NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జ‌న‌సేన 21 సీట్ల‌లో ప‌చ్చ చొక్కాల లెక్క ఇదే… బాబోరు ముంచుడు చూశారా..!

పాఫం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏ ముహూర్తానా తెలుగుదేశం పార్టీతో త‌మ పార్టీ పొత్తు ఉంటుంద‌ని.. ఓట్లు చీల‌నివ్వ‌ను అని అన్నారో కానీ అప్పుడే చంద్ర‌బాబుకు బెండ్ అయిపోయారు. అస‌లు ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పొత్తుల కోసం చంద్ర‌బాబే ప‌వ‌న్ వెంట ప‌డాలి. కానీ ప‌వ‌నే ముందే బాబుకు బెండ్ అయిపోయాడు. ఏ 60 సీట్లో వ‌స్తాయ‌నుకుంటే చంద్ర‌బాబు 24 సీట్లు ముష్టి వేస్తే అదే పెద్ద ప్ర‌సాదంగా భావించి తీసుకున్నారు ప‌వ‌న్‌. క‌ట్ చేస్తే టీడీపీ తో పొత్తు మాత్ర‌మే కాదు.. బీజేపీ కూడా ఉండాలంటూ ప‌వ‌న్ ఎంతో ఆరాట ప‌డ్డారు.

బీజేపీ పొత్తులోకి వ‌చ్చి చేర‌డంతో ప‌వ‌న్ ఒక ఎంపీ సీటు తో పాటు మ‌రో మూడు అసెంబ్లీ సీట్లు కూడా త్యాగం చేయాల్సి వ‌చ్చింది. విచిత్రం ఏంటంటే ఈ 21 సీట్ల‌లోనూ కావాలంటే ఇంకా త్యాగం చేసే త్యాగ మూర్తి లా ఉన్నాడు ప‌వ‌న్‌. స‌రే ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లెక్క చూస్తే 21 సీట్లు. ఇందులో అయినా జ‌న‌సేన కేడ‌ర్ కు.. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డుతోన్న వారికి.. త‌న అభిమానుల‌కు.. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు కేటాయిస్తున్నాడా అంటే అదీ లేదు.. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారు.. ప‌చ్చ బ్యాక్ గ్రౌండ్ ఉన్నోళ్లు.. చంద్ర‌బాబు రిక‌మెండేష‌న్ చేస్తోన్న వాళ్ల‌కే జ‌న‌సేన లో టిక్కెట్లు ద‌క్కుతున్నాయి.

ఇంత‌కు మించి న అవ‌మానం ప‌వ‌న్ ఇంకెక్క‌డ ఉంటుంది. రాజ‌మండ్రి రూర‌ల్ సీటుపై ఆశ‌లు పెట్టుకున్న కందుల దుర్గేస్‌ను అయిష్టంగా నిడ‌ద‌వోలుకు పంపారు. ఉంగుటూరు లో గ‌న్ని వీరాంజ‌నేయుల‌ను ప‌క్క‌న పెట్టేసి సుబ్బ‌రాజుకు ఇచ్చారు. ఆంజ‌నేయులు ఏలూరు జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్నా కూడా ఆయ‌న‌కు సీటు ద‌క్క‌లేదు. తిరుప‌తి జ‌నసేన అభ్య‌ర్థి ఎవ‌రో కాదు గంటా న‌ర‌హ‌రి టీడీపీ లీడ‌ర్‌. ఆయ‌న మొన్న‌టి వ‌ర‌కు రాజంపేట పార్ల‌మెంటు టీడీపీ ఇన్‌చార్జ్ గా ఉన్నారు.

భీమ‌వ‌రంలో టీడీపీలో నే నిన్న‌టి వ‌ర‌కు ఉన్న మాజీ ఎమ్మెల్యే పుల‌ప‌ర్తి రామాంజ‌నేయులు అలా పార్టీలోకి వ‌చ్చారో లేదో వెంట‌నే భీమ‌వ‌రం టిక్కెట్ ప‌వ‌న్ ఇచ్చేశారు. అక్క‌డ పార్టీ కోసం ఎప్ప‌టి నుంచో క‌ష్ట‌ప‌డి న వారి నోట్లో ప‌వ‌న్ మ‌ట్టికొట్టారు. ఇక కొణాతాల రామ‌కృష్ణ‌కు అన‌కాప‌ల్లి సీటు ఇచ్చారు. ఆయ‌న కూడా వ‌ల‌స జీవే. అస‌లు నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న ప్ర‌జ‌ల్లోనే లేరు. ఇక చిత్తూరు టిక్కెట్ ఇస్తోన్న అర‌ణి శ్రీనివాసులు తాజా వైసీపీ ఎమ్మెల్యే.

ఆయ‌న‌కు అక్క‌డ జ‌గ‌న్ సీటు ఇవ్వ‌లేదు.. ఇటు ప‌వ‌న్ ను క‌లిసి జ‌న‌సేన కండువా క‌ప్పుకున్నారో లేదో వెంట‌నే టిక్కెట్ ఇచ్చేశారు. వీళ్లు మాత్ర‌మే కాదు.. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సీట్ల‌తో పాటు పెండింగ్ సీట్ల‌లో ప్ర‌క‌టించే అభ్య‌ర్థుల‌ను చూస్తే అందులో మెజార్టీ ప‌చ్చ పార్టీ నుంచి వ‌చ్చిన వ‌ల‌స నేత‌ల‌తో పాటు ఇత‌ర పార్టీ వ‌ల‌స జీవులే ఉండ‌బోతున్నారు.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella