ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

RGV: మంత్రి కొడాలి నానిని అభినందించిన ఆర్జీవీ..! ఇదో ట్విస్ట్ యేనా..?

Share

RGV: సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజులు కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో భారీ ఎత్తున కేసినో నిర్వహించారని మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.500 కోట్లు చేతులు మారాయనీ, గోవా తరహాలో కేసినో తో సహా వివిధ రకాల జూదాలను నిర్వహించడంతో పాటు చీర్ గర్ల్ తో నృత్యాలు ఏర్పాటు చేశారనీ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుడివాడలో జరిగిన జూద నిర్వహణపై పోలీసు యంత్రాంగం స్పందించింది. జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశిస్తూ విచారణ అధికారిగా నూజివీడు డీఎస్పీని నియమించారు.

RGV tweet on Gudivada casino
RGV tweet on Gudivada casino

Read More: AP Employees: పవన్ కల్యాణ్ ఇంటికి ఉద్యోగ సంఘాలు ?

RGV: గోవా వారు గుడివాడ రారన్న విషయాన్ని తెలుసుకోవాలి

సంక్రాంతి పండుగకు ముందే మంత్రి కొడాలి నానికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అయితే గుడివాడలో పెద్ద ఎత్తున జూదాల నిర్వహణపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన దైన శైలిలో స్పందించారు. గుడివాడకు గోవా సంస్కృతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న కొడాలి నానిని విమర్శిస్తున్న పిచ్చి వాళ్లంతా..గుడివాడ ప్రజలు గోవా వెళ్తారు గానీ గోవా వారు గుడివాడ రారన్న విషయాన్ని తెలుసుకోవాలని ట్వీట్ చేశారు. గుడివాడను ఆధునీకరించాలన్న నాని తపనను ప్రశంసించాలని అన్నారు.

RGV: నానిని తప్పకుండా అభినందించాల్సిందే.

“గుడివాడకు కేసినో తీసుకొచ్చిన నాని గురించి మాట్లాడే వారంతా..గుడివాడను మళ్లీ చీకటి యుగంలోకి నెట్టేస్తున్నారన్న విషయాన్ని గుర్తించాలి. పారిస్, లండన్, లాస్ వేగాస్ కు పోటీగా గుడివాడను నిలిపిన నానిని తప్పకుండా అభినందించాల్సిందే. గుడివాడలో కేసినో వస్తే .. ఎవరైనా గోవా, లాస్ వెగాస్ ల వైపు చూస్తారా..? గుడివాడను ఆధునీకరించాలన్న నాని ఆలోచనకు నేను మద్దతు ఇస్తున్నా, కేసినో గురించి మాట్లాడేవారంతా తిరోగమనవాదులే..జై గుడివాడ” అంటూ వర్మ తన దైన శైలిలో ట్వీట్ చేశారు.


Share

Related posts

Sreemaan Mahaarajasri: శ్రీమాన్ మహారాజా రొమాంటిక్ లవ్ సాంగ్ ను విడుదల చేసిన హీరో అడవి శేష్..!!

bharani jella

Singer Sunitha: ఇన్ స్టా లో కొద్దీ నిమిషాల క్రితం ఫ్యామిలీ ఫోటో పెట్టిన సింగర్ సునీత .. చూడడానికి రెండు కళ్ళూ సరిపోవు అంటే నమ్మండి..

Ram

Devatha Serial: దేవుడమ్మా దగ్గర ఆదిత్య దొరికిపోయాడా? రాధ తో కలిసి ఆదిత్య ఏం నిర్ణయం తీసుకుంటాడో..!?

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar