NewsOrbit
రాజ‌కీయాలు

టీడీపీ హయాంలో పెద్ద స్కామ్ ని బయటకు లాగుతున్న జగన్..!!

cm jagan focus on neeru chettu scam in tdp regime

తెలుగుదేశంలో హయాంలో భారీ అవినీతి జరిగిందని వైసీపీ మొదటి నుంచీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయ్యాక వైసీపీ ప్రభుత్వం కొందరు కీలక అధికారులకు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు తవ్వేందుకు నియమించారు. సీఎం పేషీలోని కొందరు ఐఏఎస్ లు ఇదే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో అనేక అవినీతి అంశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏటా ఊరూ వాడా భారీ ఎత్తున ఖర్చు చేసిన ఓ పథకంపై విచారణ చేపట్టబోతోంది. ఈమేరకు హైకోర్టుకి సమాచారం కూడా అందించింది.

cm jagan focus on neeru chettu scam in tdp regime
cm jagan focus on neeru chettu scam in tdp regime

నీరుచెట్టులో భారీ ఎత్తున అవినీతి జరిగింది..

నీరు-చెట్టు పనుల్లో భాగంగా తమకు రావాల్సిన నిధులు ప్రభుత్వం విడుదల చేయడం లేదని కృష్ణా జిల్లాకు చెందిన ప్రసాదరావు, శ్రీధర్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఈ పథకం పనుల్లో గత ప్రభుత్వ హయాంలో భారీ అవకతవకలు జరిగాయని.. వాటిపై విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ విచారణ జరుగుతోందని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అందుకే నిధుల చెల్లింపులు నిలిపేశామని జస్టిస్ రజినీ ముందు జరిగిన విచారణలో ప్రభుత్వం తరపున లాయర్లు విన్నవించారు. నివేదికలు వచ్చాక తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీంతో ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.

నిజం లేకపోలేదు.. కానీ..

పథకంలో భాగంగా ఊళ్లలో వినియోగం లేని చెరువులు, గట్లకు మరమ్మతుల పేరుతో అవసరం లేకపోయినా నిధులు ఖర్చు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పనుల వల్ల 25 నుంచి 35వేల కోట్లు ఖర్చు చేశారు. దీనిలో 50శాతం మేర దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ పనులను స్థానిక నేతలకు కేటాయించి గ్రామస్థాయి టీడీపీ నాయకుల నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకూ లబ్ది పొందారనేది వైసీపీ వాదన. దీనిలో కొంతమేర వాస్తవం ఉంది. అయితే.. ఈ పథకంతో జరిగిన మేలు గురించి ప్రస్తావిస్తే.. గతంలో చెరువుల్లో నీళ్లు నిలిచేవి కావు. కానీ.. ఇప్పుడు పడుతున్న వర్షాలకు నీరు నిల్వ ఉంటోంది. ఈ ఫలితాలున్నా అవినీతికి ఆస్కారం ఉండకూడదనేది ప్రభుత్వం వాదన. అందుకే ఈ పథకంలో జరిగిన అవినీతిని బయటపెట్టే పనిలో జగన్ ప్రభుత్వం ఉంది. మరి.. ఇది ఎంతవరకూ వెళ్తుందో చూడాలి.

 

 

 

author avatar
Muraliak

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !