NewsOrbit
రాజ‌కీయాలు

బీజేపీపై కేసీఆర్ పెద్ద ప్లాన్..! కొత్త వ్యూహంతో గ్రేటర్ కి..!!

cm kcr new strategy for ghmc elections

ఆస్ట్రేలియా క్రికెట్ లో ఓ మైండ్ గేమ్ ఉంది. తమ బ్యాట్స్ మెన్ అవుటయితే వెంటనే వచ్చే బ్యాట్స్ మెన్ పై ప్రత్యర్ధి బౌలర్లు మళ్లీ చెలరేగకుండా వచ్చీ రావడంతోనే ఫోర్ లేదా సిక్స్ కొట్టడానికి ట్రై చేస్తారు. ఇదంతా బౌలింగ్ టీమ్ స్థైర్యాన్ని దెబ్బ తీయడం కోసమే. అదే బౌలింగ్ చేసి వికెట్ తీస్తే ఆస్ట్రేలియా పేసర్లకు భయపడి వచ్చిన బ్యాట్స్ మెన్ డిఫెన్సే ఆడతారు. ఇది ఆస్ట్రేలియా మార్క్ టెక్నిక్. ఇప్పుడిదంతా ఎందుకంటే.. క్రికెట్లో ఆస్ట్రేలియా ఆలోచించినట్టే.. రాజకీయాల్లో సీఎం కేసీఆర్ అలానే ఆలోచిస్తారు. ప్రస్తుతం ఆయన దెబ్బతిన్న పులి. కుమార్తె కవిత ఓటమి తర్వాత ఆయనకు తగిలిన రెండో దెబ్బ బీజేపీ చేతిలో ‘దుబ్బాక’ ఓటమి. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వకూడదని ఆయన ఆలోచిస్తున్నట్టు సమాచారం.

cm kcr new strategy for ghmc elections
cm kcr new strategy for ghmc elections

లోగుట్టు కేసీఆర్ కు ఎరుకే..

మొక్కై వంగనిది మానై వంగునా.. అనే సామెత ఆయనకు తెలుసు. టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను 2001లో అందరూ లైట్ తీసుకున్నారు. 2004లో ఆయనతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ ని పెరగనిచ్చింది. తర్వాత కేసీఆర్ వాయిస్ మరింత పెరిగింది. 2009లో ఆయనతో పొత్తు ఉండాల్సిందే అనేంతగా టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఇంకా పెరిగారు. వైఎస్ మరణం తర్వాత అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్రం అవసరం ఏంటో దేశానికి చూపించారు. తెలంగాణ సాధించారు. ఇప్పుడు ఏకఛత్రాధిపత్యం. ఇక్కడా.. ఇదెందుకంటే.. ప్రస్తుతం బీజేపీకి దుబ్బాక విజయం మొక్క స్థాయిలో చిగురించింది. ఆ మొక్కకు నీళ్లు పోసే అవకాశం ప్రజలకిస్తే మానై ఎదుగుతుందని కేసీఆర్ కు తెలీదా..!

ఎత్తుకుపై ఎత్తుల వ్యూహకర్త..

నిజానికి దుబ్బాక విజయం నల్లేరు మీద నడకే అనుకుంది టీఆర్ఎస్. కానీ.. బీజేపీ దూసుకొచ్చింది. గెలుపు ఇచ్చే కిక్ కేసీఆర్ కు తెలుసు. అదే ఆనందంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు అవకాశం ఇస్తే.. హైదరాబాద్ లో ఇప్పటికే పట్టున్న బీజేపీ మరింత పుంజుకుని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. కేసీఆర్ తట్టుకోగలరా..? అందుకే.. బీజేపీకి అవకాశం ఇవ్వకుండా జనవరి లేదా ఫిబ్రవరిలో జరపాలనుకున్న గ్రేటర్ ఎన్నికలను ఈ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటివారంలోనే నిర్వహించేలా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ప్రజల్లోకి బీజేపీకి, ప్రజలకు బీజేపీ గురించి ఆలోచించే అవకాశం ఇవ్వకూడదనేది గులాబీ బాస్ ఆలోచనట. మరి.. ఈ స్వయంభూ ఎన్నికల వ్యూహకర్త కేసీఆర్ ఏం చేస్తారో..!

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?