Meet cute : తాజాగా నేచురల్ స్టార్ నాని మీట్ క్యూట్ అనే విభిన్నమైన టైటిల్ తో ఒక కొత్త సినిమాను ప్రకటించాడు. ఆయన సినిమాలలో హీరోగా నటిస్తూ బిజీగా ఉంటూనే నిర్మాతగా తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ లో వినూత్న కథలతో కూడిన సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఆయన సంస్థ నుంచి అ..! వంటి ప్రయోగాత్మకమైన చిత్రం వచ్చి అందరి ప్రశంసలు అందుకుంది. నాని అందరు నిర్మాతల మాదిరిగా కమర్షియల్ సినిమాలు నిర్మిస్తాడని బ్యానర్ అనౌన్స్ చేసినప్పుడు అందరూ భావించారు. కానీ నాని నిర్మించే సినిమాలతో అది పూర్తిగా రాంగ్ అని ప్రూవ్ అయింది.
మొదటి సినిమా అ..! లో రెజీనా, నిత్యామీనన్, కాజల్ అగర్వాల్, ఈషా రెబ్బ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ అనే యంగ్ డైరెక్టర్ టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. కమర్షియల్ గా పెద్ద హిట్ కాకపోయినప్పటికి అవార్డ్ లు అందుకుంది. ఇక ఈ సినిమా సీక్వెల్ ప్లాన్ చేసి మళ్ళీ ఎందుకనో డ్రాపయ్యారు. కాగా తాజాగా ప్రకటించిన మీట్ క్యూట్ సినిమాలో కూడా అయిదుగురు హీరోయిన్స్ నటించే అవకాశం ఉంది. వారిలో దాదాపు క్రేజీ హీరోయిన్స్ ని నాని సెలెక్ట్ చేయాలని చూస్తున్నాడట.
Meet cute : అదా శర్మని ఎంచుకున్నారు.
అందులో భాగంగా ఇప్పటికే హార్ట్ ఎటాక్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన అదా శర్మని ఎంచుకున్నారు. ఈ విషయం అదా స్వయంగా వెల్లడించారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుండగా చాలా ఆతృతగా ఇందులో నటించడానికి ఎదురు చూస్తున్నట్టు తెలిపింది. ఇక కాజల్ అగర్వాల్, నివేథా థామస్, రుహాని శర్మ కూడా దాదాపు ఫైనల్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ వారం పదిరోజుల్లో వీరిద్దరికి సంబంధించిన కన్ఫర్మేషన్ కూడా రాబోతుందట. ఇక నాని వీరిని ప్రాజెక్ట్ లోకి ఆహ్వానిస్తూ ఒక్కరిని అధికారకంగా ప్రకటించనున్నాడు. ఈ వరుసలో ముందు అదా శర్మ ఉంది.