స్టార్ మా లో ప్రసారమవుతున్న డైలీ సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ పిఆర్పి రేటింగ్స్ లో ఇంటింటి గృహలక్ష్మి 10.98 రేటింగ్ సొంతం చేసుకుని సెకండ్ ప్లేస్ లో నిలిచింది.. ఇంతకుముందు ఈ స్థానంలో గుప్పెడంత మనసు ఉండగా ఈ వారం ఆ సీరియల్ లో వెనక్కి నెట్టి.. ఇంటింటి గృహలక్ష్మి ముందు స్థానంలో నిలబడింది.. ఈ వారం జరిగిన ఎపిసోడ్ హైలెట్స్ తో పాటు ఈ సీరియల్ లో వచ్చేవారం ఏం జరుగుతుందో చూద్దాం..!
ఎప్పుడు ఫ్లైట్ అని తులసి మొదటిసారి సామ్రాట్ తో కలిసి తులసి ఫ్లైట్ లో ప్రయాణించనుందన్న ఆశ.. తన ఆనందానికి అవధులు లేకుండా చేస్తున్నాయి.. ప్రతి మధ్యతరగతి మనిషి కచ్చితంగా ఫ్లైట్ ఎక్కాలని అనుకుంటారు.. కానీ వారి బడ్జెట్‌కు ఆ ఆశ అందుబాటులో ఉండదని తెలిసిన విషయమే.. ఇక తులసి కూడా ఓ మధ్య తరగతి మహిళ.. తులసి ఫ్లైట్ టేక్ ఆఫ్ ఎంజాయ్ చేస్తుంటే సామ్రాట్ మాత్రం భయపడుతూ కనిపిస్తాడు.. ఏమైంది అని తులసి అడిగితే నాకు ఫ్లైట్ టేక్ ఆఫ్ అంటే భయం అండి అని అంటాడు.. మగాళ్లు స్వేచ్ఛగా భయపడాలి హ్యాపీగా భయపడండి వెంటనే మీకు రిలీఫ్ దొరుకుతుంది అని తులసి అంటుంది. ఈ డైలాగ్ చాలా బాగుంది నా స్క్రిప్ట్ లో రసుకోమంటారా అని బత్తాయి బాలరాజు అడుగుతాడు..
ఇక కొన్ని అనివార్య కారణాల వల్ల ఫ్లైట్ టేక్ ఆఫ్ లో ఇబ్బందులు ఎదురవుతాయని ఎయిర్ హోస్టెస్ వచ్చి చెబుతుంది.. అప్పుడే నందు ఆ ఎయిర్ హోస్టెస్ కి మా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అని తనని పక్కకు నెట్టేస్తాడు.. దాంతో కోపం వచ్చిన తులసి ఆ ఎయిర్ హోస్టెస్ ప్లేస్ లో మీ ఇంట్లో వాళ్ళు ఉంటే నువ్వు ఇదే పని చేస్తావా అని తులసి నందు నీ నిలదీస్తుంది. ఇక తులసి, సామ్రాట్ ఒక్కటవుతున్నరని తెలిసి నందు వాళ్ళని కనిపెట్టే పనిలో ఉన్నాడు.. ఇక నందు కోపం తో తులసి నేను మాజీ భార్య అనే చెప్పెడ్డం అని అనుకుంటాడు.. అంతలో లాస్య అడ్డుపడుతుంది.