NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: ద‌ళిత‌బంధు కేసీఆర్ కు బెడిసికొడుతోందా?

KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ద‌ళిత‌బంధు ప‌థ‌కం విష‌యంలో టీఆర్ఎస్ పార్టీ భారీ ప్ర‌చారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ ప‌థ‌కంపై ప్ర‌తిప‌క్షాలు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీ దీనిపై క్లారిటీ ఇస్తోంది. ప్రతిపక్ష పార్టీలు అనవసరమైన ఆరోపణలు మానుకొని దళిత బంధు పథకం కోసం సూచనలు సలహాలు ఇస్తే తప్పకుండా అధ్యయనం చేసి పరిశీలిస్తామ‌ని టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి అన్నారు.

Read More: KCR: కేసీఆర్‌ కు మ‌ద్ద‌తిచ్చిన కేంద్ర మాజీ మంత్రి.. పార్టీ మారడ‌మే మిగిలింది

టీఆర్ఎస్ నేత‌లు ఏమంటున్నారంటే…
దళిత బంధు పథకం విఫలమైతే నష్టపోయేది త‌మ పార్టీయేన‌ని క‌డియం శ్రీ‌హ‌రి అన్నారు. రాబోయే ఐదారు సంవత్సరాలలో రూ.25 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించి దశలవారీగా ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందే విధంగా ప్రయత్నం చేస్తామని కడియం శ్రీహరి అన్నారు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా దళితుల కోసం ఇంత కన్నా గొప్ప పథకం ఉంటే చెప్పండి, అధ్యయనం చేసి ఇక్కడ కూడా అమలు పరచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని క‌డియం శ్రీ‌హ‌రి చెప్పారు. రైతుబంధు ప్రవేశపెట్టినపుడు, 24 గంటల కరెంటు ఇస్తామన్నా.. ఇంటింటికీ నల్ల నీళ్లు ఇస్తామన్నా విమర్శలు వచ్చాయని పేర్కొన్న క‌డియం శ్రీ‌హ‌రి ఇప్పుడు ఆ పథకాలన్నీ నిర్విఘ్నంగా అమలు జరుగుతున్నాయ‌న్నారు. అలాగే దళిత బంధు ఇస్తామంటే విమర్శలు వస్తున్నాయన్నారు. ఎన్నో రకాల మేధోమథనం చేసిన తర్వాతే దళిత బంధు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని కడియం చెప్పారు.

Read More:

అధైర్య‌ప‌డవ‌ద్దు…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. దళిత జాతి బాగుపడాలని దళిత జాతి పేదరికాన్ని రూపుమాపడానికి దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు ప్రవేశపెట్టారన్నారు. హుజరాబాద్ నియోజకవర్గం శాలపల్లి గ్రామ శివారులో భారీ సభను ఈనెల 16వ తేదీన నిర్వహించడం జరుగుతుందని, ముందుగా కొంత మంది దళితులకు ప్రొసీడింగ్ ను అందిస్తారన్నారు. తర్వాత పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ లోని దళితులoదరికీ దలితబంధును ఇవ్వడం జరుగుతుందన్నారు. దలితులెవరు అధైర్య పడవద్దని బాల్క సుమన్ చెప్పారు.

author avatar
sridhar

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju