Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా కేసిఆర్ సర్కార్ ను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న రాహుల్ గాంధీ .. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే మేడగడ్డ బ్యారేజ్ ను స్వయంగా రాహుల్ గాంధీ ఇవేళ పరిశీలించారు. బ్యారేజ్ మొత్తం కలియ తిరిగి పరిశీలించడంతో పాటు స్వయంగా తన ఫోన్ లో ఫోటోలు, వీడియోలు తీశారు రాహుల్ గాంధీ.

బ్యారేజ్ కు అయిన డ్యామేజీ ఏమిటి..? ఎందుకు ఇలా జరిగింది..? లోపం ఎక్కడ, పిల్లర్లు కుంగిపోవడం వల్ల బ్యారేజ్ కి జరిగిన నష్టం ఎంత..? దీని వల్ల రైతులకు ఎలాంటి సాగునీటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు..? మరమ్మత్తులు చేయడానికి ఉన్న అవకాశాలు..? ఎన్ని రోజులు పడుతుంది తదితర విషయాలను బ్యారేజ్ ఇంజనీరింగ్ అధికారిని అడిగి తెలుసుకున్నారు రాహుల్ గాంధీ. గత నెల 21న మేడిగడ్డ బ్యారేజ్ లోని పిల్లర్ కుంగిపోయిన సంగతి తెలిసిందే. ఇవేళ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులతో కలిసి రాహుల్ గాందీ హెలికాఫ్టర్ లో బ్యారేజ్ వద్దకు వెళ్లి సందర్శించారు. కుంగిన బ్యారేజ్ ను పరిశీలించిన అనంతరం మేడిగడ్డ హెలిప్యాడ్ నుండి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు.
దీనిపై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా చేపట్టిన మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించానని ట్వీట్ చేశారు రాహుల్ .. కేసిఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసిఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంగా మారిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను దోచుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టును కేసిఆర్, ఆయన కుటుంబం తమ వ్యక్తిగత ఏటీఎంగా వాడుకున్నారని మండిపడ్డారు. నాసిరకం నిర్మాణం కారణంగా పలు స్తంభాలకు పగుళ్లు ఏర్పడ్డాయని, స్తంభాలు మునిగిపోతున్నట్లు రిపోర్ట్సు ఉన్నాయని తెలిపారు.
Chandrababu: చంద్రబాబుపై కొనసాగుతున్న కేసుల పరంపర.. మరో కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