Krishna Mukunda Murari: నాతో కాకుండా మీరు ఎప్పుడు బయటకు వెళ్లినా కూడా రెస్టారెంట్ కి వెళ్ళిన ప్రతిసారి నేనే మీకు గుర్తొస్తాను. అందుకే నేను మీకు వడ్డిస్తాను. నా స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీతో పాటు ఉండను కదా.. అప్పుడు నేను మీకు ఈ విధంగా గుర్తొస్తాను అని కృష్ణ అంటుంది. సరే నేను కూడా వడ్డిస్తాను అని మురారి అంటే వద్దు నేను రెస్టారెంట్ కి వెళ్ళను వెళ్ళినా కూడా మీ జ్ఞాపకాలు నాకు వద్దు అని కృష్ణ అంటుంది..

Intinti Gruhalakshmi: నాకు లైఫ్ పార్టనర్ ఉన్నారని బాంబ్ పేల్చిన తులసి.. లాస్య, నందు, సామ్రాట్ షాక్..
మరోవైపు ముకుందా మురారి వాళ్ళని ఫాలో అవుతుంది మురారి కృష్ణతో కలిసి ఉన్న మూమెంట్స్ ఫోటోలో క్యాప్చర్ చేసి అవి మురారి కి పంపిస్తుంది. వాళ్ళిద్దరి ఆనందాన్ని చూసి ముకుంద కొన్ని చస్తుంది . మురారి ఎందుకు ముకుందా ఇలా చేస్తుందా అని ఆలోచనలో పడతాడు. కృష్ణకి నేను దగ్గర అవడం ఎందుకు ముకుందా సహించలేక పోతుంది అని ఆలోచనలో పడతాడు..

Krishna Mukunda Murari: హానిమూన్ వెళ్లనున్న మురారి, కృష్ణా.. ఎలా ఆపాలో ఆలోచిస్తున్న ముకుంద..
మురారి కృష్ణ ఇంటికి వచ్చిన తరువాత సాధారణంగా పెళ్లి అయిన ప్రతి అంతా హనీమూన్ ప్లాన్ చేసుకుంటారు కదా .. మీరు ఎందుకు ప్లాన్ చేసుకోలేదు అని భవాని అంటుంది. ఇప్పుడు మీరు హనీమూన్ ప్లాన్ చేసుకోండి. ఎక్కడికైనా వెళ్ళిరండి అని మురారి వాళ్లకి చెబుతుంది భవాని. మురారి వాళ్ళ వైపు కోపంగా ముకుందా చూస్తుంది.

మురారి కృష్ణతో కలిసి హనీమూన్ కి వెళ్లడం వెళ్ళడానికి సరే అని అంటాడు. కృష్ణ కూడా సరే అని భవానితో అంటుంది. కానీ మురారి తన రూమ్ లోకి వెళ్ళినప్పటి నుంచి హనీమూన్ కి వెళ్లడం కరెక్ట్ కాదని అనుకుంటాడు . అప్పుడే కృష్ణ తన దగ్గరకు వచ్చి మీరు నన్ను హనీమూన్ కి తీసుకు వెళ్ళాలి అనుకుంటే.. మనిద్దరం కలిసి బయటకు వెళ్లిన మరు నిమిషమే నేను హాస్టల్లో ఉంటానని చెబుతుంది కృష్ణ. దాంతో మురారి షాక్ అవుతాడు.

ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ మురారి మాట్లాడుకుంటూ ఉండగా.. మురారి ఫోన్ కి ముకుందా కాల్ చేస్తుంది. ముకుందా ఫోన్ ని కృష్ణ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. కృష్ణతో మాట్లాడుతున్న ముకుందా గతంలో తను ఎవరినైతే ప్రేమించిందో.. ఆ విషయాన్ని కృష్ణతో చెబుతుంది. ఏమైంది ముకుందా నీతోనే ఏం మాట్లాడింది అని అడగగానే.. తను గతంలో ఒకరిని ప్రేమించింది అని మీతో చెప్పాను కదా.. ఆ వ్యక్తి ఎవరో చెప్పేసింది అని కృష్ణ మురారితో చెబుతుంది. ఏం చెప్పిందో అర్థం కాక పరిస్థితుల్లో మురారి ఉంటాడు.