Telugu TV Serials

Karthika Deepam: నిజం తెలుసుకున్న జ్వాల ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది… హిమను చంపేయనుందా..??

Share

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో జ్వాల అవార్డ్ అందుకోవడానికి వస్తుంది. ఆ ఫంక్షన్ కు హిమ, సౌందర్య దంపతులు కూడా వస్తారు. ఇక అక్కడ తింగరి, హిమా ఒక్కరేనని జ్వాలకు తెలిసిపోతుంది. దాంతో హిమ చెంప పగలకొడుతుంది జ్వాల. ఈరోజు కూడా అదే సీన్ కంటిన్యూ కావడంతో సీరియల్ మరింత ఉత్కంఠగా మారింది అనే చెప్పాలి.

హిమ కల నిజం కానుందా..?

నువ్వు హిమవా? ఇన్నాళ్లు నాకెందుకు చెప్పలేదు?’ అని అరుస్తుంది జ్వాల. ‘సౌ..ర్య..అది అని ఏదో చెప్పే ప్రయత్నం హిమ చేయబోతుంటే చంపేస్తాను..మాట్లాడావంటే ఇంత మోసం చేస్తావా? నా పక్కనే ఉంటూ నన్ను వెన్నుపోటు పొడుస్తావా అని అరుస్తుంది సౌర్య. వెనక్కి తిరిగి.. సౌందర్య, ఆనందరావుల్ని చూస్తూ.. దన్నం పెడుతూ ఆహా ఆది దంపతులు మీరు.గొప్పవాళ్లండీ మీరు అంటూ సౌందర్య, ఆనందరావులను అంటుంది. ఇక హిమ మాత్రం సౌర్య నన్ను క్షమించు..’ అంటుంది. మళ్ళీ హిమను కొట్టి ఆ అవార్డ్ తీసి కిందకు విసిరేస్తుంది జ్వాల.అంతా చప్పట్లు కొడతారు. అప్పుడు తేరుకుంటుంది హిమ కలలోంచి. అంటే ఇదంతా హిమ కల అన్నమాట.

జ్వాలకు నిజంగానే అసలు విషయం తెలిసిపోయింది :

హిమ తేరుకున్న తర్వాత ‘రండి హిమ గారు.. జ్వాల గారికి అవార్డ్ ఇవ్వండి అనేసరికి తన పేరు హిమ అని జ్వాలకు అప్పుడు తెలుస్తుంది. ఇంతలో హిమ పైకి వస్తుంది. జ్వాల ఆ షాక్‌లో ఉండగానే శాలువా కప్పి అవార్డ్ చేతికి అందిస్తుంది హిమ. తేరుకున్న జ్వాల విసుకుగా నమస్తే డాక్టర్ హిమగారు.. కంగ్రాట్స్ చెప్పరా డాక్టర్ హిమ గారు అంటూ చేయి చాపుతుంది వెటకారంగా.అప్పుడు హిమ చేయి చాపితే తన చేతి మీద ఉన్న ‘ఎస్’ అనే పచ్చబొట్టు కనిపిస్తుందని సౌందర్య, ఆనందరావులు భయపడుతూ ఉంటారు. హిమ అలానే చేయి కదపకుండా ఉంటుంది.అప్పుడు జ్వాలకు అసలు నిజం తెలిసిపోతుంది.నేనొక రెండు మాటలు మాట్లాడొచ్చా’ అని నిర్వాహకుల్ని అడుగుతుంది జ్వాల.

నిప్పులు చెరిగిన జ్వాల :

హిమ కిందకు దిగబోతుంటే.. సౌర్య మైక్ దగ్గరకు వెళ్లి.. ‘డాక్టర్ హిమ గారు మీరు ఉండండి ప్లీజ్ అండి..ఎక్కడికి వెళ్తారండి..?’ అంటూ సౌందర్య వాళ్లని చూస్తుంది జ్వాల.అందరికీ నమస్కారం. నాకు అవార్డ్ ఇచ్చిన మీకు పెద్ద నమస్కారం.. పెద్దలు కదా మీరు అంటూ సౌందర్య వాళ్ల వైపు చూస్తూ అంటుంది.డాక్టర్ హిమగారు.. మీరు ఎందరి ప్రాణాల్లో కాపాడి ఉంటారు.. కదా? మీకు మహా నమస్కారాలు.. వేలవేల నమస్కారాలు..గొప్ప డాక్టర్.. గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చిన డాక్టర్ హిమగారి చేతుల మీదుగా అవార్డ్ అందుకోవడంతో నా జన్మ దన్యమైంది. మిమ్మల్ని మీరు ఇచ్చిన గొప్ప అవార్డ్‌ని నేను జీవితంలో మరిచిపోలేను అంటుంది.ఆటో నడిపే నాకు అవార్డ్ ఇవ్వడం గొప్ప. నాకు ఆనందంతో కళ్లల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి.. సౌందర్య మేడమ్ నమస్తే మేడమ్.. ఆనందరావు సార్ నమస్తే సార్.. ఇదంతా మీ ఆధ్వర్యంలోనే జరిగింది కదా? మీ ఫ్యామిలీ గ్రేట్ సార్. గొప్పోళ్లు సార్ మీరు అంటూ దన్నం పెట్టి అవార్డ్ తీసుకుని జ్వాల వెళ్లిపోతుంది.

జ్వాలను తలుచుకుని ఎమోషనల్ అయిన నిరూపమ్ :

సీన్ కట్ చేస్తే నిరుపమ్ టీవీలో జ్వాలకు అవార్డ్ వస్తున్న న్యూస్ చూసి తెగ సంబరడపతాడు. వెంటనే స్వప్నను పిలిచి ‘మమ్మీ జ్వాలకు అవార్డ్ వచ్చింది చూడు. అమ్మమ్మ తాతయ్యా హిమ కూడా వెళ్లారు’ అని చూపిస్తాడు. స్వప్న ఆవేశంగా రిమోట్ లాక్కుని టీవీ కట్టేసి నిరూపమ్ మీద కోప్పడుతుంది. మమ్మీ తనకు అవార్డ్ వస్తే మనం ఎందుకు గొడవ పడుతున్నాం’ అంటూ తల్లికి సద్దిచెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ తరువాత జ్వాల తన ప్రేమను.. తనకు చెప్పిన మాటలను గుర్తుచేసుకుని నిరుపమ్ కాస్త ఎమోషనల్ అవుతాడు.

ఆందోళనలో సౌందర్య, హిమ, ఆనందరావులు :

ఇక సౌందర్య, ఆనందరావు, హిమలు ఫంక్షన్ అయిపోయాక.తిరిగి కారులో ఇంటికి వెళ్తూ ఉంటారు. కారు నడుపుతున్న సౌందర్య ఇలా జరిగిందేంటండి.ఇంకెప్పటికీ సౌర్య మనకు అందదని.. ఏదైతే జరగొద్దని మనం భయపడ్డామో అదే జరిగింది..’ అంటుంది బాధగా. ‘ఒకే చోట అందరి దొరికిపోయాం సౌందర్యా’ అంటాడు ఆనందరావు బాధగా. ‘నాన్నమ్మా భయమేస్తుంది నాన్నమ్మా.. సౌర్య ఏం ఆలోచిస్తుందో అంటుంది హిమ ఏడుస్తూ. ‘నీ తప్పు ఏముందే అందులో? దానికి మంచి చెయ్యాలనే చూశావ్’ అంటుంది సౌందర్య. ‘అసలు సౌర్య అందరినీ తిట్టేసినా బాగుండేది..’ అంటాడు ఆనందరావు. ‘అవునండి.. అరిస్తే కోపం పోతుంది కదండి.. అలా ఏం చెయ్యలేదు.. బాధను గుండెల్లోనే దాచుకుంది అంటుంది సౌందర్య. వెంటనే సౌందర్య కారు తిప్పుతుంది. ‘ఎక్కడికి సౌందర్యా’ అంటాడు ఆనందరావు. ‘నా రెండో మనవరాలి దగ్గరకి’ అంటుంది సౌందర్య.

కోపంలో జ్వాల ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది.?

సీన్ కట్ చేస్తే పాపం జ్వాల బాధగా, కోపంగా ఏడుస్తూ ఉంటుంది.ఆటో తిరగబడి, వదిలేదేలే అనే స్టిక్కర్ ముక్కలై ఉంటుంది. సౌర్య ఆటో ముందు నిలబడి పెద్దపెద్దగా అరుస్తూ ఏడుస్తుంది. హిమ మాటల్ని, చేసిన పనుల్ని అన్నింటినీ గుర్తు చేసుకుని తింగరే హిమ కావడం మోసం.. తెలిసి చెప్పకపోవడం మోసం..’ అని అరుస్తూ చివరికి నాన్నమ్మా.. తాతయ్యలు కూడా మోసం చేశారు అని ఏడుస్తుంది. ‘నేను నిన్ను ప్రేమించలేను.. మీ తింగరినే ప్రేమించాను..’ అనే నిరుపమ్ మాటలు కూడా గుర్తుకు వస్తాయి.నేను హిమని మాట్లాడుతున్నాను’ అని శోభ హిమలా మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ తల పట్టుకుని పెద్దగా ఏడుస్తుంది సౌర్య. అమ్మా,నాన్నా చూస్తున్నారా? ఇంత మోసమా? అంతా మనవాళ్లే అయినా నన్ను గోరంగా మోసం చేశారు..నాతో అందరు ఆడుకున్నారు నాన్నా..’ అంటూ అరుస్తూ ఏడుస్తుంది. వెంటనే కళ్లు తుడుచుకుని నేను ఏడవడం ఏంటీ.. మోసం చేసింది వాళ్లు..జీవితంలో ఇంకెప్పుడు మళ్లీ వాళ్ల మొహాలు చూడకూడదు అంటూ నేల మీదున్న వదిలేదేలే స్టిక్కర్స్‌ని బలంగా కొట్టడంతో సీరియల్ ముగుస్తుంది.


Share

Related posts

దేవత సీరియల్ టీఆర్పీ రేటింగ్ ఎంతంటే.!? వచ్చేవారం హైలైట్ ట్విస్ట్ ఇదేనా.!?

bharani jella

మోనిత కారు ఎక్కిన సౌర్య…. దీప వేసే నాటకం చూసి కార్తీక్ గతం గుర్తు చేసుకుంటాడా..??

Ram

వారణాసి రాకతో కధలో కీలక మలుపు… అదే నిజం కానుందా..?

Ram