క్యాసినో నిర్వహకుడు చీకోటి ప్రవీణ్ ఇవేళ ఈడీ అధికారుల ముందు విచారణకు హజరైయ్యారు. దాదాపు ఏడు గంటల పాటు చీకోటి ప్రవీణ్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. థాయ్ లాండ్ లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ చీకోటి ప్రవీణ్ అక్కడి పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో వారం రోజుల క్రితం చీకోటి ప్రవీణ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. చీకోటి ప్రవీణ్ సహా మరో ఇద్దరికి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో కూడా చీకోటి ప్రవీణ్ ను ఈడీ అధికారుల విచారించారు.

ధాయ్ లాండ్ లో గ్యాంబ్లింగ్ విషయమై ఆర్ధిక లావాదేవీలపై ఈడీ అధికారులు చీకోటి ప్రవీణ్ ను ఇవేళ విచారించినట్లు తెలుస్తొంది. ఇవేళ ఈడీ విచారణ ముగిసిన తర్వాత చీకోటి ప్రవీణ్ ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడారు. థాయ్ ల్యాండ్ లో తాను ఒక ప్లేయర్ గా వెళ్లినట్లు చెప్పారు. ఆర్గనైజర్ గా తాను థాయ్ లాండ్ వెల్లలేదని చెప్పారు. థాయ్ లాండ్ లో గ్యాంబ్లింగ్ నిర్వహించిన వారు అంతా జైలులోనే ఉన్నారనీ, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను బెయిల్ తీసుకుని రాలేదని, ఫైన్ చెల్లించి విడుదల అయినట్లు తెలిపారు. ఇప్పట్లో క్యాసినో నిర్వహించే ఆలోచన లేదన్నారు. ఈడీ విచారణకు ఎప్పుడు పిలిచినా వెళ్తానని వారికి సహకరిస్తానని తెలిపారు.