Malli Nindu Jabili: గౌతమ్ మీ మేనల్లుడా అని సుమిత్ర అంటుంది. అవును నా మేనల్లుడే కౌసల్య మా వదిన నా తోడబుట్టిన అన్నయ్య కుటుంబం అని వసుంధర అంటుంది. వాళ్లందరూ మళ్ళీ షాక్ లో ఉంటారు. మీరందరూ ఆశ్చర్యపోతున్న ఇది మాత్రం నిజం కావాలంటే కౌసల్యని వెళ్లి అడగండి అని వసుందరం అంటుంది. మీరు ముందే మాకు ఈ విషయాలు ఎందుకు చెప్పలేదు అని అనుపమ అoటుంది. ఏ విషయమైనా నేను అనవసరంగా చెప్పను అని వసుంధర అంటుంది. మరి మీరు ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అవసరం ఇప్పుడు లేదు కదా అని అనుపమ వాళ్ళ ఆయన అంటాడు.

గౌతమ్ ని కౌసల్యని అడ్డం పెట్టుకొని ఆ మల్లి ఏదైనా చేస్తుందేమోనని మీకు చెబుతున్నాను మాలినికి ఏమి జరగకుండా మీరు చూసుకోండి మల్లిని నేను ఒక రోజు తల బద్దలు కొట్టాను అది గుర్తుపెట్టుకొని మాలిని మీద ఎటాక్ చేస్తుంది అలాంటివి జరగకుండా చూసుకోమని మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను అని వసుంధర అంటుంది. అనుమానం పెనుభూతం వసుంధర గారు మీరు ఇకనైనా మారండి అని అరవింద్ అంటాడు. ముందు నువ్వు మారు అరవింద్ అని వసుంధర అంటుంది. చూడు వసుంధర గారు మాలినిని ఏమైనా ఆ మల్లి చేస్తే మేము చూస్తూ ఊరుకుంటామా అని సుమిత్ర అంటుంది. అమ్మ మల్లి మీద అలాంటివన్నీ రుద్దకండి అని అరవింద్ అంటాడు. మనుషులను బట్టి మనస్తత్వాలను బట్టి మాట్లాడతారు అరవింద్ అని వాళ్ళ నాన్న అంటాడు.

గౌతమ్ మీ అమ్మకు మేనల్లుడు అని నీకు ముందే తెలుసా మాలిని మరి నాకెందుకు చెప్పలేదు అని అరవింద్ అంటాడు. తెలుసు అని మాలిని అంటుంది నువ్వు ఏదైనా మాకు చెప్పే చేస్తున్నావా అరవింద్ మల్లిని నువ్వు పెళ్లి చేసుకుని మొదటిసారి ఇంటికి తీసుకు వచ్చినప్పుడు మాకు చెప్పావా అని మాలిని అంటుంది. గతాన్ని ఎందుకు తోడుకుంటున్నావు మాలిని అని అరవింద్ అంటాడు.ఆ మల్లి వల్ల నా కూతురికి ఏమైనా జరిగితే మిమ్మల్ని కూడా ఊరికే వదిలిపెట్టను గుర్తుపెట్టుకోండి అని వసుంధర గారు వెళ్ళిపోతుంది. ఎంతసేపు మల్లి మంచిది కాదని మాట్లాడుకోవడం తప్ప మీకు వేరే పని లేదు అని అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మ గౌతమ్ కి మన రిలేషన్ గురించి తెలిశాక ఇంత కూల్ గా ఎలా ఉన్నాడు నాకు అర్థం కావట్లేదు అని మాలిని అంటుంది. నేను నీకు ఒక విషయం చెప్పాలి బేబీ మల్లి కి పెళ్లయిందని గౌతమ్ కి చెప్పేశాను అతను ఎవరో కాదు అరవింద్ అని కూడా చెప్పాను కానీ గౌతమ్ మల్లి నీ బాగానే చూసుకుంటున్నాడు ఏం జరిగిందో ఏమో నాకు అర్థం కావట్లేదు అని వసుంధర అంటుంది.

