Categories: Telugu TV Serials

Karthika Deepam: జ్వాల ఖాతాలో మరొ ఇద్దరు శత్రువులు… పెళ్లి షాపింగ్ లో బిజీ అయిన నిరూపమ్, హిమలు..!

Share

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్. రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో సౌర్యకు ఆనందరావు, సౌందర్యలపై అనుమానం వచ్చి నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను సీసీ అనడంతో ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగిందనే చెప్పాలి.ఈరోజు కూడా అదే సీన్ కంటిన్యూ అవుతుంది.మా పిన్నీ, బాబాయ్ రాగానే అంతా వాళ్లకి చెప్పేసి ఊరు వదిలి వెళ్లిపోతాను..’ అంటుంది సౌర్య. ‘అలా ఎలా వెళ్లిపోతావే అలా వెళ్తే మేమేం కావాలి?’ అనేస్తుంది సౌందర్య కంగారులో. ఇక సౌర్య అదేంటి నేను ఎవరో మీరు ఎవరో.. ఏదో మనం రైల్లో ప్రయాణికుల్లా కలిశాం కదా సీసీ.ఎవరి స్టేషన్ రాగానే వాళ్లం దిగిపోతాం కదా అంటుంది జ్వాల అనుమానంగా చూస్తూ. ఇక వెంటనే సౌందర్య కవర్ చేస్తూ ‘అవును కానీ.. అనుకోకుండా ఇంతలా కలిసిపోయాం కదా అని అలా అంటున్నాం అంటుంది.. దాంతో సౌర్య మనసులో హమ్మయ్య నేను ఎవరో వీళ్లకి తెలినట్లే ఉంది అనుకుంటుంది.

రౌడీలను పోలీసులకు పట్టించిన జ్వాల :

ఇక సీన్ కట్ చేస్తే జ్వాల చీకటి అయిపోయిందని ఇంటికి వెళ్లే సమయంలో ఓ ఇద్దరు కంగారుగా వచ్చి ‘అమ్మాయి మంగల్‌ ఆర్ట్‌కి వెళ్లాలి’ అంటారు. ‘ఈ టైమ్‌లోనా..అది చాలా దూరం’ అంటుంది జ్వాల. నీకు ఎంత కావాలంటే అంత తీసుకో.. అర్జెంటు అమ్మా..కాదు అనకు’ అంటారు వాళ్లు.అయితే వాళ్లిద్దరూ చూడటానికి రౌడీల్లా ఉంటారు. ఇక ‘సరే ఎక్కండి అని ఆటో ఎక్కించుకుని ఎక్స్‌ట్రా డబ్బులేం అవసరం లేదులే’ అంటుంది జ్వాల. ఇక వెళ్తూ వెళ్తూ ‘రేయ్ మనం కలకత్తా రైలు అందుకుంటాం కదా? భయంగా ఉందిరా’ అంటాడు ఒకడు కంగారుగా. ‘రేయ్ ఏం భయపడకు.. ఈ ఐదు లక్షల కోసం.. పోలీసులు కలకత్తా దాకా రారులే.. మనం వెళ్తున్నాం అంతే’ అంటూ ధైర్యమిస్తాడు మరొకడు.వీళ్ళ మాటలు జ్వాల విని డైరెక్ట్‌గా ఆటోను పోలీస్ స్టేషన్ దగ్గర ఆపుతుంది. వాళ్లు షాక్ అవుతారు. పారిపోయే ప్రయత్నం చేయగా వాళ్ళని పట్టుకుని పోలీస్ సలకు అప్పగిస్తుంది. ఎస్‌ఐ ‘ఎవరమ్మా వీళ్లు?’ అనడంతో జ్వాలతో. ‘వీళ్ల 5 లక్షలు దొంగతనం చేసి.. కలకత్తా పారిపోవాలి అనుకుంటుంటే తీసుకొచ్చాను సార్’ అంటుంది జ్వాల. వెరీ గుడ్ అమ్మా అని. జ్వాలను పొగుడుతాడు.రౌడీలు మాత్రం జ్వాలని చూస్తూ రగిలిపోతారు.

