Trivikram wife: త్రివిక్రమ్ శ్రీనివాస్ కి తెలుగు చిత్ర దర్శకులలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలు ఈయన రాసే డైలాగులకు మెచ్చి ఈయనని మాటల మాంత్రికుడిగా పిలవసాగారు. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస హిట్ లతో త్రివిక్రమ్ టాప్ పోసిషన్ లో ఉన్నారు. త్రివిక్రమ్ కు 2002 వ సంవత్సరంలో సౌజన్య గారితో వివాహం జరిగింది. ఈయన ఒక రైటర్‌గానే కాకుండా మంచి దర్శకుడిగానూ పేరు పొందారు. ఈయన రైటర్ గా చేసిన సినిమా కానీ దర్శకత్వం వహించిన సినిమా కానీ ప్రతిదీ సూపర్ హిట్ గానే నిలిచాయి. ఈయన సినిమాలు ఎన్ని సార్లు చుసినా బోర్ కొట్టదని అంటూ ఉంటారు ప్రేక్షకులకు. ఇది ఈయన సినీ ప్రయాణం.
ఇక త్రివిక్రమ్ వ్యక్తిగత జీవితానికి వస్తే… త్రివిక్రమ్ కు 2002 వ సంవత్సరంలో సౌజన్య గారితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. అయితే త్రివిక్రమ్ గారి సతీమణి గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కేవలం ఆయన సన్నిహితులకే ఆమె సుపరిచితం. ఇంతకీ త్రివిక్రమ్ వివాహం చేసుకున్నది ఎవరినో తెలుసా? ఆమె స్వయానా పద్మ శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి తమ్ముడి కూతురు.
ఇక సౌజన్య గారి కెరీర్ విషయానికి వస్తే… ఆమె కేవలం ఒక హౌజ్ వైఫ్ మాత్రమే కాదు. సదాసీదా గా కనిపించే నాట్య మయూరి. ఇప్పటికే ఆమె ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. త్రివిక్రమ్ గారి భార్య ఒక నటీమణి అన్న విషయం మూడేళ్ల కింద రవీంద్ర భారతిలో జరిగిన డాన్స్ ప్రోగ్రామ్ ద్వారా ఆయన అభిమానులకు తెల్సీయింది. అప్పటి వరకు ఈమె ఒక మంచి డాన్సర్ అని చాలా తక్కువ మందికే తెలుసు. 2018 వ సంవత్సరంలో ఈమె పెర్ఫార్మన్స్ ఇచ్చిన ప్రోగ్రాం కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా విచ్చేసారు.
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!