NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

నలభై ఏళ్ల క్రితం జరిగిన సంఘటన బాబుగారికి మళ్ళీ రిపీట్ .. ?

దేశంలో నాకంటే సీనియర్ రాజకీయ నాయకుడు లేడు నేనే అందరికంటే సీనియర్ నాయకుడిని మోడీ కూడా నాకంటే జూనియర్ అని 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ చంద్రబాబు తెగ గొప్పలు చెప్పుకుంటారు. రాజకీయాలలో చాణిక్యుడు అనే టైటిల్ కలిగిన చంద్రబాబు నాయుడిని ఢీ కొనాలంటే చాలా కష్టం అంటూ తెలుగు రాజకీయాల్లో మహా మహా నేతలే చేతులెత్తేసారు అంటూ ఆయన వేసే వ్యూహాలపై సీనియర్స్ చాల మంది కామెంట్లు చేస్తుంటారు. అటువంటి చంద్రబాబుని 2019 ఎన్నికలలో కోలుకోలేని దెబ్బ జగన్ కొట్టడం జరిగింది. మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన టిడిపిని 23 సీట్లకు పరిమితం చేసి కొన ఊపిరితో అన్నట్టుగా ప్రతిపక్షంలో చంద్రబాబు ని జగన్ కూర్చోబెట్టారు.

 

Tried 2 Days To Wish Jagan: Ganta Srinivasa Raoదీంతో ఊహించని విధంగా భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్… టీడీపీని నామరూపాలు లేకుండా చేయాలని రాజకీయంగా మరియు సామాజిక వర్గ పరంగా అదేరీతిలో ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ మీద దెబ్బలు కొడుతూనే ఉన్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఆయన ప్రతిపక్ష కుర్చీకి ఎసరు పెట్టాలనే రీతిలో జగన్ సరికొత్త స్ట్రాటజీ వేసినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే చంద్రబాబు ఏ రకంగా రాజకీయాల్లోకి 40 ఏళ్ల క్రితం అడుగు పెట్టారో, అనగా సింగిల్ గా 1978లో కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉన్నారో అదే రీతిలో టిడిపిలో చివరాకరికి బాబు ని సింగిల్ చేయడానికి జగన్ గంటాతో సరికొత్త స్ట్రాటజీ వేసినట్లూ ఏపీ రాజకీయాలలో వార్తలు వినపడుతున్నాయి.

 

పూర్తి మేటర్ లోకి వెళ్తే విశాఖ నార్త్ ఎమ్మెల్యే మాజీ మంత్రి టిడిపి నాయకుడు గంటా శ్రీనివాసరావు త్వరలో వైసీపీలో చేరనున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు గంటా శ్రీనివాస్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనతో 12 మంది టిడిపి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పెద్దఎత్తున జగన్ సమక్షంలో చేరటానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఇదే గనుక జరిగితే చంద్రబాబుకి ఉన్న ప్రతిపక్ష హోదా కోల్పోవటం గ్యారెంటీ అని చంద్రబాబు మళ్లీ ఫ్లాష్ బ్యాక్ పొలిటికల్ సినిమా రిపీట్ అయినట్లే అని….విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మరి ఏడు పదుల వయసు కలిగిన చంద్రబాబు ఇలాంటి జగన్ రాజకీయ దెబ్బ తట్టుకోగలడా అన్నా డిస్కషన్లు మరోపక్క ఏపీ రాజకీయాల్లో వినబడుతున్నాయి.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?