NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

సాయిరెడ్డి సురకతో కన్నాకు కాలింది…!

బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నాకి బాగా కాలింది. ఆ చురక పెట్టింది విజయసాయిరెడ్డి. అదేం మామూలు చురక కాదు, ఆయన బిజెపి నిధులు కాజేసేసారని, టిడిపి నుండి రూ. 20 కోట్లు తీసుకున్నారని. అందుకే కాలిన కన్నా ఎందుకు ఊరకుంటారు? విజయసాయిరెడ్డి తో తాడోపేడో తేల్చేందుకు సిద్ధమయ్యారు. నేరుగా పరువు నష్టం దావా వేశారు. నోటీసులు పంపించారు. సమాధానం చెప్పకుంటే, సరైన రిప్లై రాకుంటే కోర్టుకి రావాల్సిందే అంటూ తన దూకుడుని పెంచారు.

కరోనా వేళన… బిజెపి × వైసిపి

ఏపీ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ.. వైరస్ పరీక్షలకు వాడుతున్న ర్యాపిడ్ కిట్ల వ్యవహారంలో ఆరోపణలు చేసిన బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పై అనుచిత వ్యాఖ్యలకు దిగిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇరుకున పడ్డారు. ఏపీ లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ధరలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్లు పెట్టడం కలకలం రేపింది. దీని పై స్పందించిన సాయిరెడ్డి టీడీపీ నుంచి 20 కోట్లు తీసుకుని వైసీపీ సర్కారు పై బురద జల్లుతున్నారంటూ ఆరోపించారు. దీనిపై ఆగ్రహంగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ తన లాయర్ ద్వారా విజయ్ సాయిరెడ్డి కి పరువు నష్టం దావా నోటీసులు పంపారు.

బీజేపీ పెద్దల దృష్టిలో కూడా…!

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తనను ఉద్దేశించిన చేసిన పార్టీ హైకమాండ్ పెద్దలకు వివరణ ఇచ్చిన కన్నా లక్ష్మీనారాయణ.. తన తప్పేమీ లేనందున పరువు నష్టం దావా నోటీసులు పంపుతున్నట్లు సమాచారం కూడా ఇచ్చారు. కరోనా నేపథ్యంలో ర్యాపిడ్ కిట్ల పై వైసీపీ ప్రభుత్వంపై తమ పార్టీ నేత కన్నా వ్యాఖ్యలు, ఎంపీ విజయ్ సాయిరెడ్డి ప్రతి విమర్శ లపై ఇప్పటికే అధిష్టానం ఆరా తీసింది. దీని పై కన్నాను మందలించినట్లు కూడా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కన్నా పరువు నష్టం నోటీసులు కలకలం రేపుతున్నాయి.

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!

సూప‌ర్ ట్విస్ట్‌… అసెంబ్లీతో పాటు పార్ల‌మెంటుకు ప‌వ‌న్ పోటీ.. సీటు ఛేంజ్‌..!

ర‌ఘురామ కృష్ణంరాజుకు ఆ సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…!

పిలిచి జ‌గ‌న్ ఎమ్మెల్యే సీటిస్తే రాం రాం అంటోన్న కృష్ణా వైసీపీ లీడ‌ర్‌..?

Leave a Comment