నిరూపమ్ ను చూసి ఎమోషనల్ అయిన జ్వాల :

ఇక జ్వాల మరో కిరాయి తీసుకుని మరో చోటకి వెళ్తుంది. ఆటో దిగిన వ్యక్తి 5 వందలు చిల్లరి లేదు అనడంతో చిల్లర కోసం అక్కడున్న వారందరినీ అడుగుతుంది. అప్పుడే కారు ఎక్కబోతున్న నిరుపమ్‌ని వెనుక నుంచి ‘సార్ 5 వందలు చిల్లర ఉందా?’ అని అడుగుతుంది జ్వాల. వెనక్కి తిరుగుతాడు నిరుపమ్. ఆ కారులో హిమ ఉంటుంది. వాళ్ల మాటలు వింటుంది. నిరుపమ్ వెంటనే 5 వంద నోట్లు తీసి జ్వాలకు ఇచ్చి జ్వాల దగ్గర ఉన్న 5 వందల నోట్ తీసుకుంటాడు.‘ఏదొక అద్భుతం జరిగి వీళ్లు కలిస్తే బాగుండు.. వీళ్ల పెళ్లి అయితే బాగుండు.. నేనేం చెయ్యలేకపోతున్నా’ అని హిమ లోపల కూర్చుని బాధపడుతుంది. మరోవైపు జ్వాల ఇంటికి వచ్చి నిరుపమ్ ఇచ్చిన డబ్బుల్ని చూస్తూ ఎమోషనల్ అయ్యి ఆ డబ్బులను దాచుకోవాలి అనుకుని దేవుడి దగ్గరకు తీసుకుని వెళ్లి పెడుతుంది.

జ్వాలకు సన్మానం:

సీన్ కట్ చేస్తే.. ఓ ఇద్దరు పెద్దవాళ్లు జ్వాల ఇంటికి వచ్చి అమ్మా జ్వాల అంటే మీరే కదా.. దొంగల్ని పట్టించి చాలా గొప్ప పని చేశారు.. మేము హైదరాబాద్ క్లబ్ నుంచి వచ్చాం.పోలీసులు మాకు మీ అడ్రస్ ఇచ్చారు. మీరు చేసిన మంచి పనికి మీకు అవార్డ్ ఇవ్వాలనే వచ్చాం.. ఈ ఇన్విటేషన్‌లో టైమ్, ప్లేస్ అన్ని వివరాలు ఉన్నాయి.. మీరు తప్పకుండా రావాలి’ అని చెబుతారు. నాకు అవార్డ్‌లు అవీ ఎందుకు సార్’ అంటుంది జ్వాల. ‘లేదమ్మా నీలాంటి వాళ్లు ఆదర్శంగా నిలబడినప్పుడే కదా.. మిగిలి వాళ్లు స్పూర్తిని పొందేది.. మీరు తప్పకుండా రావాలి’ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతారు వాళ్లు.

పెళ్లి షాపింగ్ లో నిరూపమ్, హిమలు:

మరోవైపు హిమ తన తల్లిదండ్రుల ఫొటో ముందు నిలబడి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో నిరుపమ్ వచ్చి.. ‘పద హిమా పెళ్లి షాపింగ్ చేద్దాం అంటూ హిమను తీసుకుని వెళ్తాడు.ఇక దారిలో కొబ్బరి బొండాలు తాగుతారు హిమ, నిరుపమ్‌లు కొబ్బరి బొండాలు తాగిన తర్వత జ్వాల ఇచ్చిన 5 వందల నోట్ తీసుకుని.. బొండాలమ్మే వ్యక్తికి నిరూపమ్ ఇవ్వడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Share

Recent Posts

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

8 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

59 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

1 గంట ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago