ట్రెండింగ్ న్యూస్

Anchor Meghana : రెచ్చిపోదాం బ్రదర్ అంటున్న యాంకర్ మేఘన?

rechipodam brother comedy show anchor meghana
Share

Anchor Meghana : యాంకర్ మేఘన తెలుసు కదా. రెచ్చిపోదాం బ్రదర్ కామెడీ షోకు యాంకర్. తను ఇప్పటి వరకు సినిమాల్లో నటించింది. పలు షోలలోనూ పార్టిసిపేట్ చేసింది కానీ.. తనకు అంత పేరు రాలేదు. రెచ్చిపోదాం బ్రదర్ అనే కామెడీ షోలో యాంకర్ గా చేయడం స్టార్ట్ చేసిందో లేదో ఫుల్ టు ఫేమస్ అయిపోయింది. ఆ షో ఇంకా ప్రారంభమే కాలేదు అప్పుడే తనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ వచ్చేసింది.

rechipodam brother comedy show anchor meghana
rechipodam brother comedy show anchor meghana

తన చూపులు, తన స్టయిల్, తన డ్యాన్స్.. అన్నీ సూపర్ గా సెట్ అయిపోయాయి. నో డౌట్.. తెలుగు బుల్లితెరకు మరో బ్రహ్మాండమైన యాంకర్ దొరికింది. తన అందాలతో, డ్యాన్స్ తో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది మేఘన.

రెచ్చిపోదాం బ్రదర్ అనే షో జబర్దస్త్ లాగానే కానీ.. ఈ షోలో కామెడీ కోసం అన్నీ చేస్తారు. కేవలం స్కిట్లు మాత్రమే కాదు.. పలు రకాల ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రమ్స్ ఈ షోలో ఉంటాయి.

ఈ షోకు యాంకర్ మేఘన ఒక ప్లస్ పాయింట్ అయితే.. ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల మరో ప్లస్. ఇదివరకు ఈయన బుల్లితెరపై బాగానే హడావుడి చేసినా.. మధ్యలో బుల్లితెరను వదిలేశారు. కానీ.. మళ్లీ ఇప్పుడు బుల్లితెర మీద తన సత్తా చాటడానికి రెచ్చిపోదాం బ్రదర్ అంటూ మన ముందుకు వస్తున్నారు.

Anchor Meghana : జబర్దస్త్ నటులతో పాటు సోషల్ మీడియా స్టార్స్ అంతా కలిసి చేసే సందడే ఇది

ఈ షోకు అందరూ ప్లస్సే. యాంకర్ మేఘన, రాజీవ్ కనకాలతో పాటు.. జబర్దస్త్ నటులు, టిక్ టాక్ స్టార్స్, ఫేస్ బుక్ స్టార్స్ అందరూ కలిసి ఈ షోలో చేసే హంగామా మామూలుగా ఉండదు.

ఇప్పటికే ఈ షోకు సంబంధించిన పలు ప్రోమోలు బయటికి వచ్చాయి. వాటికి ఫుల్ టు రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ షో ఈటీవీ ప్లస్ లో ప్రారంభం కానుంది.

తాజాగా విడుదలైన ప్రోమోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.


Share

Related posts

Romance: శృంగారానికి బంగారం లాంటి నియమాలు ఉన్నాయి వాటిని  తెలుసుకోండి !!

siddhu

Nandamuri Balakrishna : సీఎం వైఎస్ జగన్ పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు

somaraju sharma

బౌలర్ బుమ్రాకు విశ్రాంతి

Siva Prasad