సాలీడు అంటే ఎంతుంటుంది చెప్పండి.. పాడుబడ్డ ఇళ్లలో గూళ్లు కట్టుకొని సాలీడులు బతుకుతుంటాయి. అయితే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెద్ద పెద్ద సాలీడులు కూడా ఉంటాయి. అవి చిన్న చిన్న పురుగులను తింటుంటాయి. కానీ.. ఈ రాకాసీ సాలీడు చూడండి ఏకంగా పెద్ద పక్షినే అమాంతం మింగేసింది. గుటకాయ స్వాహ చేసేసింది.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో కానీ.. సాలీడు ఆ పక్షిని అమాంతం లాగేసుకొని మింగేయడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆ సాలీడు అవికులారియా అనే జాతికి చెందినది.
ఇక ఈ వీడియోను ఓ యూజర్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడా… ఆ వీడియోను చూసిన నెటిజన్లు తెగ భయపడిపోతున్నారు. వామ్మో.. ఇదేం సాలీడురా బాబోయ్.. ఇంతుంది.. అంత పెద్ద పక్షిని అమాంతం మింగేసింది.
ఇటువంటి సాలీడులను సినిమాల్లో చూడటమే కానీ.. నిజ జీవితంలో ఇప్పుడే చూస్తున్నాం.. అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
నిజానికి ఈ రకం సాలీడులు ఎక్కువగా దక్షిణ అమెరికా ప్రాంతంలో ఉంటాయి. వీటినే ఫ్లయింగ్ స్పైడర్స్ అని కూడా పిలుస్తారు. వీటి నోట్లో విషం కూడా ఉంటుంది. ఏదైనా ఆపద తలెత్తబోతోంది అని అనుకుంటే వెంటనే విషం చిమ్ముతాయి. అంతే కాదు.. అక్కడి నుంచి తుర్రుమంటూ ఎగురుకుంటూ పోతాయి.
https://twitter.com/AmazingScaryVid/status/1307369348978208768