NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Congress: రాహుల్, ఖర్గేతో ముగిసిన పొంగులేటి, జూపల్లి భేటీ .. జూలై 2న ఖమ్మం సభలో పార్టీలో చేరిక

Advertisements
Share

Congress: ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాందీలతో తెలంగాణ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిల భేటీ ముగిసింది. జూలై 2న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో జూపల్లి, పొంగులేటి వారి అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సభకు రాహుల్ గాంధీని వారు ఆహ్వానించారు. ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ కు చెందిన దాదాపు 35 మంది నేతలు రాహుల్ గాంధీ, ఖర్గేను కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోయిన పలువురు నేతలు తిరిగి సొంతగూటికి చేరుతుండటం ఆనందంగా ఉందని అన్నారు. ఘర్ వాపసీ కార్యక్రమం జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, అందుకు పార్టీ నేతలు అందరూ సమిష్టిగా పోరాడాలని రాహుల్ దిశా నిర్దేశం చేసినట్లు నేతలు పేర్కొన్నారు.

Advertisements

 

పార్టీలో చేరిన వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఖర్గే హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నేతలు కేసి వేణుగోపాల్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ ఆలీ, మధుయాష్కీ, రేణుకా చౌదరి, సీతక్క తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూడు జిల్లాల నుండి వచ్చిన నేతలు రాహుల్ గాంధీ, ఖర్గేతో గ్రూపు ఫోటో దిగారు. సమావేశం అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ .. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం రావడం ఖాయమని పేర్కొన్నారు. రేపు స్ట్రాటజీ మీటింగ్ ఉందని, ఆ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో కార్యచరణ ప్రణాళికపై చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Advertisements

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అన్న భావన అందరిలో ఉందన్నారు కోమటిరెడ్డి. అందుకు ఉదాహరణే కేసిఆర్ మహారాష్ట్రకు వెళ్లి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారన్నారు. అక్కడ, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో లేకున్నా కాంగ్రెస్ ను కేసిఆర్ విమర్శిస్తున్నారనీ, బీజేపీకి మేలు చేసేందుకు, కాంగ్రెస్ మిత్ర పక్షాలను దెబ్బతీసేందుకే కేసిఆర్ పని చేస్తున్నారని ఎన్సీపీ నేత శరద్ పవారే అన్నారని గుర్తు చేశారు. తెలంగాణలో 75 నుండి 80 సీట్ల వరకూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావాన్ని సీనియర్ నేత జానారెడ్డి వ్యక్తం చేశారు.

Vijaya Sai: కులాల మధ్య, కుటుంబాల మధ్య కుంపట్లు పెడతారంటూ టీడీపీపై విజయసాయి విమర్శలు


Share
Advertisements

Related posts

Mental Health: ఇలా చేస్తే మానసిక ఒత్తిడి ఉఫ్..!!

bharani jella

ఆయన “అజేయు”డే… ఇక “కళ్లెం”వేయలేరు..!!

somaraju sharma

Mixed Vegetable: ఇడ్లీ అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా చేసి పెడితే ఒక్క ముక్క కూడా వదలరు..!

bharani jella