NewsOrbit
ట్రెండింగ్ రాజ‌కీయాలు

ఒక్కొక్క‌రికి రూ. 77,500 ఎగ్గొట్టిన సీఎం జ‌గ‌న్ ! వాళ్ళైతే అంత ఇచ్చేవాళ్లట!

రైతు బాగుంటేనే రాష్ట్రం కూడా మంచిగా ఉంటుంద‌నీ, ఈ నేప‌థ్యంలోనే రైతుల మేలుచేసే భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ స‌ర్కారు “రైతు భ‌రోసా” పేరుతో ఓ ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. అయితే, రైతు భ‌రోసా ప‌థ‌కం ఓ బోగ‌స్ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.

జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో రైతుకు రూ. 77,500 ఎగ్గొట్టారంటూ తీవ్ర‌స్థాయిలో చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శ‌లు గుప్పించారు. రైతుల‌కు ఇచ్చిన హామీలు నిల‌బెట్టుకోలేద‌నీ, వైసీపీ స‌ర్కారు ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమిత‌మైంద‌న్నారు. రైతుల‌కు సంబంధించిన రాష్ట్ర ప్ర‌భుత్వం గొప్ప‌గొప్ప ప్ర‌క‌ట‌నులు చేస్తూ.. న‌మ్మ‌క‌ద్రోహం చేస్తోంద‌ని ఆరోపించారు. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట నీటి మునిగింద‌నీ, రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని తెలిపారు.

తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కుల‌తో చంద్ర‌బామునాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఆ సంద‌ర్భంలోనే ఆయ‌న పై వ్యాఖ్య‌లు చేశారు. ఈ స‌మావేశంలో పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల టీడీపీ ఇన్‌చార్జిలు, ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర రాజ‌కీయాలు, వైసీపీ స‌ర్కారు తీసుకుంటున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాలు వంటి ఇత‌ర అంశాల‌పై ఆయ‌న ప్ర‌సంగించారు.

ఈ క్ర‌మంలోనే సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం తీసుకొచ్చిన రైతు భ‌రోసా ప‌థ‌కం ఒక బోగ‌స్ అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. రైతు భ‌రోసా ద్వారా ఐదేళ్ల‌లో ఒక్కో రైతుకు వైసీపీ స‌ర్కారు ఇచ్చేది కేవ‌లం రూ.37,500 మాత్ర‌మేన‌ని అన్నారు. తాము అధికారంలోకి వ‌చ్చివుంటే తాము తీసుకురావాల‌నుకున్న ప‌థ‌కాల ద్వారా ఒక్కో రైతుకు రూ.1.15 లక్ష‌లు వ‌చ్చేవ‌ని వెల్ల‌డించారు. అలాగే, ఎన్నిక‌ల ముందు విప‌త్తు స‌హాయ నిధికి రూ.4 వేల కోట్లు ఇస్తామంటూ రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక మాట త‌ప్పారని చంద్ర‌బాబు అన్నారు.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !