Q Fever: ఒకవైపు వైరస్ కేసులు తగ్గుముఖం పడుతుంటే.. మరోవైపు సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి.. కొత్తరకం ఫీవర్ హైదరాబాద్ నగరవాసులను భయపెడుతుంది .. ఈ కొత్త రకం జ్వరం జనాలను కలవరపాటుకి గురిచేస్తుంది… హైదరాబాదులో క్యూ ఫీవర్ కేసులు నమోదైనట్లు వైద్యులు వెల్లడించారు.. అసలు క్యూ ఫీవర్ అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది.!? క్యూ ఫీవర్ సోకినవారు సిటీ నుంచి వెళ్లిపోవాలని అధికారులు చెప్పారా .!? క్యూ ఫీవర్ గురించి పలు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..!

క్యూ ఫీవర్ అంటే.!?
క్యూ ఫీవర్ అనేది మేకలు, గొర్రెలు, పశువులు అంటే జంతువుల నుంచి వ్యాపించే కొక్సియేల్లా బర్నేటి అనే బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి. ఈ వ్యాధి సోకిన జంతువు ద్వారా, ఈ వ్యాధి బారిన పడిన పక్షులు జంతువుల గాలిని పీల్చడం ద్వారా మనుషులు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉందని తెలుస్తోంది. పిట్టకోసిస్, హెపటైటిస్ ఇ వంటి ఇతర జూనోటిక్ వ్యాధులు 5% కంటే తక్కువ కసాయిలలో కనుగొనబడ్డాయి. పిట్టకోసిస్ సోకిన చిలుకల నుండి మానవులకు వ్యాపిస్తుంది. హైదరాబాదుకు చెందిన నేషనల్ రీసెర్చ్ సెంటర్ అండ్ ఈ మేరకు సెరోలాజికల్ టెస్టులు నిర్వహించింది. ఈ టెస్టుల్లో భాగంగా 250 మంది శాంపిల్స్ పరీక్షించుగా అందుగులో ఐదుగురు మాంసం విక్రయించే వారికి క్యూ ఫీవర్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది..

క్యూ ఫీవర్ లక్షణాలు..
సాధారణంగా జ్వరం, చలి , కండరాల నొప్పులు , అలసట, నీరసం, ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడతారు . ఇలాంటి లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే వెంటనే వారు వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు..

క్యూ ఫీవర్ బారిన ఇప్పటివరకు కొద్దిమందికి మాత్రమే సోకినట్లు జిహెచ్ఎంసి చీఫ్ వెటర్నటీ ఆఫీసర్ అబ్దుల్ వకీల్ తెలియజేశారు. పశువుల కాపరులు త్వరగా ఈ జ్వరం బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత మాస్కులు పెట్టుకోవడం బయటకు వెళ్లి వచ్చిన తర్వాత శానిటైజేషన్ చేసుకోవడం, బయటకు వెళ్లి రాగానే శుభ్రంగా కళ్లు, చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే క్యు ఫీవర్ బారిన పడకుండా ఉండొచ్చు అని తెలిపారు.

ఈ వ్యాధి సోకిన వారు కబేలాకు దూరంగా ఉంచమని హైదరాబాద్ పౌర సరఫరా అధికారులను ఆదేశించారు. అధునాతన రోగనిర్ధారణ పరీక్షలకు వెళ్లాలని వారికి సూచించారు . కొంతమంది మాంసం విక్రయించే వారికి మాత్రమే ఈ వ్యాధి సోకినట్లు తెలిపారు . అయితే మిగతా వారందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. వీరు మనుషులకు దూరంగా ఉంటే ఈ వ్యాధి మిగతా వారికి సోకకుండా ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్లు జనాలకు దూరంగా ఉండమని చెప్పారు. అంతేకానీ సిటీని వదిలి వెళ్ళమని చెప్పలేదని వైద్యులు తెలిపారు. ఈ క్యూ ఫీవర్ బారిన పడినవారు జాగ్రత్తలు తీసుకోవాలి..