న్యూస్ సినిమా

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ 3:30 సీక్రెట్ ఏంటో తెలిసిపోయింది.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే!

Share

Pawan Kalyan : ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాడు. భీమ్లా నాయక్ తో ఫ్యాన్స్ ని బీభత్సంగా ఎంటర్ టైన్ చేసిన పవన్ ఇప్పుడు హరి హర వీర మల్లు, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలోని ఓ సినిమాతో అలరించడానికి రెడీ అయ్యాడు. అయితే హరి హర వీర మల్లు మూవీ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ 3:30 సీక్రెట్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ 3:30 సీక్రెట్

 

ఈ మూవీని హిందీలో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది మొఘల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండటంతో డైలాగ్స్‌ కోసం బాలీవుడ్ రచయితలను పవన్ ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే పవన్ 3:30 సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని అభిమానులు కుతూహల పడుతున్నారు. ఐతే ఇన్‌సైడ్ టాక్ ఏమిటంటే, హరిహర వీరమల్లు సినిమాలో పవన్ మూడు వేర్వేరు అవతారాలలో కనిపిస్తాడు. వీర మల్లుగా అందరినీ థ్రిల్ చేయడానికి పవన్ ఏకంగా 30 విభిన్న వేరియేషన్‌లలో కనిపిస్తాడు. ఇలా మూడు అవతారాలు, 30 వేరియేషన్స్ ని 3:30గా పిలుస్తున్నారు. ఇలా పవన్ కనిపిస్తే ఫాన్స్ కి పూనకాలే అని చెప్పవచ్చు.

మూవీ కాస్ట్ అండ్ క్రూ

క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజాబ్, మొఘల్ యువరాణి రోల్స్ లో బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, నోరా ఫతేహి కనిపిస్తారు. కీరవాణి సంగీత దర్శకుడు అందిస్తుండగా.. ఈ మూవీతో పవన్ కొడుకు అకీరా నందన్ సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇవ్వడం విశేషం.


Share

Related posts

ప్రియ‌మ‌ణి మాటలకూ కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ, ప్రియమణి!

Teja

MP RRR Case: బిగ్ ట్విస్ట్..గుంటూరు జిల్లా జైలుకు ఎంపీ ఆర్ఆర్ఆర్ తరలింపు..!!

somaraju sharma

Eluru Municipal Corporation Counting: బ్రేకింగ్.. ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..! కౌంటింగ్ తేదీ ఖరారు చేసిన ఎస్ఈసీ..!!

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar