NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ష‌ర్మిల మారిపోయింది.. ఇక కామ్రేడ్ అవ‌తారం…!

ఇప్ప‌టి వ‌ర‌కు వైఎస్ ష‌ర్మిల ఉన్న ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్.. ఇక నుంచి `కామ్రెడ్ ష‌ర్మిల`గా మార‌ను న్నారు. అదేంటి అనుకుంటున్నారా? ఔను.. ఏపీలో ఇప్ప‌టికే టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన పొత్తు రాజ‌కీయాలు ఖాయ‌మైన ద‌రిమిలా.. క‌మ్యూనిస్టు పార్టీలు.. సీపీఐ, సీపీఎంలు యూట‌ర్న్‌ తీసుకున్నాయి. నిజానికి బీజేపీ లేక‌పోతే.. టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షంతో క‌మ్యూనిస్టులు క‌ల‌వాల‌ని అనుకున్నారు. ముఖ్యంగా సీపీఐ ఈ విష‌యంలో ఒక నిర్ణ‌యానికి కూడా వ‌చ్చింది.

అయితే.. వ‌చ్చే ఎన్నిక‌లు కీల‌కంగా మారిన నేప‌థ్యంలో కేంద్రంలోని బీజేపీ మ‌ద్ద‌తు త‌మ‌కు అవ‌స‌ర‌మ‌ని .. చంద్ర‌బాబు త‌ల‌పోస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న బీజేపీ కోసం వెయిట్ చేస్తున్నారు. దీనిని ఎవ‌రూ తప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. రాజ‌కీయాల్లో ఏ అవ‌స‌రం ఎటు నుంచి ఎలా వ‌స్తుందో చెప్ప‌లేం. పైగా శాశ్వ‌త మిత్రులు, శ‌త్రువులు రాజ‌కీయాల్లో ఉండే అవ‌కాశం లేదు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీనే న‌మ్ముకున్నామ‌ని చెబుతున్న సీపీఐ మాత్రం కొంత నిరాశ వ్య‌క్తం చేసింది.

కానీ, రాష్ట్రంలోని ప‌రిస్థితుల నేప‌థ్యంలో క‌మ్యూనిస్టులు సైతం.. టీడీపీ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించే ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలో వారు యూట‌ర్న్ తీసుకున్నారు. వ‌చ్చే ఏపీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీతో క‌లిసి ముందుకు సాగాల‌ని దాదాపు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. తాజాగా వైఎస్ షర్మిల గురువారం చేపట్టిన మెగా డీఎస్సీ ఆందోళనలో సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామకృష్ణ పాల్గొన్నారు. దీనిని బ‌ట్టి వైఎస్ షర్మిల వెంట ఉంటామని కమ్యూనిస్ట్ నేతలు స్పష్టం చేసిన‌ట్టు అయింది.

ఇక‌, ఇప్ప‌టికే జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో కమ్యూనిస్టు పార్టీలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏపీలో క‌లిసి న‌డిస్త‌.. బాగుంటుంద‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. దీనిపై వైఎస్ షర్మిలతో సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం నేత శ్రీనివాస రావు చ‌ర్చ‌లకు సైతం రెడీ అయ్యారు. ఒక‌టి రెండు రోజుల్లో.. ఈ పార్టీల మ‌ధ్య పొత్తు పొడిచే అవ‌కాశం ఉంది.

కాంగ్రెస్తో ముందుకు సాగితే.. క‌మ్యూనిస్టుల‌కు కూడా కావాల్సిన‌న్ని సీట్లు ద‌క్కే అవ‌కాశం ఉంటుందని అంచ‌నా వేస్తున్నారు. మ‌రి ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి. చిత్రం ఏంటంటే.. కాంగ్రెస్‌, క‌మ్యూనిస్టుల‌కు ఏపీలో గ‌త 10 ఏళ్లుగా ఒక్క ఎమ్మెల్యే లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju