NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

5 States Elections: నావికుడు లేని కాంగ్రెస్.. దిక్కెవరు.. మొక్కెవరు..!?

5 States Elections: Congress Self mistakes

5 States Elections: దేశం మొత్తం ఎదురు చూసిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి.. కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాలేకపోయింది.. బీజేపీ యూపీ సహా మిగిలిన రాష్ట్రాల్లో అనుకోని విజయంతో ఊపుమీదుంది.. ఆప్ ఢిల్లీ పక్కనే ఉన్న పంజాబ్ లో చీపురు పెట్టి ఇతర పార్టీలను ఊడ్చేసింది.. మిగిలిన పార్టీల సంగతి పక్కన పెడితే కాంగ్రెస్ పరిస్థితే ఇప్పుడు ఊహించని క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. “దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది” అంటూ నూతన ప్రసాద్ పదే పదే చెప్పే సినిమా డైలాగు ఇప్పుడు “కాంగ్రెస్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది” అనే స్థితికి వెళ్ళింది. చేతిలో ఉన్న పంజాబ్ కోల్పోవడమే కాకుండా.. యూపీలో కనీసం రెండంకెల స్కోరు చేయకపోవడం, గోవా, మణిపూర్ లో కనీసం అధికార పీఠం చేజిక్కించుకోకపోవడం ఆ పార్టీకి అతి పెద్ద దెబ్బ. వరుసగా ఎదురవుతున్న ఈ పరాజయాలు కాంగ్రెస్ భవిష్యత్తుని గంగలో కలిపేస్తున్నాయి. కాంగ్రెస్ కి బెంగ మిగులుస్తున్నాయి.. నిజానికి దేశంలో బీజేపీ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేస్తున్నప్పటికీ.. సరైన ప్రత్యామ్నాయం లేక.. కాంగ్రెస్ చేతగాక, చేవలేక.. జనం నమ్మకం లేక బీజేపీ ఇలా ఇంకా ఇంకా పాతుకుపోతుంది.

5 States Elections: Congress Self mistakes
5 States Elections Congress Self mistakes

5 States Elections: 2017లో ఇలా.. ఇప్పుడు ఇలా..!

2017లో జరిగిన ఎన్నికలనే తీసుకుంటే.. పంజాబ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉన్న పంజాబ్ లో కాంగ్రెస్ నాడు 77 గెలుచుకుంది. నేడు కేవలం 18 స్థానాలకు మాత్రమే పరిమితమయింది. అవి కూడా పూర్తిస్థాయి ఫలితాలు వస్తే తగ్గే.., పెరిగే అవకాశాలున్నాయి..! కానీ 77 కీ 18 కీ చాలా తేడా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటంలో కాంగ్రెస్ పూర్తిస్థాయిలో భాగస్వామి కాలేదు. అదే ఉద్యమంలో ఆప్ రైతులతో కలిసి పోరాడింది. ఈ తేడా స్పష్టంగా కనిపిస్తూంది..!

* 2017లో గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 18 సీట్లు గెలుచుకుంది. కానీ ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 11 స్థానాలకే పరిమితమయింది. అతి చిన్న రాష్ట్రంలో కూడా రాజకీయమ్ చేయలేక.., స్థానాలను నిలబెట్టుకోలేకపోయింది.. ఇక్కడ బీజేపీకి అధికార పీఠం చెరువవుతుంది.. * ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ 2017లో 11 సీట్లు గెలుచుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో 21 సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది.

5 States Elections: Congress Self mistakes
5 States Elections Congress Self mistakes

యూపీలో కాంగ్రెస్ చారిత్రిక తప్పిదాలు..!

కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం చక్రం తిప్పిన పార్టీ.. దశాబ్దాల తరబడి ఏలిన పార్టీ. అటువంటిది దేశ రాజకీయాల్లో గుండెకాయ లాంటి ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ కనీసం రెండంకెల సీట్లు గెలవలేకపోవడం కాంగ్రెస్ కి ఘోర పరాభవమే.. 2017 లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే అదే స్థానాలు వచ్చాయనే సంతృప్తి ఉంటె ఉండొచ్చు.., కానీ ఒకప్పుడు యూపీలో కాంగ్రెస్ చక్రం తిప్పింది. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో 25 స్థానాలు, 2007 అసెంబ్లీ ఎన్నికల్లో 22 సీట్లు గెలుచుకుని కాస్తయినా పరువు నిలుపుకుంది. కానీ గడిచిన అయిదేళ్ల నుండి రెండంకెల స్కోరు లేక పరువు పోగొట్టుకుంటుంది..! దీనికి అనేక కారణాలున్నాయి. నాయకత్వ లోపం అతి పెద్ద సమస్యగా ఉండగా, ఉన్న నాయకుల్లో కూడా వివాదాలు, గొడవలు మరో కారణంగా కనిపిస్తున్నాయి. బలం లేని చోట అందరూ కలిసి పని చేయాలి.. గెలవాలి అనే తపన చూపించకుండా.. గెలిస్తే ఏమిటీ..!? గెలిస్తే ఎవరు సీఎం..!? ముందే తేల్చండి అనుకుంటూ కాంగ్రెస్ నేతలు వివాదాలు సృష్టించే ప్రయత్నాలు చేసారు. ఇదే సందర్భంలో జాతీయ స్థాయి నాయకత్వం కూడా కాంగ్రెస్ కి పెద్ద లోపంగా మారింది. రాహుల్ పై నమ్మకం లేకపోవడం.., ప్రియాంక కూడా రాజకీయంగా ముదరకపోవడంతో కాంగ్రెస్ పెద్దలు బలహీనమయ్యారు. అలా దిక్కులేక, చుక్కాని లేని నావలా కాంగ్రెస్ పరిస్థితి మారింది..!

author avatar
Srinivas Manem

Related posts

ఆ జిల్లాలో టీడీపీకి ఒక్క సీటైనా వ‌స్తుందా.. ఇన్ని క‌ష్టాల్రా బాబు…!

జ‌గ‌న్ ఆ ఒక్క ప‌ని చేస్తే మ‌ళ్లీ సీఎం కుర్చీ ఎక్కి కూర్చోవ‌డ‌మే…!

రేవంత్ కేబినెట్లో ముస‌లం మొద‌లైంది.. ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు ఎక్క‌డ చెడింది…?

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju