Nindu Noorella Saavasam November 17 2023 Episode 83: అంజు పాపా మనోహరి గదిలో ఉంది రండి అని భాగమతి పిలుస్తుంది. అంజు మనోహరి గదిలో ఉందంట పదండి అని అందరూ పరిగెత్తుకొస్తారు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా చూసుకోవాలి అని మనోహరి అనుకుంటుంది. అందరూ వచ్చి అంజు నీకేమైంది ఎందుకు అలా గట్టిగా అరిచావు అని అడుగుతారు. అంజు మీ గదిలో పండుకోవాలి కదా ఇక్కడికి ఎలా వచ్చింది అని అమరేంద్ర అంటాడు. పడుకునేటప్పుడు అక్కడే పడుకున్నాను డాడీ కానీ లేచి చూసేసరికి ఇక్కడ ఉన్నాను అని అంజు అంటoది.అమరేంద్ర అంజునీ తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని అంజు నీకేమైంది నాన్న ఎందుకు అలా గట్టిగా అరిచావు అని అడుగుతాడు.అంటే యాక్సిడెంట్ అయినప్పుడు పక్కనే ఉంది కదా వాళ్ళమ్మ గుర్తుకు వచ్చిందేమో భయపడి గట్టిగా అరిచింది అని మనోహరి అంటుంది.

అయ్యో నాన్న నా కోసం భయపడి ఏడుస్తున్నావా ఊరుకో అని అరుంధతి అంటుంది. అంజు నువ్వు ఏడవ కమ్మ నీకు నేనున్నాను కదా అని అంటుంది భాగమతి. సరే సరే ఇప్పటికే లేట్ అయింది అందరూ వెళ్లి పడుకోండి అని శివరామ్ అంటాడు. అంజలిని మి గదిలో పడుకోబెట్టుకోండి అని అమరేంద్ర అంటాడు. భాగమతి పిల్లల్ని తీసుకువెళ్లి వాళ్ళ రూంలో పడుకోబెడుతుంది. అందరూ వెళ్ళిపోగానే మనోహరి డోర్ గట్టిగా వేసుకొని, ఇప్పుడు ఎందుకు ఈ అమ్మాయికి అ కల వచ్చింది ఇప్పుడిప్పుడే అరుంధతి పేరును మర్చిపోతున్నారు సడన్గా మళ్లీ ఇలా జరుగుతుందేంటి అని మనోహరి టెన్షన్ పడుతుంది. కట్ చేస్తే పిల్లల్ని పడుకోబెట్టి మిస్సమ్మ కిందికి దిగుతూ ఉండగా తన కాలికి స్టూల్ తగులుతుంది. చూసుకొని వెళ్ళు జాగ్రత్త అని అమరేంద్ర అంటాడు.

కళ్ళు మండుతున్నాయి సార్ అందుకే కళ్ళు మూసుకొని నడుస్తున్నాను, కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు సార్ యాక్సిడెంట్ అయిన ప్లేసులో మీరు అంజలి ఉన్నారని తెలిసింది కానీ యాక్సిడెంట్ చేసిన లారీ ఆగకుండా ఎందుకు వెళ్ళిపోయింది, అయినా మీరు గట్టిగానే ఎంక్వయిరీ చేసి ఉంటారులే సార్ అని భాగమతి అనుకుంటూ వెళ్ళిపోతుంది. అమరేంద్ర ఆలోచించడం మొదలు పెడతాడు. కట్ చేస్తే బాలిక నువ్వు ఎక్కడ ఉన్నావు ఇక్కడే నా పక్కనే ఉన్నట్టయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను బాలిక నువ్వు ఇన్ని రోజులు అనాధలా పెరిగావు అని బాధపడే దానివి కదా బాలిక కానీ నీకోసం బాధపడుతూ నీకోసం ఎదురు చూస్తూ ఉండే ఒక నాన్న ఒక చెల్లి ఉన్నారు బాలిక, నీకోసం వెతుకుతున్నారు నువ్వు ఎక్కడ ఉన్నావొ వారికి తెలియదు బాలిక నీ వాళ్లకు తెలిసేలోపు మనం ఇక్కడ నుండి బయలుదేరి మా లోకమునకు వెళ్ళవలెను అని గుప్తా అంటాడు.ఏంటి గుప్తా గారు ఇందాక చెల్లి నాన్న అంటున్నారు

ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి గుప్తా గారు నేను నీ పక్కనే ఉన్నాను అని అరుంధతి అంటుంది. చూడు బాలిక మా లోకంమునా ఉండు రాక్షసులకన్నను ఈ భూలోకమున ఉండే మనుషులే ప్రమాదకరమైన వాళ్ళు అమావాస్య పోయే సమయం వరకు మా లోకమునకు పోవాలి బాలిక నా అంగుళీకము నాకు ఇవ్వు బాలికా, లేదంటే ప్రమాదం జరిగిపోవుచున్నది నువ్వు ఇక్కడే ఉంటే మునుముందు జరగబోయే సమస్యలను ఎదుర్కోలేక సతమతమైపోతావు బాలిక అని గుప్తా అంటాడు. అరుంధతి ఏం జరుగుతుంది అని భయపడుతూ చెట్టుకు అనుకునే నిలబడుతుంది. రోడ్డు మీద నుంచి ఒక మాంత్రికుడు వెళుతూ అరుంధతిని చూసి ఆగి నాకు కావలసిన ఆత్మ దొరికినది ఆత్మను వశాoచేసుకుని ప్రపంచంలోనే శక్తిమంతుని అయిపోతాను అని గట్టిగా అరుస్తాడు. కట్ చేస్తే, రామ్మూర్తి గారికి వార్డెన్ ఫోన్ చేస్తుంది. వాళ్ళ బామ్మర్ది ఫోన్ ఎత్తి ఎవరు చెప్పండి అని అంటాడు. రామ్మూర్తి గారు లేరా అని వార్డెన్ అడుగుతుంది.

ఇప్పుడైతే ఉన్నాడు తర్వాత ఉంటాడో పోతాడో తెలవదు అని వాళ్ళ బామ్మర్ది అంటాడు. ఎవడ్రా ఫోను అని వాళ్ళ అక్క ఫోన్ తీసుకొని మాట్లాడుతుంది. హలో ఎవరండీ రామ్మూర్తి గారు లేరా ఆయన సరస్వతి అడ్రస్ తెలిస్తే ఫోన్ చేసి చెప్పమన్నాడు సరస్వతి గారు హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారండి అని వార్డెన్ చెప్తుంది. ఇంతలో రామ్మూర్తి వచ్చి ఎవరే ఫోను అని అంటాడు. కంపెనీ వాళ్లండి అని వాళ్ళ ఆవిడ అంటుంది. వాళ్లకి కూడా మీలాగే పని పాట ఏమీ లేదు అని రామ్మూర్తి అంటాడు. కట్ చేస్తే రాథోడ్ బయటికి వెళ్లాలి కారు రెడీ చెయ్ అని అమరేంద్ర అంటాడు. ఇంతలో భాగమతి అరుపులు పెద్దగా వినపడతాయి. ఏంటి ఆ అరుపులు అమ్ములుకు ఏమన్నా అయిందా అని అమరేంద్ర అంటాడు. అమ్ములు పాప కాదండి మిస్సమ్మ కంట్లో హై డ్రాప్స్ వేసుకోమంటే ఏడుస్తుంది అని రాథోడ్ అంటాడు.

చిన్నపిల్లల ఏడుస్తుంది ఏంటి అని అమరేంద్ర పైకి వెళ్తాడు.ఏంటి మిస్సమ్మ ఇందాకట్నుంచి తెగ అరి చేస్తున్నావు ఇప్పుడేంటి నిన్ను పట్టుకొని హై డ్రాప్స్ వెయ్యాలా చిన్న పిల్లవా అని మనోహరి అంటుంది. చూడు మిస్సమ్మ ని భయం పోవాలంటే నీలా కంట్లో వేస్తాను చూడు అని నిర్మల అంటుంది. అమ్మగారు కళ్ళు మండే వాళ్ళ కంట్లో వేస్తే మంచిగా అవుతాయి మంచిగా ఉన్న వాళ్లకు వేస్తే కళ్ళు పోతాయి అమ్మగారు అని నీలా అంటుంది. ఇంతలో అమరేంద్ర అక్కడికి వస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది