NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ దైవం న్యూస్

తిరుమల సమాచారం .. మార్చి 3 నుండి 7వరకూ శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు .. ఆ సేవలు రద్దు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రం లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పండుగలు, పర్వదినాల్లో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భాల్లో వివిధ రకాల సేవలను రద్దు చేస్తుంటారు. మార్చి 3వ తేదీ నుండి 7వ తేదీ వరకూ శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకూ పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

Tirumala

తెప్పోత్సవాల్లో భాగంగా తొలి రోజు మార్చి 3న శ్రీసీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు పుష్కరిణిలో మూడు సార్లు విహరించి భక్తులకు కనువిందు చేస్తారు. రెండవ రోజు మార్చి 4న రుక్మిణి సమేత శ్రీకృష్ణుడు అవతారంలో మూడు సార్లు పుష్కరిణిలో తిరుగుతారు. ఇక మూడవ రోజు మార్చి 5న శ్రీభూ సమేత మలయప్ప స్వామివారు మూడు సార్లు పుష్కరిణిలో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.

ఇదే విధంగా శ్రీమలయ్య స్వామివారు నాల్గవ రోజు మార్చి 6వ తేదీన అయిదు సార్లు, చివరి రోజు మార్చి 7న ఏడు సార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులకు కనువిందు చేస్తారు. అయితే ఈ తెప్పోత్సవాల కారణంగా పలు సేవలను రద్దు చేశారు.  మార్చి 3,4 తేదీల్లో తోమాల సేవ, అర్చన, సహస్ర దీపాలంకరణ సేవ, మార్చి 5, 6 తేదీల్లో తోమాల సేవ, అర్చన, అర్జిత బ్రహోత్సవం. సహస్ర దీపాలంకరణ సేవ, మార్చి 7న ఆర్జిత బ్రహోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసింది టీటీడీ.

 

YS Viveka Murder Case: వైఎస్ అవినాష్ రెడ్డికి షాక్ ఇచ్చిన సీబీఐ

Related posts

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju