Krishna Mukunda Murari: శివ ఫోన్ తీసుకుని పారిపోయిన కృష్ణ వాళ్ల నాన్న కు ఫోన్ చేస్తుంది. నా కూతుర్నే ఎత్తుకెళ్లి నాకే ఫోన్ చేస్తావా అని శివన్న నంబర్ చూసి.. రేయ్ శివన్న అని అరుస్తాడు.. నాన్న నేను కృష్ణని అని కృష్ణ మాట్లాడుతుంది. అమ్మ తల్లి ఎక్కడున్నావ్ రా .. ఏం చేస్తున్నావ్ నువ్వు బాగానే ఉన్నావా అని చంద్రశేఖర్ అడుగుతాడు. నాన్న నేను హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాను. శివన్న దగ్గర నుంచి తప్పించుకున్నాను అని చెబుతుంది. అయితే నువ్వు అక్కడే ఉండు నేనే వస్తున్నాను అని చంద్రశేఖర్ అంటాడు. లేదు నాన్న నేనే నీ దగ్గరికి వస్తాను. వాళ్ళు నా వెంట పడుతున్నారు అని కృష్ణ చెబుతుంది..

కృష్ణ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి నాన్న అని పిలుస్తుండగా తన వెనుక నుంచి వచ్చిన శివన్న కృష్ణ నోరు నొక్కేస్తాడు. కృష్ణ ఇంకా రాలేదు అని చంద్రశేఖర్ కాల్ బ్యాక్ చేస్తాడు. ఈసారి శివన్న లిఫ్ట్ చేసి నీ కూతురు నా దగ్గర సేఫ్ గా ఉంది. రేపు మేమిద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత పూలదండలతో కనిపిస్తాము అని శివ చెబుతాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నా ఎదురుగా వచ్చి కనిపించమని చంద్రశేఖర్ శివకి వార్నింగ్ ఇస్తాడు.. పంచభూతాల సాక్షిగా మేమిద్దరం ఒక్కటవుతున్నాం అని శివ కాల్ కట్ చేస్తాడు.

మురారి గోపి ఫుల్లుగా తాగేసి వచ్చి భవానితో ఇద్దరి ప్రేమికులని విడదీయడం కరెక్ట్ కాదు. ప్రేమికులను విడదీస్తే వాళ్ళిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండరు. ఆ ప్రేమ జంట ఎవరో మీకు తెలుసా అని గోపి చెప్పబోతాడు. రేయ్ తాగేసి ఏం వాగుతున్నావ్ రా.. పద ఇక్కడ నుంచి అని మురారి గోపిని అక్కడి నుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. భవాని కి కోపం వచ్చి నువ్వు తాగి వచ్చి నా ముందు మాట్లాడడమే పెద్ద తప్పు. ఇంకా నువ్వు నాకు చెప్పేది ఏం లేదు. మురారి ఇలాంటి వాళ్లతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఇకనుంచి చేయవని నేను అనుకుంటున్నాను అని భవాని అంటుంది. సరే పెద్దమ్మ అని మురారి గోపిని తీసుకెళ్లి రూమ్ లో పడేసి తలుపు వేస్తాడు. మురారి కోసమే వెతుకుతున్న ముకుందా తన దగ్గరకు వస్తుంది.
Krishna Mukunda Murari: ముకుంద మురారి ప్రేమించుకున్న విషయం ఆదర్శ్ కి తెలిసిపోయిందా.!?

నువ్వు నా ప్రేమను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు.. నువ్వు ఎందుకు నా ప్రేమని బాధని అర్థం చేసుకోవడం లేదు అని మురారిని ముకుందా ప్రశ్నిస్తుంది.. ముకుందా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో .. ఎవరైనా నిన్ను ఇక్కడ చూస్తే అస్సలు బాగోదు అని మురారి అంటాడు. నా ప్రశ్నకు సమాధానం చెప్పే వరకు నేను ఇక్కడి నుంచి కదలను అని ముకుందా ఉంటుంది. ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని ముకుంద ప్రశ్నిస్తుంది.
నీ మనసులో నేను ఉన్నాను. నాకు ఆ బాధ తెలీదా అని ముకుంద మురారిను నిలదీస్తుంది.. నేను ఎవరిని బాధ పెట్టడం లేదు ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు అని మురారి అంటాడు. అవునా అయితే అదే విషయాన్ని నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పమని ముకుందా అడుగుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ఆదర్శ్ ముకుందా మెడలో తాళి కడుతుండగా ఆ తాళిబొట్టు కింద పడిపోతుండగా.. ఆ తాళిబొట్టును మురారి గట్టిగా పట్టుకుంటాడు. నన్ను పడిపోకుండా పట్టుకుంటావు ఈసారి కూడా అలాగే కాపాడవు అని ఆదర్శ్ అంటాడు. మురారి చేతిలో ఉన్న తాళిబొట్టును ఆదర్శ్ కి ఇచ్చి ముకుందా మెడలో తాళి కట్టమని మురారి చెబుతాడు. మురారి చూస్తుండగానే ఆదర్శ్ ముకుందా మెడలో తాళి కడతాడు.