుకుంటున్నారు.. ఈ మధ్య (అంటే ఓ రెండు, మూడేళ్ళుగా..) యూట్యూబ్ చానెళ్లు ఎక్కువయ్యాయి కదా.. వాటిలో ఇంటర్వ్యూలూ ఎక్కువయ్యాయి కదా.. యూట్యూబ్ ని బాగా గమనిస్తే చాలా చానెళ్లు ఒకే ఇంటర్వ్యూని ముక్కలు ముక్కలు చేసి.. వేసిందే వేసి వ్యూస్ రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి..! టీఎన్నార్.., నాగరాజుల ఇంటర్వ్యూలూ తీసేస్తే చాలా వరకు ఛానెళ్లలో వచ్చే ఇంటర్వ్యూలూ పెయిడ్ అనే విషయం చాలా మందికి తెలియదు.. ఎవరెవరు ఎంత తీసుకుంటారో ఓ లెక్క చూద్దాం..!
Youtube Interviews: జబర్దస్త్ కమీడియన్లు..!
ఈటీవీలో వచ్చే జబర్దస్త్ స్టార్లు కొన్నేళ్లుగా యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉంటున్నారు. వారిలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్, బులెట్ భాస్కర్, అదిరే అభి, చంటి ముందు వరుసలో ఉంటారు. వీళ్లకు ఒక్కొక్కరికీ ఒక్కో రేటు ఉంటుంది.
* సుడిగాలి సుధీర్ ఏదైనా యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే రూ. 30 వేలు తీసుకుంటారు. కనీసం పాతిక వేలు ఇవ్వనిదే దొరకరు. కనీసం వారానికి ఒకటి ఇస్తుంటారు..
* హైపర్ ఆది ఏదైనా యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే రూ. 15 వేలు నుండి రూ. 20 వేలు తీసుకుంటారు. గెటప్ శీను కూడా ఇదే ధర ఉంటుంది.
* ఆటో రామ్ ప్రసాద్, బులెట్ భాస్కర్, నరేష్, చంటి, ముక్కు అవినాష్ తదితరులు ఇంట్వ్యూలు ఇవ్వాలంటే రూ. పది వేలు ఇవ్వాల్సి ఉంటుంది.
* ఇటీవల కొంచెం ఫెమస్ అయిన ఇమ్మాన్యుయేల్, వర్ష జంటగా రావాలంటే రూ. 25 వేలు ఇవ్వాల్సి ఉంటుంది.
(వారి ఇంటర్వ్యూ ఎంత మంది చూస్తారు..? ఎన్ని వ్యూస్ వస్తాయి..? ఆ చానెళ్లకు ఎంత ఆదాయం వస్తుంది..? అనే లెక్కలు వేసుకుని వీరి డిమాండ్ ఉంటుంది)
సినీ సైడ్ కారెక్టర్ నటీమణులు/యాంకర్లు..!
ఇక సినిమాల్లో సైడ్ పాత్రలు వేసే మధ్య వయసు నటీమణులు కూడా మంచి మార్కెట్ ఉంది. ప్రగతి, సురేఖ వాణీ, హేమ, పవిత్ర లోకేష్ తదితరుల ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో వస్తే లక్షల్లోనే వ్యూస్ వస్తాయి. వీరిలో ఎక్కువగా ప్రగతి, సురేఖ వానికి డిమాండ్ ఉంటుంది. అందుకే పారితోషికం కూడా అలాగే ఉంటుంది.
* ఒక గంట ఇంటర్వ్యూ కి ప్రగతి రూ. 20 వేలు, సురేఖ వాణీ 20 వేలు వరకు తీసుకుంటారు. హేమ, పవిత్ర లోకేష్ లు రూ. 12 వేలు అడుగుతారు.
* యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో అందరి కంటే ఎక్కువ డిమాండ్ చేసేది యాంకర్ అనసూయ. ఆమె ఒక గంట ఇంటర్వ్యూ కి రూ. 40 వేలు తీసుకుంటారు. రష్మీ రూ. 20 వేలు, వర్షిణి రూ. 12 వేలు వరకు తీసుకుంటారు.
(అయితే ఓ పెద్ద షరతు. సబ్ స్క్రైబర్లు కనీసం ఎనిమిది లక్షల మంది ఉంటె ఏమి తీసుకోకుండా ఫ్రీగానే వస్తారు. కానీ లక్ష లోపు సబ్ స్క్రైబ్ర్లు ఉంటె అసలు ఇంటర్వ్యూ కి దొరకరు. మధ్యస్థంలో ఉన్న చానెళ్ళు అయితేనే పైన చెప్పుకున్న ధర తీసుకుంటారు..!)
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!