Karthikadeepam :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1467 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు సెప్టెంబర్ 28 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి. జరిగిందో ముందుగా తెలుసుకుందాం.. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్లో ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తోంది. అయితే గత ఎపిసోడ్లో దీప తన జీవితంలో జరిగిన సంఘటనలను డ్రామా రూపంలో వేసి కార్తీక్ కు గతం గతం గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. మరో పక్క సౌర్య ఏమో మోనిత కంటపడుతుంది. మీ అమ్మా నాన్న చనిపోయారు అని సౌర్యను నమ్మిస్తుంది మోనిత. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి.
నాటకంలో కూడా జీవించేస్తున్న దీప :
కార్తీక్, డాక్టర్ ఇద్దరు పక్క పక్కనే కూర్చుని దీప వేసే నాటకాన్ని చూస్తూ ఉంటాడు.దీప మిగిలిన పాత్రలతో కలిసి తన కథని డ్రామా రూపంలో చూపిస్తుంటే కార్తీక్ దీప వేసే నాటకానికి బాగా కనెక్ట్ అవుతాడు. మోనిత, హిమ, సౌర్య, సౌందర్య, ఆనందరావు ఇలా ఒక్కో పేరు డ్రామాలో వస్తుంటే కార్తీక్ తలపట్టుకుని అసలు నాకేం అవుతుంది?ఈ పేర్లు అన్ని ఎక్కడో విన్నట్టు ఉందే అని అనుకుంటూ ఉంటాడు. మనం ఇన్ని సంవత్సరాలనుండి చూస్తున్న కార్తీకదీపం సీరియల్ ను దీప ఒక అరగంటలో మన కళ్ళకు కట్టినట్టు చూపించేస్తుంది.
గత జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకుంటున్న కార్తీక్
దీప ఇంట్లో ఇంట్లోంచి బయటికి వెళ్లినప్పటి నుంచి, కార్తీక్ చేత పడిన.అవమానాలు,కార్తీక్కి సౌర్య పరిచయం కావడం, హిమని పెంచడం అంతా నాటకం వేసి చూపిస్తుంది. అలాగే మోనిత నేను గర్భవతిని నా కడుపుకు కారణం కార్తీక్ అని చెప్పడం కూడా నాటకంలో చూపిస్తుంది. మోనిత పేరు వినగానే వెంటనే కార్తీక్ కుర్చీలో నుంచి లేచి మోనిత అంటూ అరుస్తాడు. పక్కనే ఉన్న డాక్టర్ కూర్చో కార్తీక్ మొత్తం నాటకం చూడు అని అంటాడు.దీప కళ్లనిండా నీళ్లతోనే ఆ సీన్స్ అన్నింటిలోనూ నటిస్తుంది.
కార్తీక్ ను కొట్టాలన్న కోపంలో డాక్టర్ :
ఆ కథ మొత్తం దీప వాళ్ల అన్నయ్య కూడా చూస్తూ ఇంత కష్టాలు పడ్డావా తల్లీ? అంటూ కంట నీళ్లు పెడతాడు. నీకు తోడబుట్టిన వాడ్నే అయితే ఈ మనిషిని నాలుగు పీకాలని ఉంది అనుకుని కార్తీక్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక కార్తీక్ మాత్రం ఈయనేంటి నా వంక ఇంత కోపంగా చూస్తున్నాడు’ అనుకుంటాడు కార్తీక్.
నాటకం చూసి కళ్ళు తిరిగి పడిపోయిన కార్తీక్ :
ఇక ఈ డ్రామాలో ప్రతి పేరు నన్ను చాలా ఇబ్బందిపెడుతున్నాయి.. అనుకుంటాడు. మొత్తానికీ కార్తీక్ ప్రతీది గుర్తొస్తూ ఉంటుంది.చివరికి యాక్సిడెంట్ సీన్ డ్రామాలో నడుస్తుండటంతో కార్తీక్కి మొత్తం గుర్తొస్తుంది. దీపా అంటూ కుర్చీలో నుంచి పైకి లేచి తలపట్టుకుని కింద పడిపోతాడు.ఇక దీప వాళ్ల అన్నయ్య పరుగున వెళ్లి కార్తీక్ని ఆసుపత్రికి తీసుకుని వెళ్తారు.
శివను కొట్టిన మోనిత :
సీన్ కట్ చేస్తే మోనిత సౌర్యను డ్రాప్ చేసి ఇంటికి వచ్చి సౌర్య గురించి ఆలోచిస్తుంది. కాసేపు అయ్యాక కార్తీక్ కార్తీక్ అని వెతుకుతూ ఉంటుంది. కార్తీక్ కనిపించడు. శివ పరుగున వచ్చి మేడమ్ సార్ ఇంట్లో లేరు ఇందాక ఆ వంటలక్క వచ్చి తీసుకుని వెళ్లింది అంటాడు. ఆ మాట విన్న వెంటనే శివను లాగిపెట్టి కొడుతుంది మోనిత.ఆవిడతో ఎందుకు పంపిచావ్..కార్తీక్ ను ఎక్కడికి తీసుకుని వెళ్లిందో ఏమో’ అంటూ కంగారు పడుతుంది. ‘మేడమ్.. మన కాలనీలో జరిగే ఉత్సవాల్లో వంటలక్క ఏదో డ్రామా వేస్తుందట.అది చూడగానికి సారే ఆవిడతో వెళ్లారు అంటాడు శివ. అసలు నిన్ను నమ్ముకుని కార్తీక్ ను వదిలి వెళ్లాను చూడు నాది తప్పు’ అనుకుంటూ పరుగుతీస్తుంది మోనిత.
కార్తీక్ కు గతం గుర్తుకు వచ్చేస్తుందా..?
మోనిత ప్రవర్తన చూసి అందరి పెళ్లాలు ఇలానే ఉంటున్నారా? డౌట్ లేదు మేడమ్ కచ్చితంగా సార్ భార్య కాదు అనుకుంటాడు శివ మనసులో. మోనిత ఆ డ్రామా జరిగే ఫంక్షన్ హాల్కి వెళ్లి చూస్తే అక్కడ ఎవరు ఉండరు.ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కార్తీక్ హాస్పిటల్ లో కళ్ళు తెరిచి దీప అని అంటాడు. దీప ఏడుస్తూ డాక్టర్ బాబు నేను మీకు గుర్తుకు వచ్చానా అని అడుగుతుంది. మౌనిత మాత్రం కొంపతీసి కార్తీక్ కి ఆ నాటకం చూసిన తర్వాత గతం మొత్తం గుర్తొచ్చేసిందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి కార్తీక్ కి గతం గుర్తొచ్చిందా లేదా అనే విషయం తెలియాలంటే రేపటి ఎపిసోడ్ దాకా వేచి ఉండాల్సిందే
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!