YSRCP: జోగి రమేష్ కి మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్ అయినట్లేగా..! ఇదే ప్రూఫ్..!!

Jogi Ramesh: YSRCP Internal Target..?
Share

YSRCP:  ఏపిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక ఎన్నికల మూడ్ లోకి వెళ్లాలన్నట్లు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సూచించారు. రీసెంట్ గా జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు దిశానిర్దేశం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరో పక్క మరో రెండు మూడు నెలల్లో మంత్రి వర్గ ప్రక్షాళన జగన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పదవుల్లో తమకు ఉంచుతారో లేదో అన్న బెంగ పలువురు మంత్రుల్లో పడింది. దీంతో వారు తమ పదవులను కాపాడుకునేందుకు కొంత దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు ఎలాగైనా సీఎం జగన్ దృష్టిలో పడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలోనే వైసీపీ శ్రేణులకు మంచి అవకాశం కల్పించారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. రెండు రోజుల క్రితం దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్థంతి సభలో ఏపి సీఎం వైెఎస్ జగన్మోహనరెడ్డి, మంత్రులపై అయ్యన్న తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు.

YSRCP mla jogi ramesh likely to minister?
YSRCP mla jogi ramesh likely to minister?

వైసీపీలో మంత్రులతో సహా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా అయ్యన్న వ్యాఖ్యలపై పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఒక్కరే తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన తెలియజేసేందుకు ఏకంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం మీదకే తన అనుచరులతో వెళ్లిపోయారు. అక్కడ టీడీపీ శ్రేణులు జోగి వర్గీయులను అడ్డుకోవడం, వైసీపీ, టీడీపీ వర్గీయుల ఘర్షణ, జోగి రోడ్డుపై భైటాయించి నిరసన తెలియజేయడం, చంద్రబాబుపై తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ అయ్యింది. ఈ ఏపిసోడ్ అంతా జోగి రమేష్ మంత్రి పదవి కోసమే అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ విషయంలో జోగి రమేష్ పార్టీ పరంగా సక్సెస్ అయ్యారన్న మాట వినిపిస్తున్నా ఇదే ఫందాను మంత్రి పదవులు ఆశించే ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు ఎంచుకుంటే రాష్ట్రంలో పరిస్థితులు ఏమిటి అన్నమాట వినబడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పోలీసుల వ్యవహార శైలిపై ప్రతిపక్షాల విమర్శలు ఎలా జనాలు కూడా తప్పుబడుతున్నారు.

కోవిడ్ నిబంధనల పేరుతో వినాయక చవితి వేడుకలకు ఆంక్షలు విధించిన పోలీసులు ప్రతిపక్ష నాయకుడి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేయడానికి వెళుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేకి పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. అయ్యన్న పాత్రుడు వాడిన తీవ్ర పదజాలానికి కారణం చంద్రబాబే అని ఆరోపిస్తూ ఆందోళన చేసిన జోగి రమేష్ .. మంత్రి కొడాలి నాని తరచు చంద్రబాబు, లోకేష్ లపై చేసే విమర్శలను జగన్ చేయిస్తున్నట్లు భావించడానికి అంగీకరిస్తారా? మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఇంత వరకూ టీడీపీ శ్రేణులు ఎవరైనా వారి ఇళ్ల మీదకు గానీ సీఎం జగన్ నివాసం వద్దకు వెళ్లి గానీ ఆందోళన చేసిన సందర్భం ఉందా ?. అన్ పార్లమెంటరీ ల్యాంగ్వేజ్ లో ప్రత్యర్థులపై దూషణలు చేయడం ఎప్పుడు వచ్చిందో అందరికీ తెలుసు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఏ పార్టీ నేతలు చేసినా ప్రజలు సమర్ధించరు. రాజకీయాల్లో హుందాతనంగా వ్యవహరించడం ప్రస్తుత రాజకీయాల్లో లేదనే చెప్పవచ్చు. తాజాగా జరుగుతున్న చర్యలతో రాజకీయాలు మరింత దిగజారుతున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా జోగి రమేష్ మాత్రం పార్టీ పరంగా ఎవరూ స్పందించక ముందు చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లి ఆందోళన చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ అయ్యారు. జగన్మోహనరెడ్డి దృష్టిలో పడ్డారు అనే మాట కూడా వినబడుతోంది. ఇక మంత్రి పదవి ఆయనకు కన్ఫర్మ్ అని కామెంట్స్ వస్తున్నాయి. చూడాలి రాబోయే మంత్రివర్గ విస్తరణలో రమేష్ కు స్థానం లభిస్తుందో లేదో వేచి చూడాలి.

Read More: Justice Kanagaraj: కనగరాజ్.. మూడో పదవికి కాజ్.. ఫెయిలయితే ఏపీలో చాప్టర్ ఇక క్లోజ్..!?


Share

Related posts

Today Horoscope సెప్టెంబర్ 19th శనివారం మీ రాశి ఫలాలు

Sree matha

Vakeel Saab Teaser : ‘క్లాస్ గా ఉండే మాస్ వకీల్ సాబ్’ పవర్ స్టార్

arun kanna

మంగళగిరిలో మహిళా గర్జన

somaraju sharma