Gunde Ninda Gudigantalu November 17 2023 Episode 35: మీనా తల్లి పార్వతి ప్రదక్షిణలు చేస్తూ గుళ్లో కళ్ళు తిరిగి పడిపోతుంది. మీనా అమ్మ ఉదయం నుంచి ఏమీ తినలేదు పచ్చి మంచి నీళ్లు కూడా తాగకుండా గుడికి వెళ్ళింది ఇంతవరకు రాలేదు అసలు ఏం చేస్తుందో ఏమో ఏ మొక్కులు మొక్కుతుందో ఏమో ఒక్క సారి వెళ్లి చూసి వస్తాను అంటూ మీనా గుడి లోపలికి వెళ్తుంది.అక్కడ తన తల్లి పార్వతి కింద పడిపోయి ఉండడం చూసి గబ గబా వెళ్లి వాటర్ తీసుకొచ్చి మొహం మీద చల్లుతుంది పార్వతీ సృహలోకి వస్తుంది పంతులుగారు ఏమ్మా మీనా మీ అమ్మ ఉదయం నుంచి ఎంత చెప్పినా వినకుండా మండుటెండలో ప్రదక్షిణలు చేస్తూనే ఉంది ఇప్పుడు చూడు కళ్ళు తిరిగి ఎలా పడిపోయిందో ఎంత చెప్పినా వినడం లేదు అంటాడు పంతులు మీనా అమ్మ ఏంటమ్మా ఇదంతా ఎందుకు నువ్వు జరగని దానికోసం ఈ పూజలు చేస్తున్నావ్ అంటుంది పార్వతి జరగనిది కాదు మీనా మీ నాన్న ఉన్నప్పుడు నీ పెళ్లి ఇలా చేస్తాను అలా చేస్తాను అలాంటి వాడిని తీసుకొస్తాను ఇలాంటి వాడిని తీసుకొస్తాను

నా కూతురు పెళ్లి ఘనంగా చేస్తాను అని కలలుకనేవాడు అలాంటి సంబంధం వచ్చింది కదా మీనా అందుకు నువ్వు ఒప్పుకోలేదు కానీ మీ నాన్న పైన ఉండి ఇదంతా చూస్తూ బాధపడుతూ ఉంటాడు అని అంటుంది పార్వతి.పంతులుగారు అవునమ్మా చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలి అంటే వాళ్ళ కోరిక ప్రకారం మనం చేయాల్సిందే తప్పదు అంటాడు పంతులుగారు. మీనా నన్ను కన్న తండ్రి ఆఖరి కోరికను తీర్చడం నా బాధ్యత కన్నకూతురుగా నేను ఆయన కోరికను తీరుస్తాను సరే అమ్మ నీ మాట ప్రకారం నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను ఇంటికి వెళ్దాము అంటుంది మీనా. పార్వతి చాలా సంతోషం అమ్మఅని అంటుంది. సత్యం అదే గుడికి వస్తాడు అది చూసిన సత్యం అమ్మ మీనా నేను చేసిన పొరపాటు వల్ల మీ నాన్న ప్రాణాలు కోల్పోయాడు మీ నాన్న ప్రాణాలు తీసిన పచ్చతప్పం నా మనసులో ఇంకా మెదలాడుతూ ఉంది ఏదో సానుభూతితో నిన్ను నా ఇంటి కోడలిగా చేసుకోవాలి అనుకోవడం లేదు నిన్ను నీ గుణగణాలను చూసి నా ఇంటికి నువ్వే తగిన కోడలివి అని అనిపించి నిన్ను నా కోడలిగా చేసుకోవాలి అని ప్రాధేయపడుతున్నాను అని అంటాడు సత్యం.

అందుకు మీనా సరేనండి అలాగే కానివ్వండి అని అంటుంది.అందుకు సత్యం సంతోషపడుతూ ఇంటికి వెళతాడు. సత్యం ఇంటికి వచ్చి మనోజ్ ఒరేయ్ మనోజ్ ఇదిగో స్వీట్ తీసుకో అని ప్రభావతి నువ్వు కూడా తీసుకో అంటాడు. ప్రభావతి ఏంటి స్వీట్లు పంచి పెడుతున్నారు ఏంటి ఆ శుభవార్త అంటుంది ప్రభావతి సత్యం ఆడ పెళ్లి వాళ్ళు ఒప్పుకున్నారు రేపే మనం వాళ్ళ ఇంటికి వెళ్లి పెళ్లిచూపులు చూసి వద్దాము అంటాడు సత్యం అందుకు బాలు వావ్ నాన్న చాలా సంతోషంగా ఉంది అంటాడు బాలు ప్రభావతి ఈ పెళ్లికి నేను ఒప్పుకోవడం లేదు ఏంటి వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు ఒప్పుకోవడం లేనప్పుడు కాదని చెప్పడం అంత తమాషా చేస్తున్నారా వాళ్ళకి మన సంబంధం దొరకడమే ఎక్కువ ఇంకా అందులో వాళ్ళు ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం అంటూనా ఇదంతా ఏంటి నేను ఒప్పుకునేదే లేదు ఈ పెళ్లికి అంటుంది ప్రభావతి బాలు ఆ చాలా బాగుంది

నీ కొడుకుని పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకు వస్తుందని నువ్వు పెళ్లికి ఒప్పుకోవడం లేదు అంటాడు ప్రభావతి ఏ నా కొడుక్కి ఏంటి డిగ్రీలు డిగ్రీలు ఉన్నాయి వాడి చదువుకు గొప్ప గొప్ప సంబంధాలే వస్తాయి బాలు వీడు ఎప్పుడైనా డిగ్రీలు చూపించాడా అసలు వీడు అలా చదువుకొని ఉంటే వీడి దగ్గరికి జాబు వెతుక్కుంటూ వస్తుంది అలాంటప్పుడు వీడికి ఎందుకు రావట్లేదు జాబు పైగా నాన్న ఇచ్చే డబ్బుకు ఆశ పడుతున్నాడు నాన్న డబ్బుతో బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడు ఇదంతా ఏంటి డిగ్రీలు అంట డిగ్రీలు చాలు చాల్లే ఆపు అమ్మ అంటాడు తల్లి ప్రభావతిని సత్యం ప్రభావతి నువ్వు వాడి మాటలు ఏం పట్టించుకోకు మనం రేపు పెళ్లి వాళ్ళింటికి పెళ్లి చూపులకు వెళ్తున్నాం అన్నీ రెడీ చేసుకో అని అంటాడు సత్యం కట్ చేస్తే మీనా ఇంట్లో మీనా తల్లి పార్వతీ పక్కింటి నుంచి టీ కప్స్ సాసర్లు అన్ని అడిగి తీసుకువస్తుంది పార్వతి ఆడపిల్ల పెళ్ళంటే ఎంత ఆరాటమో చూశారా నాకేమీ తోచడం లేదు అని మనసులో అనుకుంటూ గబగబా వచ్చి తన రెండవ కూతురు సుమతిని సుమతి అన్ని పనులు చేసావా అంటుంది సుమతి

ఆ చేశాను అమ్మ అంటుంది ఆ బొంతలు ఏంటి ఆ బొంతల మీద ఏదైనా టవల్ కప్పు ఆ కుర్చీ మీద దుమ్ము పట్టి ఉంది దాన్ని సరిగ్గా దులుపు సుమతి ఈ కప్స్ సరోజక్క దగ్గర తీసుకొచ్చాను దీన్ని జాగ్రత్తగా చూసుకో పెళ్లి వాళ్ళకి టి ఇందులోనే ఇవ్వాలి మళ్లీ సరోజక్కకు ఈ కప్స్ తిరిగి ఇచ్చేయాలి లేదంటే పగిలినవి అనుకో మళ్ళీ కొన్నియాల్సి వస్తుంది అంటుంది.మీనా ఈ టీ కప్స్ ఎక్కడివమ్మా అంటుంది పార్వతి సరోజక్క దగ్గర తెచ్చానమ్మా. మీనా ఇప్పుడు ఇదంతా అవసరమా అమ్మ మన కుటుంబాన్ని మన స్తోమతని చూసిన అర్థం చేసుకునే ఉంటే చాలు కానీ బొంతల మీద టవల్ కప్పి దాచి ఉంచుతాం పక్కింటి నుంచి టీ కప్పులు తీసుకొచ్చి మనవి అని చెపుతాo కానీ మన స్తోమతని దాచి ఉంచలేము కదా అది ఎప్పటికైనా తెలుస్తుంది కదా మనల్ని గౌరవించాలి మన పరిస్థితిని అర్థం చేసుకోవాలి అలా అయితేనే పెళ్లి జరుగుతుంది లేదంటే కాదు అంటుంది మీనా అందుకు పార్వతి అదేం లేదే మీనా శుభమా అంటూ పెళ్లి జరుగుతుంటే కాదు కూడదు అని ఎందుకు మాట్లాడతావు సరే నీ ఇష్టం ఉన్నట్టే కానీ విలువిల్లు పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది సుమతి వెళ్లి అక్కను తయారుచేసి తీసుకురా అని పంపిస్తుంది మీనని శివ శివ ఎక్కడున్నావురా త్వరగా ఇటు రా అని శివుని పిలిచి పార్వతి రెండు రకాల స్వీట్లు పూలు పండ్లు తీసుకొని రా పో త్వరగా వచ్చేయ్ అని శివ ని బయటికి పంపిస్తుంది పార్వతి సాంబయ్య ఫోటో చూస్తూ నా కూతురు పెళ్లి ఇలా చేస్తాను అలా చేస్తాను అనుకుంటూ ఉండేవాడివి కానీ ఇప్పుడు చూడడానికి నోచుకోకుండా వెళ్ళిపోయావు అని ఏడుస్తూ ఉంటుందికట్ చేస్తే సత్యం ఇంట్లో సత్యం పెద్దకొడుకు మనోజ్ ని భార్య ప్రభావతి ని త్వరగా రండి పెళ్లి చూపులకు టైం అయిపోతుంది వాళ్లు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని పిలుస్తాడు ప్రభావతి అబ్బబ్బ వస్తున్నామండి ఏంటి తొందర మన కోసం వాళ్ళు ఏమైనా పది రోజుల నుంచి ఎదురు చూస్తున్నారా ఒక పది నిమిషాలే కదా ఆ మాత్రం ఆగలేరా అంటుంది ప్రభావతి సత్యం ప్రభావతి ఇలాంటి పుల్లవిరుపు మాటలు అక్కడ మాత్రం మాట్లాడకు అంటాడు ఆ సరే సరేలెండి మీరు నాకు తప్ప ఇంకెవరికి చెప్తారు అంటుంది ప్రభావతి సత్యం ఒరే బాలు నువ్వు కూడా రా త్వరగా వెళ్ళు అంటాడు ప్రభావతి వీడెక్కడికి వీడు వస్తే ఇక పెళ్లి జరిగినట్లే అంటుంది కొంతమంది ఫేస్ రీడింగ్స్ అలా ఉంటాయి వాళ్ల జాతకాలు నేను పదేపదే గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఈయన గారు అడుగుపెడితే ఏదో అద్భుతం జరిగి పెళ్లిచూపులు జరగడం కాదు ఎవరో ఒకరు పోతారు ఆ పాద మహత్యం ఆ జాతకం గుర్తుపెట్టుకుని ఇంట్లో ఉంటే బాగుంటుంది అని అంటుంది ప్రభావతి. ఆ మాటలకి ప్రభావతి రెండవ కొడుకు బాలు అంటే ఏంటి అమ్మ నన్ను పెళ్లి చూపులకు రావద్దు అంటావా నా ఫేస్ కి ఏంటి నా ఫేస్ చందమామ ఫేస్ అంటాడు బాలు ప్రభావతి అవునా అమావాస్య చంద్రుడి మొహం అంటుంది

ప్రభావతి. సత్యం శుభమంటూ శుభకార్యానికి వెళుతుంటే ఈ వాదనలేంటి అంటాడు సత్యం ప్రభావతి వెళ్లిన చోట ఆపశకనం జరగకుండా ఉండాలని కొంతమందిని రాకుండా ఉండమని చెబుతున్నాను అంటుంది బాలు నువ్వు పెళ్లి చూపులకు రావద్దు అంటే నేను ఆగిపోతానా నీ మాటలకు నేను భయపడతాను అనుకుంటున్నావా ప్రభావతి ఏం చేస్తావ్ రా భయపడక ఏం చేస్తావ్ అంటూ తన కొడుకు బాలు దగ్గరికి కోపంగావెళుతుంది బాలు నువ్వు రావద్దు అంటే నేను పెళ్లి చూపులకు కాదు పెళ్లికి కూడా రాను అంటాడు ప్రభావతి హమ్మయ్య చాలా మంచి మాట చెప్పావు సంతోషంగా ఉంది అంటుంది ప్రభావతి. సత్యం ప్రభావతి ఏంటి మీ గోల ఎప్పుడూ ఉండేదే కదా ఒరే బాలు నువ్వు నడవరా అని అంటాడు ప్రభావతి ఎక్కడికి నడిచేది వాడి లెగ్గు మహత్యం ఏంటో తెలిసి కూడా వాడిని పెళ్లి చూపులకు రమ్మంటున్నారా వీడివల్లే కదా తన చెల్లి పెళ్లి ఆగిపోయింది వీడు మిమ్మల్ని బస్ డిపో దగ్గర దింపడం వల్లే కదా మీరు బస్సు యాక్సిడెంట్ చేశారు అతను చనిపోయాడు ఇంకా ఏం జరగాలని వీడిని పెళ్లి చూపులకు రమ్మని అంటున్నావు ఏం జరిగినా పర్వాలేదు అనుకుంటే నీ ముద్దుల కొడుకు బాలుని తీసుకొని రా అని అంటుంది ప్రభావతి సత్యం బాలు మీ అమ్మ అలాగే అంటుంది మనం వెళ్దాం పద అంటాడు బాలు వద్దు నాన్న అమ్మ అలా అన్నాక కూడా నేను ఈ పెళ్లి చూపులకు వస్తే ఏదో బ్యాడ్ లక్ వల్ల పెళ్లి ఆగిపోయింది అనుకో అది నేను రావడం వల్లే అంటూ మళ్ళీ నా మీద నింద వేస్తుంది ఏం పర్వాలేదు నాన్న నాకు అవమానాలు ఎప్పుడు ఉండేవే కదా మీరు వెళ్లి రండి అని బాలు సత్యంని పంపిస్తాడు