Mangalavaaram Review: పాయల్ రాజ్‌పుత్ చాలెంజింగ్ పాత్రలో నటించిన “మంగళవారం” సినిమా నవంబర్ 17 శుక్రవారం విడుదల అయింది. “ఆర్ఎక్స్ 100” వంటి మొదటి సినిమాతో తనకి హిట్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా పాయల్ చేయటం జరిగింది. మరి “మంగళవారం” సినిమా ఫుల్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం.
సినిమా పేరు: మంగళవారం
నటీనటులు: పాయల్ రాజ్‌పుత్, నందితా శ్వేతా, రవీంద్ర విజయ్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, శ్రవణ్ రెడ్డి, దివ్యా పిళ్ళై, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు
మాటలు: తాజుద్దీన్ సయ్యద్ & రాఘవ్
ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్
రసంగీతం: అజనీష్ లోక్‌నాథ్
నిర్మాతలు: స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ, అజయ్ భూపతి
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: అజయ్ భూపతి
విడుదల తేదీ: నవంబర్ 17, 2023
పరిచయం:
అజయ్ భూపతి దర్శకత్వంలో “ఆర్ఎక్స్ 100” సినిమాతో హీరోయిన్ గా పాయల్ రాజ్‌పుత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం తెలిసిందే. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కానీ ఈ సినిమా తర్వాత ఆమె చేసిన ఏ సినిమాతో కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోవడం జరిగింది. ఇక ఇదే విధంగా “ఆర్ఎక్స్ 100” డైరెక్టర్ అజయ్ భూపతికి కూడా తర్వాత చేసిన “మహాసముద్రం” ఆయనకు పెద్దగా పేరు తీసుకురాలేదు. ఈ క్రమంలో అజయ్ భూపతి తన తొలి సినిమా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తో కలిసి థ్రిల్లర్ నేపథ్యంలో హీరోయిన్ ఓరియంటెడ్ “మంగళవారం” అనే సినిమా చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమాతో మరోసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న లక్ష్యంతో తేరకెక్కించారు. ఈ సినిమా విడుదలకు ముందే టీజర్ మరియు ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా హైప్ తీసుకురావడం జరిగాయి. దీంతో సినిమా టెక్నికల్ గా చాలా బలంగా ఉండటంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొని “మంగళవారం” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరు కావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. శుక్రవారం విడుదలైన మంగళవారం సినిమా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం.
స్టోరీ:
1996లో మహాలక్ష్మిపురం అనే గ్రామంలో ఓ జంట మధ్య అక్రమ సంబంధం ఉందని ఊరి గోడల పై రాతలు ఎవరో అగంతకులు రాయటం జరుగుద్ది. గోడ పై ఆ రాతలు చూసిన గ్రామ జనాలు.. అదే గ్రామంలో ఓ బావి దగ్గర జంట చనిపోయి పడుంటారు. ఈ క్రమంలో పరువు పోయి ఆత్మహత్య చేసుకుని ఉంటారని ఆ ఊరి జనం భావిస్తారు. కానీ ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ (నందితా శ్వేత) అవి హత్యలని చెబుతాది. ఆ జంట మరణాల వెనుక ఏదో మర్మం ఉందని అనుమానంతో దర్యాప్తు చేయడం ప్రారంభిస్తది. ఈ క్రమంలో ఊరి పెద్ద (కృష్ణ చైతన్య) ఆ శవాలను పోస్టుమార్టంకి ఒప్పుకోడు. ఇక ఇదే క్రమంలో అదే ఊరిలో మరో మంగళవారం నాడు మళ్ళీ ఇలాగే అక్రమ సంబంధం అంటూ గోడమీద ఇద్దరు పేర్లు రాయటం వాళ్ళు చెట్టుకి వేలాడడం చూస్తారు జనం. ప్రతి మంగళవారం ఇలా మహాలక్ష్మి పురం అనే గ్రామంలో ఏదో ఒక గోడపై అక్రమ సంబంధాలు అంటూ పేర్లు రాయటం మంగళవారం నాడు వాళ్లు.. శవాలుగా తేలటం ఆ ఊరి జనానికి భయాన్ని కలిగిస్తాయి. దీంతో మంగళవారం వస్తుంది అంటే చాలు గ్రామ ప్రజలు వణికిపోతారు. ఈ క్రమంలో గోడలపై రాతలు రాస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు.. అనే దాని విషయంలో పోలీసుల రంగంలోకి దిగుతారు. అంతేకాకుండా గ్రామంలో రెండో జంట చనిపోయినప్పుడు ఊరి పెద్దలను ఎదిరించి ఎస్ఐ మాయ (నందితా శ్వేత) పోస్టుమార్టం కూడా చేస్తది. అయితే అసలు ఈ చావుల వెనుక ఉన్నది ఎవరు..? ఆ ఊరి నుంచి వెలివేయబడ్డ శైలజ అలియాస్ శైలు (పాయల్ రాజ్‌పుత్) కు ఉన్న సంబంధం ఏమిటి..? అసలు ఆమె కథ ఏమిటి..? ఊర్లో జరిగే చావులకు శైలుకు సంబంధం ఉందా..? మహాలక్ష్మిపురం నుంచి ఆమె ఎందుకు వెలు వేయబడింది..? దెయ్యం రూపంలో శైలు తిరుగుతుందని ఊరి ప్రజలు ఎందుకు భ్రామపడ్డారు..? శైలుకి మానసిక రోగం ఉందా..? వంటివి తెలియాలంటే “మంగళవారం” సినిమా చూడాల్సిందే
విశ్లేషణ:
స్టోరీ పరంగా అక్రమ సంబంధాలు చుట్టూ తిరిగే కంటెంట్ అయినా గాని హీరోయిన్ పాత్రనీ చాలా సెన్సిటివ్ అంశం చుట్టూ చెడు మార్క్ లేకుండా డైరెక్టర్ అద్భుతంగా చూపించాడు. ఎక్కడ అశ్లీలం మరియు అసభ్యం.. వంటివి సినిమాలో లేకుండా అద్భుతంగా కథని ముందుకు నడిపించాడు. తీసుకున్న సబ్జెక్టు చాలా బోల్డ్ అయినా గాని ఎక్కడ ఆ రకమైన సన్నివేశాలు లేకుండా ఎక్కడికక్కడ చాలా పద్ధతిగా దర్శకుడు సినిమాని తెరకెక్కించాడు. ప్రారంభంలో థ్రిల్లర్ హర్రర్ టచ్.. ఇవ్వటానికి చాలా పాత్రలను పరిచయం చేయడానికి అరగంట సమయం పట్టింది. ఆ రకంగా సినిమాని తీసుకెళ్తే చివర ఆఖరికి రివేంజ్ డ్రామాల కొనసాగించి స్టోరీని చాలా సింపుల్ లైన్ తో ముగించారు. మహిళలకు సంబంధించిన సందేశాత్మకమైన చిత్రం. ఈ క్రమంలో కొన్ని డబల్ మీనింగ్ డైలాగులతో పాటు హీరోయిన్ కి ఉన్న మానసిక సమస్య వంటివి చూసే కుటుంబ ప్రేక్షకులకు కొద్దిగా ఇబ్బంది కలిగించే రీతిలో తీయడం జరిగింది. సినిమాని చాలా వైవిధ్యంగా ఎక్కడ బోర్ కొట్టకుండా దర్శకుడు అజయ్ భూపతి ఆరంభించిన విధానం చాలా బాగుంది. ఫస్టాఫ్ లో జరిగే మరణాలు వాటి చుట్టూ సాగే డ్రామా స్టోరీని పరుగులు పెట్టించిన విధానం..ఆడియెన్స్ నీ ఆకట్టుకొంటాది. ప్రతి పాత్ర పై అనుమానాలు వచ్చే విధంగా స్క్రిప్ట్ వర్క్ డిజైన్ చేయడం జరిగింది. శైలు పాత్రకు సంబంధించి సరిగ్గా విరామం ముందు చిన్న ట్విస్ట్ తో ఒక్కసారిగా సెకండాఫ్ పై ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగించేలా చేశారు. ఇక సెకండాఫ్ నుంచి అసలైన కథ మొదలవుతుంది అన్న మాదిరిగా.. సినిమాని ఎమోషనల్ సన్నివేశాలతో నడిపించారు. స్క్రీన్ పై శైలు పాత్ర..బోల్డ్ గా కనిపిస్తూనే.. ఆ పాత్ర పై సానుభూతిని పెరిగేలా అద్భుతమైన దర్శకత్వం వహించారు. ముఖ్యంగా సినిమా చివరి 45 నిమిషాల్లో ప్రతి ట్విస్ట్ నీ హీరోయిన్ పాత్రకి పాజిటివ్ గా మార్చేలా.. ప్రతి క్యారెక్టర్ నుండి అద్భుతమైన ఔట్ పూట్ డైరెక్టర్ అజయ్ భూపతి రాబట్టాడు. ఒక విధంగా “మంగళవారం” సినిమాలో… స్టోరీ పరంగా పాత్రలు నడిచిన గాని డైరెక్టర్ సినిమాని నడిపించిన విధానం అతనిని హీరోలా చేసిందని చెప్పవచ్చు. పాయల్ రాజ్‌పుత్ తన నటనతో విశ్వరూపం చూపించింది. ఈ సినిమాలో ఏ హీరోయిన్ ధైర్యం చేయని పాత్రను సవాల్ గా తీసుకొని అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో రెచ్చిపోయింది. స్టోరీ పరంగా ఎంత బలంగా కంటెంట్ ఉందో సాంకేతికంగా అంతకు రెండింతలు.. సినిమా ఉంది. కెమెరా వర్క్ లైటింగ్ ఎఫెక్ట్ తోపాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్లాయి.