Instagram: రోజు రోజుకి సాంకేతికత అభివృద్ధి చెందడంతో ఎన్నో ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రోజు రోజుకు కొత్త ఫీచర్లు అందుబాటులోకి రావడంతో ఫేస్ బుక్ ముందు వరుసలో ఉంటుంది. ఫేస్బుక్ ద్వారానే వినియోగదారుల డేటాను మరింత భద్రపరచడం కోసం ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మధ్య కాలంలో వరుసగా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూ ఇంస్టాగ్రామ్ యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.
ప్రస్తుతం వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్స్ ద్వారా డైరెక్టుగా మెసేజ్ ద్వారా ఇతరులతో కమ్యూనికేట్ అయ్యే అవకాశాన్ని కూడా ఇంస్టాగ్రామ్ కల్పించింది. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీ, ఐజిటివి, రీల్స్ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇదిలా ఉండగా ఇంస్టాగ్రామ్ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.ఇస్టాగ్రామ్లోని డిఫాల్ట్ సెట్టింగ్ కారణంగా, అపరిచితులు మిమ్మల్ని యాదృచ్ఛికంగా స్పామ్ గ్రూప్‌లకు యాడ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా తెలియని గ్రూప్ లో ఉండటంవల్ల వారు పెట్టే మెసేజ్ లు, వీడియోలు కొన్నిసార్లు మనకు చిరాకు తెప్పిస్తాయి. మనకు తెలియకుండా ఈ విధంగా మనల్ని గ్రూప్ లో ఎవరు యాడ్ చేశారనే ఆలోచనలు కూడా ఎన్నో వస్తుంటాయి. ఈ విధమైనటువంటి సమస్యలను నిర్మూలించడానికి ఇంస్టాగ్రామ్ తాజాగా సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.
ప్రొఫెషనల్ ఇంస్టాగ్రామ్ యూజర్స్ కు మాత్రమే:
ఇంస్టాగ్రామ్ లో మీకు ప్రొఫెషనల్ అకౌంట్ ఉంటే ఇటువంటి స్పామ్ గ్రూప్స్ సమస్యకు చాలా సులభంగా చెక్ పెట్టవచ్చు. ఈ సమస్య అరికట్టాలంటే మనం చేయాల్సిందల్లా ఒక్కటే. మన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయగానే ప్రొఫైల్ లోకి వెళ్లి అక్కడ పైన కుడివైపు ఉండే థ్రీ లైన్ మెన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆపై సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ప్రైవసీపై క్లిక్ చేసి, మెసేజెస్ను ఎంచుకోండి. అక్కడ ‘గ్రూప్స్‌లో యాడ్ చేయడానికి ఇతరులను అనుమతించు’ అనే సెక్షన్ లోకి వెళ్లి అక్కడ మీరు అనుసరించే వ్యక్తులను మాత్రమే ఎంచుకోవచ్చు. దీని ద్వారా తెలియని వ్యక్తులు మిమ్మల్ని స్పామ్ గ్రూప్ లో యాడ్ చేయడానికి వీలు ఉండదు.అయితే ఈ సరికొత్త ఫీచర్ కేవలం ప్రొఫెషనల్ ఇంస్టాగ్రామ్ ఫ్యూచర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక పర్సనల్ అకౌంట్ ఎప్పుడు అందుబాటులో వస్తాయనే విషయం గురించి స్పష్టంగా తెలియడంలేదు.