NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena – TDP: సీట్ల సర్దుబాటుపై చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ వరుస భేటీలు.. జనసేన పోటీ చేయబోయే స్థానాలు ఇవే..?

Janasena – TDP: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే రోజు రెండు పర్యయాలు భేటీ కావడం, సుదీర్ఘంగా చర్చలు జరపడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీట్ల సర్దుబాటుపై ఫైనల్ చర్చల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం దాదాపు మూడు గంటల పాటు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ సమావేశమైయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఆదివారం రాత్రి గంటలకుపైగా భేటీ అయ్యారు.

రెండు పార్టీల పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై విస్తృత చర్చ జరిగినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ, ఏ సీటులో ఎవరు పోటీ, ఎవరిని బరిలో దింపాలి అనే విషయంలో ప్రధానంగా చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. చర్చలు ఇప్పటికే కొలిక్కి వచ్చాయని అంటున్నారు. మరో సారి ఈ నెల 8న చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఆ తర్వాత సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి బహిరంగ సభలపై స్పష్టత ఇవ్వనున్నారని సమాచారం.

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుస భేటీలు నిర్వహించడంతో జనసేన పోటీ చేయనున్న స్థానాలపై ఒక క్లారిటీ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీ దాదాపు 35 స్థానాలకుపైగా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పోటీ చేయనుందని అంటున్నారు. జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల లిస్ట్ ను పవన్ కళ్యాణ్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ స్థానాల వారీగా జనసేన ప్రతిపాదిస్తున్న సీట్ల వివరాలను ఒక సారి పరిశీలన చేస్తే..

విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నెలిమర్ల, అనకాపల్లి పరిధిలో పెందుర్తి, యలమంచిలి, కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాకినాడ రూరల్, పిఠాపురం, రాజమండ్రి పరిధిలో రాజమండ్రి రూరల్, రాజానగరం, అమలాపురం పరిధిలో రామచంద్రాపురం, అమలాపురం, రాజోలు, కొత్తపేట, నరసాపురం పార్లమెంట్ పరిధిలో భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు పరిధిలో ఉంగుటూరు, కైకలూరు, విజయవాడ పరిధిలో విజయవాడ వెస్ట్, మచిలీపట్నం లోక్ సభ పరిధిలో ఆవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

అలానే గుంటూరు పరిధిలో తెనాలి, గుంటూరు వెస్ట్, బాపట్ల పరిధిలో చీరాల, ఒంగోలు లోక్ సభ పరిధిలో దర్శి, గిద్దలూరు, నెల్లూరు పరిధిలో కోవూరు, తిరుపతి పార్లమెంట్ పరిధిలో తిరుపతి, రాజంపేట పరిధిలో రాజంపేట, మదనపల్లి, నంద్యాల పరిధిలో ఆళ్లగడ్డ, అనంతపురం పరిధిలో గుంతకల్లు, అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని అంటున్నారు. అలానే మూడు లోక్ సభ స్థానాల్లో జనసేన అభ్యర్ధులు పోటీ చేయనున్నారని తెలుస్తొంది. చివరి నిమిత్తం అవసరం అయితే ఒకటి రెండు స్థానాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

TDP Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri