NewOrbit
Telugu TV Serials

Karthika Deepam: ఎవరు ఉహించని విధంగా జ్వాల రక్తాన్ని కళ్ళ చూసిన నిరూపమ్..!

Share

Karthika Deepam:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో జ్వాలని.. హిమ నిరుపమ్‌ల పసుపు కొట్టే ఫంక్షన్‌కి పిలుస్తాడు.అయితే శోభా మాత్రం జ్వాలని ఫంక్షన్ కు వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఈ క్రమంలోనే సారీ చెప్పడానికి ఆసుపత్రికి వచ్చిన జ్వాలతో హిమ గురించి నిజం చెప్పాలి అనుకుని మాట్లాడాలి రా అంటాడు. కానీ హిమ నేను వస్తాను అని అడ్డుపడుతుంది.ఇక హిమ నేను వస్తాను అనడంతో.. జ్వాల హిమ మీద కోప్పడుతుంది. ‘తింగరీ ఎందుకు వస్తా అంటున్నావ్..? నాకేం అర్థం కావట్లేదు.. మేము చాలా మాట్లాడుకోవాలి. ప్లీజ్ ఇలా అడ్డు పడొద్దు చెబుతున్నా’ అనేసి.. హిమని వదిలేసి.. కోపంగా వెళ్లిపోతుంది. దాంతో హిమ బాధగా ‘బావ జ్వాలకు నిజం చెప్పేస్తాడేమో..’ అనుకుంటూ ఆసుపత్రి బయటికి నడిచి వస్తూ ఉంటుంది.

karthika deepam latest episode
karthika deepam latest episode

సౌందర్యకు శోభ పెట్టిన కండిషన్ ఏంటి..?

ఆసుపత్రి బయట కారు దగ్గర సౌందర్య హిమ, నిరూపమ్ లను తలుచుకుని బాధపడుతూ ఉంటుంది.ఇంతలో శోభ వచ్చి ‘మేడమ్ మీతో కాస్త మాట్లాడాలి అంటుంది.సరే చెప్పు అంటుంది సౌందర్య.మీ మనవరాలు హిమని మీ మనవడు నిరుపమ్ చేసుకుంటే అతడి జీవితం మూడునాళ్ళ ముచ్చట అవుతుందని మీ ఉద్దేశం కదా?’ అంటుంది శోభ. ‘ఇది చెప్పడానికి వచ్చావా’ అంటూ సౌందర్య అక్కడ నుంచి వెళ్లబోతుంది. కాదు అని సౌర్య గురించి చెబుతుంది.అయితే అప్పటికే హిమ బయటికి వచ్చి వాళ్లిద్దరినీ చూస్తుంది. కాస్త దగ్గరగా కారు పక్కకు వస్తుంది.ఇదేంటి సౌర్య గురించి మాట్లాడుతుంది?’ అని మనసులో అనుకుంటుంది సౌందర్య. ‘మీరు ఎంత వెతికినా.. పారిపోయిన మీ మనవరాలు మీకు దొరకను గాక దొరకదు’ అంటుంది శోభ. ‘హేయ్ ఏ మాట్లాడుతున్నావ్ నువ్వు?’ అని అరుస్తుంది సౌందర్య. ఇన్నాళ్లు కనిపించని మీ ముద్దుల మనవరాలు.. నాకు కనిపించింది..’ అని శోభ అనగానే.. ఇటు సౌందర్య.. అటు హిమ ఇద్దరు కూడా షాక్ అవుతారు. ‘సౌర్య ఎవరో ఈ శోభకు తెలిసిపోయిందా.. అంటే హిమను నేనే అని కాల్ చేసింది శోభయేనా అనుకుంటుంది హిమ మనసులో.

Advertisements
karthika deepam latest episode
karthika deepam latest episode

శోభకు, నిరూపమ్ కు సౌందర్యనే పెళ్లి. చేయనుందా..?

ఆ మాట వినగానే సౌందర్య కళ్లల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగి ఎక్కడ కనిపించింది? చెప్పు శోభా అంటుంది.మనవరాలు ఎక్కడుందో చెప్పు.. నీకు ఎంత కావాలి? ఏం కావాలి? అంటుంది.‘అడిగితే ఏం కావాలన్నా ఇస్తారా’ అంటుంది శోభ. ‘అడుగు.. ఇస్తాను’ అంటుంది సౌందర్య. అప్పుడే శోభ నిరుపమ్‌ని నాకు ఇచ్చి పెళ్లి చేయండి.. మీ మనవడు నా మెడలో తాళి కడితే మీ రెండో మనవరాలు మీ ఇంట్లో అడుగు పెడుతుంది’ అంటూ తన మనసులో మాట బయటపెడుతుంది శోభ. సౌందర్యతో పాటు.. అటువైపు నిలబడి వింటున్న హిమ కూడా షాక్ అయిపోతుంది.శోభా ఈ విషయం స్వప్నకు తెలుసా? అంటే లేదు అంటుంది.ఇక సౌందర్య ‘చూడమ్మా దీనికీ దానికీ లింక్ పెట్టకు పెళ్లి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం.. ముందు నా మనవరాలిని చూపించమ్మా’ అంటుంది సౌందర్య ఏడుస్తూ.అప్పుడే శోభ మీరు నన్ను నమ్మొచ్చు మేడమ్. మీ మానవరాలిని చూపించే బాధ్యత నాది అంటుంది. హిమ ఆ వెనుకే ఉండి సౌందర్యనే గమనిస్తుంది.

రక్తంతో నిరూపమ్ బొమ్మ గీసిన జ్వాల:

ఇక జ్వాలని నిరుపమ్ ఆశ్రమానికి తీసుకుని వెళ్తాడు. చాలా కోపంగా ‘నువ్వు ఏమి చేస్తున్నావో నీకు అర్థమవుతుందా జ్వాలా?’ అంటాడు.తెలుస్తోంది డాక్టర్ సాబ్’ అని నవ్వుతుంది జ్వాల. ‘నవ్వుతావేంటీ.. నీకు చాలా చెప్పాలి’ అంటాడు నిరుపమ్. ‘తెలుసు డాక్టర్ సాబ్.. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి’ అంటూ జ్వాల.. నిరుపమ్ చెప్పేది వినకుండానే లోపలికి వెళ్తుంది.తిరిగి కాసేపటికి వచ్చిన జ్వాల.. పేపర్ మీద రక్తంతో గీసిన నిరుపమ్ బొమ్మని చూపిస్తుంది. అది చూసి నిరూపమ్ షాక్ అయిపోతాడు. ‘డాక్టర్ సాబ్ ఈ ప్రపంచంలో ఇష్టాన్ని చాలా మంది చాలా రకాలుగా చెప్పొచ్చు.. కానీ ఇది నా స్టైల్ అనుకోండి అంటుంది.మీరంటే అంత ఇష్టం నాకు పొద్దుట నుంచి రాత్రి దాకా మీరే నా లోకం డాక్టర్ సాబ్ అని అందుకే మీ బొమ్మని నా రక్తంతో గీశాను అని చాలా ఎమోషనల్‌ అవుతుంది.

karthika deepam latest episode
karthika deepam latest episode

అయోమయంలో నిరూపమ్ :

నిరుపమ్ ఆ బొమ్మనే చూస్తూ ఉండిపోతాడు. ఇష్టం అనేది కూడా చిన్న పదం డాక్టర్ సాబ్.. మీరు కాదు లేదు అని చిరాకులో చెప్పారంటే నా గుండె ఆగిపోతుంది. అందుకే ఇన్నాళ్లు చెప్పలేదు అంటుంది.నన్ను ఆటపట్టించడానికైనా నా మీద ప్రేమ లేదు అనొద్దు డాక్టర్ సాబ్ ఆ మాట విన్న వెంటనే నేను ఆ క్షణమే కన్ను మూస్తానేమో అంటుంది జ్వాల. నిరుపమ్ ఏం మాట్లాడలేక బాధగా అక్కడ నుంచి వెళ్లిపోతాడు.
సీన్ కట్ చేస్తే.. జ్వాల హిమ దగ్గరకు రాగ జరిగింది అంతా చెప్పి.. ‘డాక్టర్ సాబ్‌కి నా మీద కోపం పోయింది.. తెలుసా’ అంటుంది చాలా నవ్వుతుంది. ‘మా పెళ్లి చెయ్యాల్సిన బాధ్యత నీదే తింగరీ’ అంటూ మాట తీసుకోవడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.


Share

Related posts

Karthika Deepam: జ్వాలకు హిమాలాగా ఫోన్ చేసింది ఎవరు..??

Ram

Intinti Gruhalakshmi: తులసికి వార్నింగ్.. నందు, లాస్య లను ఆఫీస్ రావద్దన్న సామ్రాట్..! 

bharani jella

Karthikadeepam serial today episode review November 14:కార్తీక్, దీపలలో ఎవరిని మోనిత చంపేస్తుంది…!!

Ram