స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో దేవత సీరియల్ కూడా ఒకటి.. అనుబంధాలకు నిలయం అనే నిలయం అనే చక్కటి టాగ్ లైన్ తో బుల్లితెర ప్రేక్షకులను ఈ సీరియల్ ఎంతగానో అలరిస్తోంది.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ లో దేవత సీరియల్ 9.78 రేటింగ్ ని సొంతం చేసుకుని.. నాలుగవ స్థానంలో నిలిచి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.. గత కొన్ని వారాలుగా దేవతా సీరియల్ ఫోర్త్ ప్లేస్ లో కొనసాగుతూ వస్తుంది.. ఈ వారం కూడా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ సీరియల్ లో ఈ వారం జరిగిన హైలెట్స్ తో పాటు.. వచ్చేవారం కథను ఈ వైపుగా మలుపు తిరుగుతోందా అనేది తెలుసుకుందాం..
ఆదిత్య వరదలు రావడంతో తన టీం మొత్తాన్ని అలర్ట్ చేస్తాడు.. ఇక వరదలు వచ్చినప్పుడు ఎలాగా ప్రజలు నానా ఇబ్బందులు పడతారో.. వారికి ఎటువంటి సదుపాయాలు అందించాలి అనేది దేవికి స్వయంగా అర్థమయ్యేలా వివరించాలని అనుకున్నాడు.. రుక్మిణి కి ఫోన్ చేసి త్వరగా దేవి స్కూల్ దగ్గరికి రమ్మని చెబుతాడు. ఇక దేవిని తీసుకొని ఆ వరద ముప్పు ప్రాంతాలలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి జీవితాలు ఎలా చిన్నాభిన్నం అయ్యాయి అనేది దేవికి కళ్ళ ముందు కనిపిస్తాయి..
ప్రజలు అన్ని ఉండి ఇన్ని ఇబ్బందులు పడుతుంటే నీ దగ్గర అన్ని సదుపాయాలు ఉండి కూడా అమ్మను నువ్వు ఎంతగా బాధిస్తున్నావు.. మీ నాన్న గురించి నువ్వు తెలిసి తెలియక ఏదో మాట్లాడుతున్నావు .. అదే నువ్వు కలెక్టర్ అయిన తర్వాత మీ నాన్న ఎవరో నువ్వే తెలుసుకొవచ్చు.. ముందు నీ దృష్టి అంతా కలెక్టర్ చదువు మీద పెట్టమని చెబుతడు.. నిజం నీకు చెప్పకుండా అబద్ధం చెప్పిన వారి సంగతి తేల్చాలి అని ఆదిత్య దేవికి చెబుతాడు. ఇక ఆదిత్య మాటలు విన్న దేవి అసలు వాళ్ళ నాన్న గురించి ఆలోచించకూడదు అని నిర్ణయించుకుంటుంది.. ఇదే వచ్చేవారం హైలెట్ సీన్ కానుంది..
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!