NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Sharmila: కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ షర్మిల .. కాంగ్రెస్ లో పార్టీ విలీనానికి మూహూర్తం ఫిక్స్..? ఎప్పుడంటే..?

YS Sharmila: తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా రాజకీయ పార్టీ స్థాపించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు షర్మిల సిద్దమయ్యారు. ఎలాంటి షరతులు లేకుండానే విలీనానికి షర్మిల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ వారంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో షర్మిల పార్టీలో చేరనున్నారుట. ఇప్పటికే ఈ అంశంపై పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను షర్మిల తీసుకున్నారు. అయితే విలీనం అయిన తర్వాత ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి షర్మిల బరిలో దిగనున్నారని సమాచారం.

YS Sharmila

 

అయితే సోనియా గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల పార్టీలో ఏ రోజున చేరనున్నారు అనే దానిపై స్పష్టత రాలేదు. దీనిపై కాంగ్రెస్, వైఎస్ఆర్ టీపీ అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. గతంలో వైఎస్ జయంతి సందర్భంగా షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దమయ్యారంటూ రకరకాల వార్తలు వచ్చాయి. ఇడుపులపాయకు సోనియాతో పాటు రాహుల్ గాంధీ వస్తున్నారని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. అయితే అది ముందుకు సాగలేదు. ఎట్టకేలకు ఈ వారంలో షర్మిల పార్టీకి సంబంధించిన విషయంలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక అంశంపై తొలుత తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది స్వాగతిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డి వర్గం మాత్రం షర్మిలను ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ చేయడానికైతే సుముఖత చూపారన్నట్లు ప్రచారం జరిగింది. షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీ లో విలీనంపై పార్టీ అధిష్టానం సుముఖంగా ఉన్న నేపథ్యంలో ఈ వారంలో షర్మిల పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

YS Sharmila Meets Karnataka Pcc Chief and Dy CM DK Shivakumar (file Photo)

 

వైఎస్ షర్మిల 2021 మార్చిలో తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారీగా వైఎస్ఆర్ అభిమానులు, నాయకులతో హైదరాబాద్ లో సమావేశాలు నిర్వహించిన తర్వార పార్టీ పెట్టబోతున్నట్లు తెలిపారు. అదే ఏడాది వైఎస్ఆర్ జయంతి జూలై 8న హైదరాబాద్ జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ నందు ఏర్పాటు షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు తన పార్టీ పేరును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ప్రకటించారు. కేసిఆర్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై వివిధ రూపాల్లో పోటారాలు నిర్వహించిన షర్మిల .. ప్రజా ప్రస్థానం పాదయాత్రను 2021 అక్టోబర్ 20న చేవెళ్ల నుండి ప్రారంభించారు. షర్మిల పార్టీ పెట్టిన కొత్తలో వైఎస్ఆర్ టీపీ .. బీఆర్ఎస్ కు బీ టీమ్ అని పలువురు, బీజేపీకి బీ టీమ్ అంటూ మరి కొందరు విమర్శించారు. అయితే తాను ఏ పార్టీకి బీ టీమ్ కాదని షర్మిల ఆనాడు చెప్పుకొచ్చారు.

Telangana Congress

 

వైఎస్ఆర్ హయాంలో అమలు అయిన సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. అయితే షర్మిల పార్టీకి అనుకున్నంత మైలేజ్ రాలేదు. షర్మిల పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిక వల్ల అంతిమంగా అధికార బీఆర్ఎస్ కు లాభం చేకూరుతుందని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసిన తర్వాత అక్కడి పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు షర్మిల శుభాకాంక్షలు తెలియజేయడం, రాహుల్ గాంధీకి లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన సమయంలో ఆయనకు అనుకూలంగా ట్వీట్ చేయడం తదితర చర్యలతో షర్మిల కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నట్లు వార్తలు వచ్చాయి.

ఆ మధ్య ప్రగతి భవన్ వద్ద ఆందోళన చేయడానికి బయలు దేరిన షర్మిలను అరెస్టు చేసి కార్ లోనే క్రేన్ సహాయంతో పోలీస్ స్టేషన్ కు తరలించడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది. ఆ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి పరామర్శించడంతో బీజేపీకి దగ్గర అవుతున్నారనే వార్తలు కూడా వినబడ్డాయి. అయితే కర్ణాటక ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు బీజేపీనా, కాంగ్రెస్ పార్టీనా అన్న సంశయంలో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

చంద్రబాబుపై విజయసాయి మరో సారి ఘాటుగా.. డెల్యుజనల్ డిజార్డర్ రుగ్మత అంటూ..

Related posts

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju