హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, వరంగల్లు జిల్లా సీనియర్ నాయకుడు రేవూరి ప్రకాశ్ గుడ్‌బై చెప్పారు. తెలంగాణలో బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతొన్నది. బుధవారం ఇద్దరు కీలక నేతలు బిజెపిలో చేరారు. ఢిల్లీ బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రేవూరి ప్రకాశ్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు రవీంద్రనాయక్ కాషాయ కండువా కప్పుకున్నారు. వీరికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు పార్టీ కండువా కప్పిసాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌లు పాల్గొన్నారు.
previous post
next post