నువ్వు తొందర పడ్డావు ఏమో అమ్మ అని మాలిని అంటుంది. మల్లి ఆనందంగా ఉండడం నాకు నచ్చలేదు అందుకే మల్లి చీర కైతే నిప్పు పెట్టాను కానీ అది మాత్రం కాళీ బూడిద అవ్వట్లేదు అని వసుంధర అంటుంది. నాన్నగారికి మీరా ఆ రెండో భార్యని తెలిసినా ఏమి అనట్లేదు అంటే మల్లి మన కన్నా ముందే తన గతం గురించి గౌతమ్ కి చెప్పి ఉంటుంది అమ్మ అందుకే సైలెంట్ గా ఉన్నాడు అని మాలిని అంటుంది. బ్రహ్మాస్త్రం పాశుపతాస్త్రం కంటే అసూయ అనే అస్త్రం చాలా పవర్ ఫుల్ అది ఆనందంగా ఉండడం నాకు నచ్చట్లేదు చాలా అసూయగా ఉంది తన జీవితం ముందు ముందు ఎలా ఉంటుందో చూద్దువు గాని ఉండు అని వసుంధర వెళ్ళిపోతుంది.కట్ చేస్తే నల్లపూసల వంక అలా చూసుకుంటున్నావ్ ఏంటి మల్లి అని గౌతమ్ అంటాడు. అమూల్యమైన వస్తువుల్ని చూస్తూ ఉంటే చానా ఆనందంగా అనిపిస్తుంది అని మల్లి అంటుంది. అవునా అయితే అవి లోపల వేసుకో దిష్టి తగులుతుంది అని గౌతమ్ అంటాడు.

బయట వాళ్ళు చూస్తే తగులుతుంది కానీ భర్త చూస్తే ఏమీ అవ్వదండి అని మల్లి అంటుంది. నీతో పరిచయం ఒక వింత నీతో పరిణయం నాకు అది ఆనందం నువ్వు నా పక్కన ఉంటే స్వర్గం అయినా గెలిచేస్తా మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది మనం నచ్చనప్పుడు దూరం మంచిది అని అంటారు కానీ నీ దగ్గర మాత్రం దూరంగాగాని మౌనంగాగాని ఉండలేను నిన్ను నేను అర్థం చేసుకున్నాను నువ్వు నా దగ్గర స్వేచ్ఛగా ఉండొచ్చు సరేనా అని గౌతమ్ అంటాడు. సరే అని మల్లి అంటుంది.కట్ చేస్తే శంకర్ పని చేసిన ఆఫీస్ కి ఫోన్ చేసి శంకర్ ఫోన్ నెంబర్ ఒకసారి ఇస్తారా అని అరవింద్ అడుగుతాడు. సరే ఎలాగైనా తెలుసుకొని మీకు ఆ నెంబర్ ని తెలియజేస్తాను అని మేనేజర్ అంటాడు.

ఇక ఆ ప్రయత్నాన్ని మానేయండి నువ్వు చెప్పిన గౌతమ్ నమ్మడు అని మాలిని అంటుంది. ఎందుకు నమ్మడు మల్లి విషయంలో నువ్వు పేపర్లో వేయించిన అతని పట్టుకొని నిరూపిస్తే నమ్మాడు కదా ఇప్పుడు అలాగే నమ్ముతాడు అని అరవింద్ అంటాడు. నువ్వు తప్పు చేయలేదని నీ మనస్సాక్షికి తెలిసినప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది అని మాలిని అంటుంది. ఇవన్నీ కోట్లు చెబితే ఊరుకుంటారా అని అరవింద్ అంటాడు. ఇప్పుడు నిన్ను కోర్టుకు ఎవరు లాగుతున్నారు అని మాలిని అంటుంది. మనస్సు అనే కోర్టు ఒకటి ఉంది కదా మాలిని అని అరవింద్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది