Intinti Gruhalakshmi: ఇక తులసి సామ్రాట్ హనీ ముగ్గురు కలిసి గుడికి వెళ్తారు. ఇక అదే గుడిలో ఉన్న పరంధామయ్య ప్రసాదం తీసుకుంటూ.. మరొక కప్పు ప్రసాదం ఇవ్వమని అడుగుతారు. అక్కడ ఉన్న ఆయన పరంధామయ్యను చిదరించుకుంటాడు.. ఇక అనసూయమ్మ దగ్గరకు వెళ్లి మన కోడలికి మన ఇద్దరం బరువయ్యాము..
ఇక మన జీవితాన్ని ఇలాగే గడిపేయాలి.. కానీ మన రెండు పక్షుల్లో ఒక్క పక్షి దూరమైతే ఇంకో పక్షి ఏమైపోతుందో అని భయంగా ఉంది అనసూయ అని పరంధామయ్య అంటున్న మాటలను తులసి సామ్రాట్ వింటారు.. వాళ్ళిద్దరూ అలా బాధపడడానికి ఓ రకంగా తులసినే కారణం.. సామ్రాట్ వెళ్లి పరంధామయ్యకి ధైర్యం చెప్పబోతాడు అంతలో తులసి వద్దని అడ్డుకుంటుంది. మీ వల్లే మీ వాళ్ళు ఈరోజు బాధపడుతున్నారు అని అంటారు. అవును ఇలా వాళ్లకే సహాయం చేయడం ఇలా కాదు. ఇంకోలాగా సహాయం చేయాలి . కచ్చితంగా ఈ విషయం నందు గారికి తెలియదు. తెలిస్తే ఆయన ఊరుకోడు. లాస్య ఇదంతా చాలా తెలివిగా ప్లాన్ చేసింది. మనం కూడా అదే విధంగా ప్లాన్ ని తిప్పి కొట్టాలి అని తులసి అంటుంది.
లాస్య కి బెనర్జీ ఫోన్ చేస్తాడు. అర్జెంటుగా మీతో మాట్లాడాలి మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను అని చెబుతాడు. ఇక లాస్య బెనర్జీ దగ్గరకు వెళ్తుంది నేను మీ ఫ్రెండ్ ద్వారా ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాను. మీకు నేనే ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ సివిల్ వాళ్లకు సంబంధించినది.. నేను సాప్ట్ వేర్ కదా అని లాస్య అంటుంది.. మీరైతేనే ఈ ప్రాజెక్టు సక్సెస్ ఫుల్ గా చేయగలరని నాకు నమ్మకం ఉంది ఈసారి మీరు వచ్చేటప్పుడు మీ ఆయన నందుని కూడా తీసుకొని రండి ప్రాజెక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లైన్ చేస్తాను అని బెనర్జీ అంటాడు.
తులసి ఇంట్లోకి సరుకులు తీసుకుని వస్తుంది. ఏంటి ఈ సరుకులు అని లాస్య ప్రశ్నిస్తుంది .నువ్వు సరుకులు తీసుకురావాల్సిన అవసరం లేదు అని నందు అంటాడు. నా వాళ్ళు ఈ ఇంట్లో పస్తులు ఉండడం నాకు ఇష్టం లేదు అని తులసి అంటుంది. అవును అంకుల్ మొన్న తాతయ్య గారు పాలు లేక ఒట్టు డికాషన్ తో ఉండాల్సి వచ్చింది అని శృతి అంటుంది. నిన్న రాత్రి తాతయ్య గారికి షుగర్ డౌన్ షుగర్ డౌన్ అయితే లాస్య ఆంటీ దగ్గరకు వెళ్లి రాక కీస్ ఇవ్వమంటే ఇవ్వలేదు అని అంకిత చెబుతుంది. ఇక లాస్య వండారం మొత్తం తెలుసుకున్న నందు ఏం చేయనున్నాడో తర్వాయి భాగంలో చూద్దాం.