NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

తీవ్ర ఒత్తిడిలో సీఎం జగన్..! రంగంలోకి రాష్ట్రపతి కార్యాలయం..!

రాష్ట్రంలో ఇటీవల కొన్ని సంచలన సంఘటనలు జరిగాయి. వరుసగా ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ప్రభుత్వాన్ని, పోలీసులను, ఏకంగా సీఎం జగన్ నే ఒత్తిడిలోకి నెట్టేశాయి. ఆ సంఘటనపై ఇప్పుడు నేరుగా రాష్ట్రపతి కార్యాలయం రంగంలోకి దిగడం అందరికంటే ఎక్కువగా సీఎం జగన్ పైనే ఒత్తిడి నెలకొంటుంది.

Ys jagan ramnath kovind

ఇది సామాజిక వర్గ పరంగా సెంటిమెంట్ వ్యవహారం కావడం, రాజకీయంగా రచ్చ కానుండటం, అందులోకి రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఒ అధికారి విచారణకు రంగంలోకి దిగుతుండటం సీఎం జగన్ ఒకింత ఒత్తిడిలోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ వ్యవహారం ముదిరింది. ఇంతకీ విషయంలోకి వెళితే…

శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

తూర్పు గోదావరి జిల్లాలో దళిత యువకుడికి శిరో ముండనం వ్యవహారంపై రాష్ట్రపతి భవన్ దృష్టి సారించింది. జిల్లాలోని సీతానగరం పోలీసులు ఒక దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటనపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తీవ్రంగా స్పందించారు. దళిత యువకుడికి జరిగిన అవమానంపై రాజకీయంగా ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దళిత సంఘాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి స్థానిక పోలీసులపైన చర్యలు తీసుకుంది. ఇదే సమయంలో భాదిత యువకుడు నేరుగా రాష్ట్రపతికి లేఖ రాస్తూ తనను మావోయిస్టుల్లో చేరేందుకు అనుమతించాలని కోరడం తీవ్ర సంచలనం కల్గించింది. అయితే ఈ ఘటన పై ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నామని ఏపీ ప్రభుత్వం రాష్ట్రపతి భవన్ కు వివరణ ఇచ్చింది. అయినప్పటికీ రాష్ట్రపతి కార్యాలయం దీనిపై స్పందిస్తూ మొత్తం వ్యవహారంపైన విచారణకు గాను అసిస్టెంట్ సెక్రటరీ జనార్ధన్ బాబును విచారణ అధికారిగా నియమించింది. జనార్ధన్ బాబును కలిసి పూర్తి వివరాలు, కాల్ రికార్డ్స్, వీడియో క్లిప్పింగులు అందించాలని బాధితుడు ప్రసాద్ కు సూచించింది. బాధితుడు లేఖ రాసిన 24 గంటల్లోనే రాష్ట్రపతి కార్యాలయం స్పందించడం విశేషం.

Prasad

ఇంకా అనేక ఘటనలు ఉన్నాయి.. చెమటలు పడుతున్నాయి

శిరోముండనం ఘటన ఒక్కటే కాదు రాష్ట్రంలో ఇదే సమయంలో మరిన్ని సంచలన సంఘటనలు కూడా ఉన్నాయి. చీరాలలో కిరణ్ అనే యువకుడు మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదీ సామాజిక వర్గ పరంగా సెంటిమెంటల్ వ్యవహారంగానే మారింది. ఇదే సమయంలో పలాసలో ఎస్సీ యువకుడిని సీఐ కాలుతో తన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యింది. ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో వరుసగా జరుగుతుండటం అన్నింటికీ వీడియో సాక్షాలు, ఆధారాలు ఉండటం, సోషల్ మీడియాలో వీడియోలు విపరీతంగా ట్రోల్ కావడంతో ప్రభుత్వంపైన, పోలీసులపైనా, ప్రభుత్వ పెద్దలపైనా ఒత్తిడి నెలకొంటోంది. మరి దీన్ని సీఎం జగన్ ఏ స్టైల్ లో డీల్ చేస్తారు? ఎంత వరకు సద్దుమణిగిస్తారు? అనేది కీలకంగా మారింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju