NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Sajjala Rama Krishna Reddy: ఇది కరెక్టేనా .. షర్మిల వ్యాఖ్యలపై సజ్జల

Sajjala Rama Krishna Reddy: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పై, ప్రభుత్వంపై వైఎస్ షర్మిల చేస్తున్న విమర్శలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరో సారి స్పందించారు. రాష్ట్ర రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదని, ఆమె వ్యాఖ్యలకు పొంతన ఉండటం లేదని అన్నారు. చంద్రబాబు స్క్రిప్టే షర్మిలమ్మ బట్టీ పట్టి చదువుతున్నట్లున్నారని విమర్శించారు.

‘షర్మిల అకస్మాత్తుగా రాష్ట్రంలో రాజకీయ తెరమీద ప్రత్యక్షం అయ్యారు. రావడం రావడమే తన మార్క్ కోసం విమర్శలు, వ్యంగాస్త్రాలకు వేస్తున్నారు. ఆమెకి ఇక్కడి రాజకీయాలపై అవగాహన లేదు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, రాజకీయాల గురించి కానీ ఆమెకు ఏ మాత్రం అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదు. అందుకే ఆమె మాట్లాడే మాటల్లో ఒకదానికి మరో దానికి పొంతన ఉండటం లేదు. నాకైతే ఒక  కాంపిటీషన్‌ పరీక్షకు బట్టీ పట్టి ప్రిపేర్‌ అయ్యి పిల్లలు వచ్చి మాట్లాడుతున్నట్లు ఆమె ప్రసంగం కనిపిస్తోంది.

కుటుంబం గురించి ముఖ్యమంత్రి అన్న కాంటెస్ట్‌ వాస్తవం. రాజశేఖరరెడ్డి ఆశయాలను తుంగలో తొక్కి, ఆయన పథకాలు పక్కన పెట్టారు. ఆయన మరణం వల్ల మరణించిన కుటుంబాలను పరామర్శించాలని ఓదార్పు చేపడితే అడ్డంగా నో చెప్పారు. దాని తర్వాత కక్ష సాధింపు మొదలు పెట్టి వేధించిన విషయం షర్మిలమ్మకు కూడా తెలుసు.  సోనియా గాంధీని కలిసినప్పుడు జగన్‌, విజయమ్మ, షర్మిలమ్మ..ముగ్గురే ఉన్నారు. అక్కడేం జరిగిందో కూడా ఆమెకు తెలుసు.

జగన్‌ వైఎస్సార్‌కి సరైన వారసుడు అనుకున్నారు గనుకే పట్టం కట్టారు

అంత మాత్రాన రాజకీయ పరంగా దారులు వేరు కాకూడదు అని ఏవరూ అనరు. జగన్‌ మాట్లాడిన కాంటెస్ట్‌ మాత్రం ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టగానే వివేకానందరెడ్డి ని పోటీపెట్టడం, మంత్రి ఇవ్వడం అందరూ చూశారు. కానీ ప్రజలు జగన్‌ సరైన వారసుడు అనుకున్నారు..వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు. షర్మిల ఏపీలో రాజశేఖరరెడ్డి బిడ్డగా, జగన్‌ చెల్లిగా తెలుసు. జగన్‌  వైఎస్సార్‌ బిడ్డగా ఆ రోజు మొదలు పెట్టిన ప్రస్థానం.. నేడు ఉధృతమైన ప్రవాహంలా ముందుకు సాగుతోంది అని అన్నారు. దానికి కారణం రాజశేఖరరెడ్డి గారి ఆశయాలను, ఆలోచనలను జగన్‌ గారు మనసా వాచా నమ్మి వాటిని మరింత ఫైన్‌ ట్యూన్‌ చేసి ఇంప్లిమెంట్‌చేస్తున్నారు. పార్టీని నడపడం కావచ్చు.. విలువలను పాటించడం, నిజాయితీ, నిబద్దతతో వ్యవహరించడం, నిబ్బరంగా అడుగు వేయడంలో ఎన్ని ఆటుపోటులైనా తట్టుకోవడం కావచ్చు..జగన్ అన్నింటా వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడుస్తున్నారు అని అన్నారు.

ఆ నాడు అక్రమ కేసుల్లో జైళ్లో పెట్టడం నుంచి చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్లు కొన్నప్పుడు కూడా ఎక్కడా చలించలేదు అని అన్నారు. వైఎస్ఆర్ ఫ్యామిలీని కాంగ్రెస్ పార్టీ ఎంతగా వేదించిందీ షర్మిలకు తెలుసు. తనకి జగన్ ఏం అన్యాయం చేశారో షర్మిల స్పష్టంగా చెప్పాలి. ప్రజాస్వామ్యంలో పదవులు అన్నీ కుటుంబానికే ఇస్తారా అని సజ్జల ప్రశ్నించారు. వైఎస్ఆర్ టీపీ అని తెలంగాణలో పార్టీ పెట్టారు. తర్వాత తీసేశారు. మరి ఆ పార్టీ కోసం పని చేసిన వారికి ఆమె ఏం చేశారు అని సజ్జల ప్రశ్నించారు.

ఓదార్పు యాత్ర వద్దన్నందుకు జగన్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చారు. సొంత బాబాయి వివేకానందరెడ్డితో ఎదురు పోటీ చేయించారు. 16 నెలలు జైల్లో పెట్టించారు. అక్రమ కేసులు అని అందరికీ తెలుసు. సీబీఐ అప్పటి అధికారి లక్ష్మీనారాయణ సైతం ఆ కేసుల్లో అవినీతి లేదని చెప్పారు. వైఎస్ఆర్ ఆశయాలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని కూడా షర్మిల అంటున్నారు అంటే ..ఆ స్క్రిప్ట్ ఎవరి నుండి వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు అని సజ్జల దుయ్యబట్టారు. షర్మిల అబద్దాలు ప్రజలు గుర్తిస్తూనే ఉన్నారన్నారు.

సీఎం జగన్ ను విమర్శించిన రోజే షర్మిలను ఎల్లో మీడియా భుజాన వేసుకుంటోంది. ఎల్లో మీడియా ఏనాడైనా అంతకుముందు ఎందుకు షర్మిల గురించి గొప్పగా రాయలేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ గురించి మేము చేయాల్సిన పోరాటం చేశాం కాబట్టే ప్రస్తుతం అది అగింది. పోర్టుల గురించి తలాతోక లేకుండా షర్మిల మాట్లాడటం సబబు కాదు. మణిపూర్ విషయం గురించి షర్మిల పార్టీ తెలంగాణలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు..ఏపీలోకి వచ్చాకే ఎందుకు మాట్లాడుతున్నారు అని ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కోసం ఓ ప్లాన్ ప్రకారం చంద్రబాబు షర్మిలను తెచ్చారు అని సజ్జల విమర్శించారు.

INDIA Alliance: ఇండియా కూటమికి మరో బిగ్ షాక్ .. బైబై చెప్పేందుకు సిద్దంగా నితీష్ కుమార్..?

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri