NewsOrbit
రాజ‌కీయాలు

‘తండ్రికి తగ్గ కొడుకు’

రాజమండ్రి: తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే మనసులోని మాటను వ్యక్తం చేసే గుణం కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిలో ఉందనేది స్పష్టం అయ్యింది. న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో జగన్మోహనరెడ్డి మాట్లాడిన తీరుపై మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  రాజమండ్రిలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు విడిపోయిన తరువాత కూడా ఎవరూ సాధించలేనంతటి భారీ విజయాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో నమోదు చేసిన వైఎస్ జగన్‌ను తాను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని ఉండవల్లి పేర్కొన్నారు.

నాడు ఎన్‌టిఆర్ ఘన విజయం సాధించిన సమయంలో కూడా ఆయన ఇతర పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకొని ముందుకు సాగారనీ, జగన్ మాత్రం ఒంటరిగా పోటీ చేశారని ఉండవల్లి గుర్తు చేశారు.

అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పడంతో పాటు పారదర్శకతను పెంచుతానని జగన్ అనడం ఆయన పట్టుదలకు సంకేతమని ఉండపల్లి అభిప్రాయపడ్డారు.

నిన్న న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి మోదితో భేటీ తరువాత జగన్ మీడియాతో మాట్లాడిన మాటలు చూస్తే జగన్‌లో వైఎస్ స్పష్టంగా కనిపించారని ఉండవల్లి అన్నారు. మోదిని కలిసిన తరువాత ఆయనకు పూర్తి మెజార్టీ రాకూడదని కోరుకున్నానని జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆ మాటలు చాలా మంచి గుణానికి సంకేతమనీ. అదే విధంగా ఆయన వ్యవహరిస్తే మంచి జరుగుతుందని ఉండవల్లి అన్నారు.

ప్రధాని మోది, తెలంగాణ సిఎం కెసిఆర్‌తో జగన్ సామరస్యంగా ఉండటం మన రాష్ట్రానికి మంచిదేనని ఉండవల్లి పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో 50శాతం ఓట్లు సాధించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని ఉండవల్లి అన్నారు. జగన్ రాష్ట్ర ప్రజల అభిమాన్ని పొందారనడానికి ఇదే నిదర్శనమని ఉండవల్లి పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుపై దీర్ఘ ప్రణాళికతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందనీ, ఈ ప్రాజెక్టు పనులపై జ్యూడీషియల్ బాడీ ఏర్పాటు చేస్తామనడం హర్షనీయమని ఉండవల్లి అన్నారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

Leave a Comment