NewsOrbit
రాజ‌కీయాలు

మరో మాజీ మంత్రి అరెస్ట్ తప్పదా..!! టీడీపీలో హై అలర్ట్..!

tdp ex minister should be arrest

తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకుల్లో దేవినేని ఉమ ఒకరు. పార్టీ వాణిని బలంగా వినిపిస్తూ.. వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను, మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇరుకున పెట్టే వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తూ నానా యాగీ చేస్తూంటారు. ప్రతి చిన్న విషయాన్ని మీడియా ముందుకు ఆధారాలతో సహా తీసుకొస్తూ ఉంటారు. దీంతో దేవినేని ఉమను అరెస్టు చేసేందుకు సరైన ఆధారాల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. గతంలో జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కొన్ని టెండర్లలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయనపై గుడివాడలో ఓ కేసు నమోదైంది. దీంతో ఉమా అరెస్టుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది.

tdp ex minister should be arrest
tdp ex minister should be arrest

దేవినేని ఉమా మేనల్లుడు.. ఎవరా వంశీ?

ఉమ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన మేనల్లుడిగా నాదెళ్ల వంశీకృష్ణ కాన్వాయ్‌లోనే ఉండేవాడని తెలుస్తోంది. ఆ సమయంలో వంశీ చేసిన అనేక అక్రమాలకు పాల్పడ్డాడని అంటున్నారు. వాటిని ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి ఉమపై రాజకీయంగా ఉచ్చు బిగించాలనేది వ్యూహంగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కొద్దిరోజుల క్రితమే జగన్‌ను కలసి అనుమతి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉమా వ్యవహారాన్ని ప్రభుత్వంలోని కీలక వ్యక్తికి అప్పగించినట్లు చెబుతున్నారు. ప్రభుత్వంలో పనులు, ఉద్యోగాలు అంటూ వంశీ డబ్బులు వసూలు చేసేవాడని.. ఇందుకు ఉమ పేరు వాడుకునేవాడని తెలుస్తోంది.

వంశీ చేసిన పనులు.. ఉమకు చుట్టుకుంటున్నాయి..

ఉమా పేరుతోనే కాకుండా లోకేశ్, కేఈ కృష్ణమూర్తి పేర్లు కూడా ఉపయోగించి వంశీ దందాలు చేసాడని తెలుస్తోంది. విజయవాడ రూరల్ పరిధిలోని వరలక్ష్మిపురం, తులసీనగర్‌కు చెందిన నాదెళ్ల వంశీకృష్ణ.. గతంలో ఏసీబీకి చిక్కిన ఉద్యోగులకు మళ్లీ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల రూపాయలు వసూలు చేశారన్న ఫిర్యాదులున్నాయి. గుంటూరు, కర్నూలుకు చెందిన పోలీసు, దేవాదాయ శాఖల ఉద్యోగుల నుంచి లక్షలు వసూలు చేశాడని తెలుస్తోంది. దేవినేని ఉమ ఇంట్లోనే వంశీకి డబ్బులు ఇచ్చామని బాధితులు సదరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వీటిలో కొన్నింటికి వంశీ తల్లిదండ్రులు చెక్కులిచ్చినా బౌన్స్ అయ్యాయని.. మరికొన్నింటిని ఉమ స్వయంగా సెటిల్ చేశారని అంటున్నారు. వీటన్నింటి నేపథ్యంలోనే వంశీ అక్రమాలను బాధితుల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి ఉమకు రాజకీయంగా ఉచ్చు బిగించి ఆయన దూకుడుకు కళ్లెం వేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju